శుభం భూయాత్
ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు శ్రీ జివిఎల్ నరసింహారావు ఎన్నో ఏళ్ళక్రితం
మా పెద్ద అబ్బయి శాస్త్రి కి IRMA ఆనంద్ లో క్లాసుమేట్. NDDB ఆనంద్ గుజరాత్ లో పని చేసి, న్యూ ఢిల్లీ లో సెఫాలజిస్ట్ గా స్థిరపడ్డాడు. చాల చానెల్స్ కి ఎగ్జిట్ పోల్స్ చేశాడు. 1994 లో రామారావు పెద్ద మెజారిటీ లో గెలుస్తాడని. సర్వ్ చేసాడు. ప్రభుత్వం నిర్వహించే పధకాలు , PDS సర్వేలు నిర్వహిచే వారు.
హైదరాబాద్ లో మా పెద్దబ్బాయి శాస్త్రికి ,నాలుగవవాడు రమణకు .మా రెండోవాడు శర్మకు రూమ్ మేట్.అప్పటి ఆ పరిచయం అవిచ్చిన్నంగా కుటుబ బంధంగా కొనసాగుతోంది .ఆటను భార్యాసమేతంగా ఉయ్యూరు మా ఇంటికి వచ్చాడు మా శాస్స్త్రి తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటాడు రమణకు మంచి మిత్రుడు తరచూ ఈ ముగ్గురు ఫోన్ లోమాట్లాడుకుంటారు
.19 9 8 లో మేము బద్రీ కేదారనాద్ యాత్ర చేసి ఢిల్లీ ఆతని కుటుంబంతో ఒకగంట గడిపాము మంచి అవగాహన చొరవ ఉన్న మేధావిగా అతను మాకందరికీ బాగా పరిచయం ప్రధాని వాజ్ పాయి ముందస్తు ఎన్నికలు నిర్వహించినపుడు ఆయనతో పాటు బాబు కూడా మునిగిన సంగతి మనకు తెలుసు .అప్పుడు జివిఎల్ రాచకీయ విశ్లేషకుడుగా ఉన్నాడు ఫలితాల పోస్ట్ మార్టెం చేస్తూ ఆతను బెజవాడ ఐలాపురం హోటల్ లో సమీక్ష సమావేశం నిర్వహిచినప్పుడు ఆహ్వానం వస్తే నేనూ హాజరయ్యాను .అంచనాలు తలక్రిండైనందుకు చాలా బాధ పడ్డాడు ఆవిషయాలన్నీ అక్కడ తెలియజేశాడు .అది రెండవ సారి అతనిని చూడటం
తర్వాత ఎలెక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ పై ఆతను పుస్తకం రాసి నాకు పంపితే పూర్తిగా చదివి అతని భావాలతో ఏకీభావించాను .ఆవిషయం మెయిల్ ద్వారా ఫోన్ ద్వారా కూడా తెలియ జేసినట్లు గుర్తు .
2011 నుంచి మోడీ కి దగ్గర పని చెయ్యటం. గుజరాత్ స్టేట్ / పార్లమెంట్ ఎన్నికలలో ప్రజల నాడ్ తెలుసుకోవటం, అమిత్ షా కి బీజేపీ కి చాలా క్లోజ్ గా పనిచేసాడు.
NAMO – మోడీ ప్లాన్స్ లో కీలక పాత్ర వహించాడు.
ఇటీవల యుపినుంచి రాజ్య సభకు ఎన్నికైనందుకు అభినది౦చాము
. గుంటూరు బిడ్డడైన మన జివిఎల్ ను.త్వరలో కేంద్ర మంత్రిగా చూడాలని మా అందరి కోరిక నెరవేరుతుందని ఆశ -దుర్గాప్రసాద్
మంచి విశ్లేషకుడు, వ్యాఖ్యాత మరియు తర్క జ్ఞాని !చతురతతో అర్ణబ్ గోస్వామి డిబేట్ లలో చక్కని ప్రతిభని చూపించాడు !!
రాజ్యసభ సభ్యుడుగా నియమించబడడం ముదావహం !
పరిస్థితులు కలిసిరాక వెనువెంటనే సవాళ్లు_ప్రతిసవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది !! తెలుగుదేశం పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడాల్సి రావడం కాస్త కష్టతరమే అయినా నెగ్గుకురాగల నేర్పరే.
కాలమే జి.వి.ఎల్.న్ సమర్థతా, భవితవ్యం మరియు అభివృద్ధి నిర్ణయిస్తాయి ! గణేష్ దీవెనలు అనుగ్రహం ఎల్లప్పుడూ అతనికి వుండాలని ప్రార్థిస్తూ – ఈశ్వర్