మోడీ దీక్ష –పాత జ్ఞాపకాలు
ప్రతి పక్షాలు తనకు తన ప్రభుత్వానికి పార్టీకి సహకరించక ఇబ్బంది పెడుతున్నాయని పాపం మోడీ నిన్న నిరాహార దీక్ష పూనాడు .బహుశా ఒక ప్రధాని ఇలా చేయటం దేశం లో ఇదే మొదలేమో .మొరార్జీ భాయి ఇలా చేసినట్లు నాకు జ్ఞాపకం లేదు .ఎవరికైనా తెలిస్తే చెప్పండి .కాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా నిరాహార దీక్ష పట్టి ,తర్వాత పదవి కోల్పోయిన సంఘటన కొద్దిగా జ్ఞాపకం ఉంది .ఆ వివరాలు –
పశ్చిమబెంగాల్ నాలుగవ ముఖ్యమంత్రి అజయ్ కుమార్ ముఖర్జీ .అందరూ అజయ్ ముఖర్జీ అని ఆప్యాయంగా పిలిచేవారు .బెంగాల్ గాంధీ గా ప్రసిద్ధుడు . బెంగాల్ లో 15-4-1901 లో మిడ్నపూర్ లోని తామ్లోక్ లో పుట్టాడు .క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 డిసెంబర్ 17 ఏర్పడిన ‘’తామ్రలిప్త జాతీయ ప్రభుత్వ ‘’ముఖ్య నాయకులలో అజయ్ ముఖర్జీ ఒకరు .ఈ సంస్థ బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్యమం లో గొప్ప పాత్ర పోషించింది .అజయ్ ముఖరీపై స్వామి వివేకానంద ప్రభావం బాగా ఉంది .అప్పటికే భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన ముఖర్జీ,తర్వాత బంగ్లా కాంగ్రెస్ ముఖ్యనాయకుడయ్యాడు బెంగాల్ లో వ్రేళ్ళు పాతుకు పోయిన మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పరచాడు .ఈ ఫ్రంట్ ప్రభుత్వం 1960 లోనూ 1970 లోనూ రెండుసార్లు అధికారం లో ఉన్నది . ముఖ్యమంత్రి గా మొదటిసారి 1967 మార్చి నుంచి నవంబర్ వరకు ,మళ్ళీ ఫిబ్రవరి 69 నుంచి 70 మార్చి వరకు అజయ్ ముఖర్జీ కొద్దికాలం మాత్రమె ఉన్నాడు. ఉన్నాడు అన్నదానికంటే కమ్మీలు ఉండనివ్వలేదు అనటం సమంజసం . .సాధువు శాంత చిత్తుడు అవటం వలన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జ్యోతిబసు దూకుడును అరికట్టలేక పోయాడు .బసు తానె ‘’బాసు’’ గా ప్రవర్తిస్తూ ,దురుసుగా ముఖ్యమంత్రినే లెక్క చేయని పరిస్థితి కల్పిస్తే ,విసిగి వేసారి కమ్మ్యూనిస్ట్ లకు నిరసనగా ముఖ్యమంత్రి అజయ్ ముఖర్జీ కలకత్తాలో నిరాహార దీక్ష పూనినట్లు గుర్తు . లోకం అంతా విస్తుపోయింది ఆనాడు .ఒక ముఖ్యమంత్రి నిరసన దీక్ష చేశాడంటే యెంత క్షోభ అనుభవించాడో నని ఆయనకే సానుభూతి చూపి బసు లెక్కలేని తనాన్ని గర్హించింది ..
ఈ దీక్ష తో ఆయనకు పార్టీలో ప్రభుత్వం లో పట్టు లేదని తెలిసిపోయింది .రాజకీయ సంక్షోభం ఏర్పడి 1968 ఫిబ్రవరిలో నూ ,మళ్ళీ 1970 మార్చిలోనూ రాష్ట్రం లో ప్రెసిడెంట్ పాలన ఏర్పడింది .అజయ్ ముఖర్జీ స్థానం లో ప్రఫుల్ల చంద్ర ఘోష్ 1971 ఏప్రిల్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి,జూన్ వరకు ఉన్నాడు .మళ్ళీ సంక్షోభం వచ్చి రాష్ట్రపతి పాలన జూన్ 71 నుంచి మార్చి 72 వరకు విధించారు .19 2 మార్చిలో సిద్ధార్ద శంకర రే ముఖ్యమంత్రి గద్దెను కాంగ్రెస్ తరఫున ఎక్కి1977 జూన్ వరకు జూన్ వరకు అయిదేళ్ళు నిరాటంకంగా పాలించాడు .
కమ్మీలు బాగా పుంజుకుని బలపడి 1977 జూన్ లో మార్క్సిస్ట్ నాయకుడు జ్యోతిబసు బెంగాల్ ముఖ్యమంత్రి అయి ఏకధాటిగా 21 ఏళ్ళు 2000నవంబర్ వరకు ఏకచ్చత్రాదిపత్యంగా పాలించాడు .బసు ఉన్నతవరకు అజయ్ కుమార్ ముఖర్జీ నిప్పుల కుంపటి లో ఉన్నట్లే ఫీలయ్యాడు .పొమ్మనలేక పొగపెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాడు ముఖర్జీని .గాంధియన్ ముఖర్జీ బసు చేష్టలకు బలై పోయాడు .తాను చేబట్టిన నిరాహార దీక్షకు తానె అప్పుడు బలి కావాల్సి వచ్చింది అజయ్ ముఖర్జీ .
తర్వాత ప్రణబ్ ముఖర్జీ వంటి విదేయ గణం తో అజయ్- కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని ,నాటి ప్రధాని ఇందిర కేంద్ర మంత్రిగా ఆహ్వానించినా చేరక తనబదులు ప్రణబ్ కు కేంద్ర స్టేట్ మంత్రిగా స్థానం కల్పించేట్లు చేశాడు అప్పటినుంచి’’ ప్రణబ్ ఎరా’’ ప్రారంభం .1977 లో పద్మవిభూషణ పురస్కారం పొందిన కురు వృద్ధుడు అజయ్ కుమార్ ముఖర్జీ 27-5-1986 న 87 వ ఏట మరణించాడు .మార్క్సిస్ట్ ల ఆగడాన్ని మొదట పసికట్టి విభేదించి నిరాహార దీక్ష చేసిన వాడు అజయ్ ముఖర్జీ .
ఇప్పుడు మోడీ పార్లమెంట్ జరక్కుండా అవిశ్వాసం ప్రవేశపెట్టకుండా చేయించి కుమ్మక్కైపత్తిత్తు లాగా దీక్ష పట్టాడు .పంచతంత్రం కధలన్నీ వరసగా మనకు చూపిస్తున్నాడు .2014 లో మోడీ లేకపోతె భారత్ లేదు అని అనిపించి అధః పాతాళంలోకి కాంగ్రెస్ ను నెట్టేసి ఇకజనం ఆ పార్టీని మర్చి పోతారేమో ననిపించి చివరికి క్రమక్రమగా రాజకీయంగా బలిసి ,నియంత పోకడులుపోతూ కళ్ళు మూసుకుని పిల్లి పాలుతాగుతున్నట్లు అవకతవక చేష్టలతో అచ్చిరాని సంస్కరణలతో పనికి రాని’’మంకీ బాత్ ‘’లతో విసుగుపుట్టించి కాంగ్రెస్ తో సహా సర్వ ప్రతిపక్షాలతో ఛీ ఛీ కొట్టించుకుంటూ మోడీ గోబాక్ అనే దాకా వచ్చాడంటే ఇదంతా స్వయంకృతాపరాధం కాక మరొకటికాదు .కరటక దమనకుల్లా మోడీ ,షాలు .అందరికీ కనిపిస్తున్నారు .సానుభూతిపోయి క్విట్ మోడీ అనేదాకా తెచ్చుకున్నాడు మోడీ(ఘోరీ ) మొహమ్మద్ .చరిత్ర క్షమించని సంఘటన .దీనికి బలికాక తప్పదు .ఒక్క దీక్షతో ఎంత వెనక్కి వెళ్ళామో చరిత్రలో –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-18 –ఉయ్యూరు