అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి
అమెరికాలో ని షార్లెట్ లో ఉంటున్న మా అమ్మాయి చి సౌ కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సాంబావదాని తమ జ్యేష్ట పుత్రుడు(మా మనవడు ) చి .శ్రీకేత్ యశస్వి ఉపనయనం 2-4-2018 సోమవారం ఉదయం 8-07 గం.లకు హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ లోని అహోబిల మఠం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం లో శాస్త్రోక్తంగా తెల్లవారు ఝామున ౩- ౩౦ నుండి ఉదయం 11-30 వరకు 8 గంటల సేపు జరిగింది .చివరలో ఆరుగురు వేదపండితులు వేద స్వస్తి పలికి వేదగానం తో వాతావరణాన్ని పునీతం చేస్తూ దంపతులకు, వటువుకు వేదాశీర్వచనం చేశారు ,వారికి కోమలి దంపతులు తలొక 5 వేలరూపాయలు ,నూతన వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు .
ఆ తర్వాత మా మనవళ్ళు చి .ఆశుతోష్ ,పీయూష్ కవల సోదరులు షార్లెట్ లో తమ గురువు శ్రీమతి పోతుకూచి పద్మశ్రీ గారు నేర్పిన త్యాగరాజ మంగళహారతి కీర్తన ‘’జానకీ నాయక నీకు జయ మంగళం –నీకు శుభ మంగళం ‘’ను సుశ్రావ్యంగా గానం చేసి ఉపనయనానికి హాజరైన సుమారు 150 మంది రసజ్నులను అలరించారు .అందరు కరతాళ ధ్వనులతో తమ ఆనందాను భూతులను తెలియ జేసి చిర౦జీవులను ఆశీర్వదించారు .సరసభారతి తరఫున ఈ చిరంజీవులకు 2,11 6రూపాయలు నగదు కానుక అందజేసి ,శాలువా కప్పి ,శంకరాచార్యుల జ్ఞాపిక ను శ్రీ పోతుకూచి దంపతులు ,మా తమ్ముడు గబ్బిట కృష్ణమోహన్ ,అమెరికాలోని షార్లెట్ లో ఉంటున్న శ్రీ రాంకీ ,శ్రీమతి ఉష దంపతుల తలిదండ్రులు చేత అందజేయించి ఆశీర్వ దింపజేశాం .
ఆ పిమ్మట షార్లెట్ లో మా మనవళ్ళకు సంగీతం నేర్పిన శ్రీమతి పోతుకూచి పద్మశ్రీ తల్లిగారు శ్రీమతి పోతుకూచిగారు వయసుకు మించిన గాన సౌరభం తో సభాసదులను అలరించారు .ఆమెకు ,భర్తగారికీ సరసభారతి శాలువా కప్పి ,1,116 నగదుతో జ్ఞాపికతో గబ్బిట కృష్ణ మోహన్ , శ్రీమతి పారుపూడి ఉషా రాంకీ తలి దండ్రుల చేత సత్కరింప జేశాం .పోతుకూచి దంపతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు ధారాపాతంగా కారి, కృతజ్ఞత తో తడిసి ముద్ద అయ్యారు .మమ్మల్ని ఎంతో అభినందించారు .
ఉపనయనం చివరలో వచ్చిన హైదరాబాద్ ఆకాశవాణి కేంద్ర మాజీ డిప్యూటీ జనరల్ మాన్యశ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు ,ప్రపంచ ప్రసిద్ధ ఈల సంగీత విద్వాంసులు ,విజిల్ విజార్డ్ శ్రీ కొమరవోలు శివప్రసాద్ గారు దంపతులు విచ్చేయటం తో ప్రాముఖ్యత మరింత సంతరించు కొన్నది. వారికి ఘన స్వాగతం పలికి మా ఆనందాన్ని వ్యక్త పరచాం. వారు కూడా తమ ఆనందాను భూతిని వ్యక్తం చేశారు .ముందుగా నేను శ్రీ ఆదిత్య ప్రసాద్ గారిని అందరికి పరిచయం చేసి,వారి సంగీత విద్వత్తును తెలియజేసి , ప్రస్తుతం వారు అమరగాయకుడు ఘంటసాల సంగీత మాధుర్యాన్ని ,రాగాల పలకరింపులు లోని మెలకువలను లోకానికి తెలియ జేస్తూ ,సుస్వరాల ఘంటసాల స్వరాలను అజరామరం చేస్తున్నారనీ ,స్వయంగా ఫిడేల్ కచేరీ ,గానకచేరీ తోపాటు తానె జుగల్ బందీ కూడా నిర్వహిస్తూ ‘అపర ఘంటసాల ‘’అని పించుకున్నారని ఆయన సాధన ,తప,కృషి అనితర సాధ్యం అని ,హైదరాబాద్ రేడియో ద్వారా విశ్వనాథవారి ‘’వేయిపడగలు ‘’నవలను ధారా వాహికంగా ప్రసారం చేసి విశ్వనాధ కీర్తి కిరీటానికి మరొక కలికితురాయి ని అలం కరించారని నాపై, సరసభారతిపై వారికి అవ్యాజానురాగం ఉందని సరసభారతి కార్యక్రమాలకు తప్పక విచ్చేసేవారని గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-2 రెండవభాగం వారి అమృత హస్తాల చేత ఆవిష్కరి౦ప బడిందని,సరసభారతి ప్రచురించే ప్రతి ఆహ్వానం,ఆఇశ్కరిమ్పబదె ప్రతి పుస్తకం శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికే ముందు పంపిస్తానని ,అది నాకొక సెంటిమెంట్ అని ,వారుకూడా తాము చేసే ప్రతికచేరీ ప్రోగ్రాం ను నాకు పంపుతారని నేను అందరికీ ఫార్వార్డ్ చేస్తానని తెలియ జేయగా కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి .సరసభారతి తరఫున వారికి 2,116 రూపాయలునగదు కానుక శాలువా ,జ్ఞాపిక నూతన వస్త్రాలు పైన పేర్కొన్న పెద్దలచేత శివ ప్రసాద్ గారి సమక్షం లో సత్కరి౦పజేశాం .అనుకోకుండా జరిగిన ఈ సన్మానానికి వారు పొంగిపోయి ,తమ మనసులోని భావాలను వ్యక్తపరచి ‘’నేను దుర్గాప్రసాద్ గారిని సర్ప్రైజ్ చేయటానికే చివరలో వచ్చాను ‘’అని చెప్పి తమ అద్భుత గాన లహరి తో సభను ఆనంద పారవశ్యం లో ముంచి తేల్చారు .
శ్రీ శివ ప్రసాద్ గారిని సభకు పరిచయం చేస్తూ ఈల ను ఒక కళా రూపం గా తీర్చిదిద్ది ,దానిని విశ్వ వ్యాప్తం చేస్తూ ,ప్రపంచ రంగస్థలం పై ఈల కచేరి కి గుర్తింపు గౌరవం తెచ్చిన ఏకైక ఈల సంగీత కళా మర్మజ్నులని ,20 12 లో షార్లెట్ లో మా అమ్మాయి గారింట్లో మొదటి సారి పరిచయ భాగ్యం కలిగిందని అక్కడ రేడియోలో వారిని ఇంటర్ వ్యూ చేసే అదృష్టం కలిగిందని ,ఈ స్వల్ప పరిచయానికే ,వారిని సరసభారతి 20 14ఉగాది వేడుకలకు ఆహ్వానిస్తే తమ బృందం తో ఉయ్యూరు విచ్చేసి రెండున్నరగంటల సేపు గాన వాహినిలో తన్మయులను చేశారని వారి సౌజన్యం మరువలేనిదని తెలియ జేశాను .ఉపనయన ఆహ్వానాన్ని మెయిల్ చేయగానే చూసి తప్పక హాజరౌతానని బదులు రాసిన సహ్రుదయులని , అనుకున్నట్లుగానే విచ్చేసి తమ అభిమానం చాటారని తెలియజేయగానే ,చిరునవ్వులు చిందిస్తూ శివప్రసాద్ గారు తలపంకించారు .శివప్రసాద్ దంపతులకు సరసభారతి తరఫున 2 116 రూపాయల నగదుకానుక ,శాలువా ,జ్ఞాపిక సరసభారతి గ్రంధాలు అందజేసి ,మాన్యశ్రీ ఆదిత్య ప్రసాద్ గారితోపాటు పైన పేర్కొన్న పెద్దలతో సత్కరింప జేశాం .వారు మనసారా పులకరించిపోయారు ఈ హఠాత్ సత్కారానికి.దీనికి తగిన రీతిలో శివప్రసాద్ గారు స్పందించి మాట్లాడుతూ ఉయ్యూరుతో సరసభారతి తో కోమలి వారితో తమకున్న పరిచయాన్ని వివరించి కృతజ్ఞతలు తెలియజేసి ,చివరికి తమ ఈల సుస్వరాలతో జనాలను మంత్రం ముగ్ధులను చేసి ’’ విజిల్ విజార్డ్ ‘’ బిరుదాన్ని సార్ధకత చేశారు .సభలోని రసజ్నులందరూ ఈసంగీత’’ సూర్య చంద్రుల ‘’ప్రతిభకు తన్మయులై కరతాళ ధ్వనులతో అభినందన చందనం సమర్పించి కృతజ్ఞత చాటుకున్నారు .అనుకోకుండా సరసభారతి ఇంతటి ఘనకార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించటం అందరికి గొప్ప మధురానుభూతిగా నిలిచింది .
ఈ విధంగా మా మనవడు చి శ్రీకేత్ యశస్వి ఉపనయనం ఆద్యంతం ఆహ్లాదంగా వేదోక్తంగా సంగీత మాధుర్యంగా వన్నె కెక్కి అందరికి ఆనందం తో పాటు సంతృప్తిని కలిగించింది .అనుకోకుండాఉపనయనం చివరలో సరసభారతి 121 కార్యక్రమ౦గా మలుపు తిరిగిన ఈ వేద ,సంగీత రస ఝరి వైశాఖ మాస పవిత్రతను సంతరించుకున్నది .
శ్రీ విళంబి ఉగాది వేడుకలో సరసభారతి ఆవిష్కరించిన 1-నేను రాసిన’’ షార్లెట్ సాహితీ మైత్రీ బంధం’’(యాత్రా సాహిత్యం )- 2- 2017 శ్రీ హేవళంబి ఉగాది కవితల సంకలనం’’ వసుధైక కుటుంబం ‘’పుస్తకాలను ,శంకరాచార్యుల ‘’శివానంద లహరి’’ ని ఉపనయనానికి హాజరైన వారందరికీ అందజేశాం .ఈ కార్యక్రమాన్ని సరసభారతి 121 కార్యక్రమగా భావిస్తూ ,సరసభారతి హైదరాబాద్ లో అంటే మరొక తెలుగు రాష్ట్రం లోనూ కార్యక్రమం నిర్వహించిన ఘనకీర్తి దక్కించుకుని రికార్డ్ సృష్టించిందని సవినయంగా మనవి చేస్తున్నాను .
ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసిన మా అబ్బాయిలు, కోడళ్ళు, అమ్మాయి, అల్లుడు ,మనవళ్ళు మనవరాళ్ళు అందరు అభిన౦దనీయులు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
Reblogged this on సరసభారతి ఉయ్యూరు and commented:
———- Forwarded message ———-
From: Andukuri Sastry
Date: 2018-04-03 16:03 GMT+05:30
Subject: Re: అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి
To: gabbita prasad
వటువుకి ఆశీర్వచనములు.
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రయ ఆయుష్యేవేంద్రియే ప్రతి తిష్ఠతి
దుర్గాప్రసాద్ గారికి.
నమస్కారములు. ఎంతో తప్పకుండా వద్దామని అనుకున్నాను..జ్ణాపకం లేకపోవటం ఒక కారణమైతే stomach disorder ఇంకొక కారణము. మొన్న సంధ్యావందనం పుస్తకం ఆవిష్కర ణకు కూడా వెళ్లలేకపోయినాను.
మీరు వడుగు దృశ్యం కార్యక్రమాలు వర్ణించిన తరువాత . నా బాధ ఇంకా ఎక్కువ అయింది
వటువుకి
అగ్నిరాయుష్మాన్త్సవనస్పతిభి రాయుష్మాన్తేన త్వాzzయుషాzzయుష్మన్తం కరోమి
అగ్నిహోత్రుడు సమిత్తులచేత ఆయుర్దాయముకలవాడు. అటువంటి ఆయుర్దాయముచేత నిన్ను ఆయుర్దాయము గలవానినిగా చేసెదను.
యజ్ఞ ఆయుష్మాన్థ్సదక్షిణాభిరాయుష్మాన్తేన త్వా ఆయుషా ఆయష్మన్తం కరోమి
యజ్ఞము దక్షిణలచేత ఆయస్సు కలది. గాన అట్టి ఆయుస్సు చే నిన్ను ఆయుష్మంతునిగా జేసెదను
బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణై రాయుష్మత్
తేన త్వా ఆయుషా ఆయుషన్తమ్ కరోమి
బ్రహ్మము బ్రాహ్మణులచేత ప్రకటింప జేయబడుచున్నది .కాన ఆయుస్సుగలది అని చెప్పబడియె .అటువంటి ఆయుర్దాయముచే నిన్ను ఆయుర్దాయము గలవానిగా చేసెదను.
ACPSastry