ఇప్పుడే ఎల్బీ శ్రీరామ్ ఆర్ట్ ఫిలిం ”పసుపు కుంకుమ ”చూశాను .అనిర్వచనీయ మధురానుభూతి పొందాను
ఆనందం తో నా కళ్ళు ధారా పాఠంగా ఆనంద బాష్పాలు కార్చాయి గుండె ను పిండేసే సన్నివేశాలు ఎదలోపలి పొరలను తొలగించి కరిగించాయి . కూతురు చేయలేక పోయిన పనిని మనవరాలు చేసి తాతకు దగ్గులు నేర్పింది భారీ డైలాగులతోకాదు -మాటల్లేని మౌన గౌరవ ప్రేమలతో . అంతే అప్పటిదాకా కూతురు పై కరకు గుండె గా ఉన్న శ్రీరామ్ ,కూతురుకు దస్తావేజులిచ్చి ఆమె ఏమీ అడగకుండా సంతకాలు చేసి ఆమె హక్కుభుక్తమైన 10 ఎకరాల కోటిరూపాయల ఆస్తిని వదులు కొని అతని మనసు మారిస్తే ,అల్లుడు అత్యంత గౌరవమర్యాదలు చూపిస్తే ,ఒకే ఒక మాట పట్టింపుతో అనుకున్నవాడిని పెళ్లాడిన కూతురు గుమ్మం ఎన్నో ఏళ్లుగా తొక్కని ఈ తండ్రి ఆమె సంతకాలకోసం మాత్రమే వస్తే ఇచ్చిన మంచినీళ్లు కాఫీ వగైరాలు కూడా తాగకుండా ,పలకరించకుండా ఆమె సంతకాలకోసమే ఆత్రంగా ఎదురు చూస్తూ, ఆమెకూడా తండ్రికి తగ్గ కూతురుగా అందులో ఏముందని అడగకుండా నిర్నిమిత్తముగా సంతకాలు చేస్తే ,ఏ కర్కోటకుడు హృదయం కరిగి నీరు కాదూ ?అలాగే కరిగిపోయాడు అప్పటిదాకా ముఖం లో ఆమెపై కోపం తప్ప ఏ భావం వ్యక్తపరచని శ్రీరామ్ ,ఆమె ప్రవర్తించిన మంచితనపు తీరుకు మ్రాన్పడి కూతురు చేతిలో ఓడిపోయిన తండ్రి అయి మనవరాలు అల్లుడు చూపిన ప్రేమామృతం లో తడిసి ముద్ద అయి ముఖం లో చిరునవ్వు చూపి మనవరాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మంచినీళ్లు కాఫీ వగైరాలు తీసుకుని ఆమెకూ పెట్టి తిరిపించి మంచిమనసుకున్న మనో ధర్మం అన్నిటికన్నా విలువైనదని దాన్ని జయించటం ఎవరికీ సాధ్యంకాదని గ్రహించి పసుపు కుంకుమగా కూతురు కు దాఖలయ్యే ఆస్తిని ఆమెతో విడుదల దస్తావేజు పై సంతకం పెట్టించిన కాగితాలను చించి పారేసి తానూ మానవ ధర్మాన్ని మనో ధర్మాన్నీ చూపి కనువిప్పు పొంది మన కనుకొనలలో ఆనందపు బాష్పాలు రాల్పిస్తాడు దటీజ్ ఎల్బీ శ్రీరామ్స్ హార్ట్ ఫిలిం లోని ఆర్ట్ .ఈ ఆర్ట్ కె హాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది .