నోరు మెదపలేదేం
కర్ణాటక లో ప్రాజాస్వామ్యం బాలి అవుతుంటే విలువలు మాన్తా గలుస్తుంటే న్యాయం అన్యాయం అవుతుంటే టే మన రాష్ట్రానికి చెందిన యువ నాయకులు మాజీ సి ఏం కొడుకు,మాజీ కేంద్రమంత్రి తమ్ముడు కిమ్మనకుండా కూర్చున్నారు .తప్పు ఎక్కడున్నా తప్పే అని చెప్పగలిగే ధైర్యమే లేదా ?రేపెప్పుడో పనికొస్తుందేమో మౌనంగా ఉంటె అనే సంకేతమా ?ఇలాంటి జన నాయకులు వ్యవస్థను బతికిస్తారా ? స్వార్ధం కోసాం చొంగ కార్చటం తప్ప .ఇప్పటికైనా మించి పోయింది లేదు .ప్రజలందరూ జాగ్రత్తగా గమనించండి . బుద్ధి చెప్పి వాళ్ళను సరైన దారిలో నడిచేట్లు చేయండి .తండ్రి పదవి కావాలన్న ఆరాటం ఒకాయనది ,అన్న పేరు సాధించాలన్న ఉబలాటం మరొకరిది . ప్రజలు తెలివి తక్కువ వాళ్ళేం కారు.అందర్నీ గమనిస్తూనే ఎవరికి ఎప్పుడు బుద్ధి శుద్ధి చేయాలో తెలిసిన వివేకులు .కళ్ళు మూసుకు పాలు తాగకండి యువ నాయకుల్లారా .ఓదార్పు .కౌగిలింతలు మొసలి కన్నీళ్లతో దూషణలతో ,ప్రగతి కనిపిస్తున్నా లేదన్న బుకాయింపు లతో ప్రజా హృదయం కరఃగదు .ప్రజా హృదయం గెలవాలంటే వారితో మమేకం కావాలె తప్ప ఏ ఎండకు ఆ గొడుగు పట్టరాదు నాయనలారా .-దుర్గాప్రసాద్