ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు
సరసభారతి 126 వ కార్యక్రమ0గా ఇటీవలే దివంగతులైన ప్రతిభా త్రిమూర్తులు 1- ప్రముఖ వాగ్గేయ కారులు , -ఆకాశ వాణి విజయవాడ కేంద్ర మాజీ సంచాలకులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు ,2-కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,ప్రఖ్యాత కథా రచయిత, విజయవాడ లయోలాకాలేజి మాజీ తెలుగు లెక్చరర్ శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ౩- నవ నవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దన పూడి సులోచనా రాణి గార్లను డిగ్రీ విద్యార్ధులైన నవతరం యువతకు పరిచయం చేసే అవగాహన సదస్సు ,ఉయ్యూరులో స్థానిక ఎ .జి. అండ్. ఎస్. జి .డిగ్రీ కళాశాల తెలుగు శాఖ తో కలిసి సంయుక్తంగా 30-6-2018 శనివారం మధ్యాహ్నం 1-30 నుండి 4-30 వరకు సెమినార్ హాల్ నందు నిర్వహిస్తున్నాము . సాహిత్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
కార్యక్రమం
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –డా.శ్రీ డి.బాలకృష్ణ ,ప్రిన్సిపాల్
గౌరవ అతిధి ,సమన్వయ కర్త –డా .శ్రీ జి.వి .పూర్ణ చ౦ద్,ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా రచయితల సంఘం –విజయవాడ
ఆత్మీయ అతిధులు –శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి – రిటైర్డ్ స్టేషన్ డైరెక్టర్-ఆల్ ఇండియా రేడియో విజయవాడ-రజని గారి బహుముఖీన ప్రతిభ పై ప్రసంగం
శ్రీమతి బాలాంత్రపు ప్రసూన -లెక్చరర్ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి –విజయవాడ(రజని గారి కోడలు )-రజని గాన వాహిని పై ప్రసంగం
శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ –ఇంగ్లిష్ లెక్చరర్ ,ప్రముఖ సాహితీ వేత్త –విజయవాడ-పెద్ది భొట్లవారి కథా సాహిత్య విశిష్టత పై ప్రసంగం
శ్రీమతి గుడిపాటి రాధికారాణి- టీచర్ ,యువ సాహితీకెరటం –మచిలీపట్నం-యద్దనపూడి నవలలలో స్త్రీ వ్యక్తిత్వచిత్రణ పై ప్రసంగం
కార్యక్రమ నిర్వహణ –శ్రీ జి.శ్రీనివాస్ , శ్రీ జి .వేణుగోపాల రెడ్డి –తెలుగు లెక్చరర్స్
శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్యదర్శి
మనవి – ఈ’’ విద్యుల్లేఖ’’ నే ఆహ్వానంగా భావించి అతిధులు ,సాహితీ ప్రియులు విచ్చేసి జయప్రదం చేయ మనవి
ఆహ్వాని౦చు వారు
డా. డి బాలకృష్ణ ,ప్రిన్సిపాల్ ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ డిగ్రీకళాశాల-ఉయ్యూరు
గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు-ఉయ్యూరు
ఉయ్యూరు ,12-6-18
—
—