ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -1
ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -1
సరసభారతి 126 వ కార్యక్రమంగా ప్రతిభా త్రిమూర్తులైన ప్రముఖ వాగ్గేయకారులు ,ఆలిండియా రేడియో రిటైర్డ్ డైరెక్టర్ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు ,ప్రఖ్యాత కధారచయిత ,లయోలాకాలేజి రిటైర్డ్ తెలుగు ఉపన్యాసకులు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య ,నవ నవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులొచనారాణి గార్లపై డిగ్రీ విద్యార్ధులకు అవగాహన సదస్సు స్థానిక ఏజీ అండ్ ఎస్ జి డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో ,ఆకాలేజి తెలుగు శాఖతో సంయుక్తంగా 30-6-18 శనివారంమధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాం .సదస్సుకు విచ్చేసిన అతిధులను తెలుగు లెక్చరర్ శ్రీ గుంటక వేణుగోపాల రెడ్డి స్వాగతం పలికి వేదికపైకి విద్యార్దులిచ్చిన పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు .మా తెలుగు తల్లిగీతాన్ని పాడే విద్యార్ధులు లేకపోవటం తో రికార్డెడ్ గీతం వినిపించారు .నాఅధ్యక్షత న జరిగిన సభ లో వక్తలు చక్కని స్పూర్తి దాయకమైన ప్రసంగాలు చేశారు .విద్యార్ధులు మొదట్లో కొంచెం అసహనం గా ఉన్నా క్రమేపీ బాగా శ్రద్ధ చూపారు .మధ్యాహ్నం ౩ గంటలకు షార్లెట్ సరసభారతి (అమెరికా ) సౌజన్యం తో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధినికి 2 వేల రూపాయలు జిల్లాపరిషత్ హై స్కూల్ పదవతరగతి విద్యార్ధులకు నలుగురికి ,వి ఆర్ కే ఏం హైస్కూల్ పదవతరగతి విద్యార్ధి కి ,ఎనిమిదవ తరగతి విద్యార్ధినికి ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 8 వేలరూపాయలు నేనూ అతిధులు అందజేశాం విద్యార్ధులు స్కూల్ ఉండటం వలన రాలేకపోతే లెక్కలమాస్టారు శ్రీ త్రినాద్ ద్వారా అందించాం .ఇందులో నలుగురు బాలికలు ,అందులో ఒక ముస్లిం విద్యార్ధిని ఉండటం విశేషం .ముగ్గురు బాలురున్నారు .జడ్. పి .లెక్కలమేస్టారు శ్రీ త్రినాద్, ఆర్కేయం సైన్స్ టీచర్ శ్రీ రామనాధ బాబు విద్యార్ధుల ఎంపికను నిష్పక్ష పాత౦గా బీదరికం ప్రాతిపదికగా ,తలిదండ్రులు లేకపోవటం పైనా దృష్టి పెట్టి ఎంపిక చేసి నాకు లిస్టు ఇచ్చారు .ఆ ఇద్దరికీ ధన్యవాదాలు .నగదు బహుమతి తోపాటు సరసభారతి కవితా సంకలనం ‘’వసుధైక కుటుంబం ‘’కూడా అందించాం .
గౌరవ అతిధిగా ,సమన్వయ కర్తగా విచ్చేసిన కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధానకార్య దర్శి ,116 గ్రందాల రచయిత,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ,మహా వక్త శ్రీ పూర్ణచంద్ తమ శ్రీమతి తో కలిసి రావటం వారికి ఈ సదస్సుపై ,సరసభారతి పై ఉన్న అనుబంధం తెలియ జేస్తుంది .రజని గారి బహుముఖీన ప్రతిభను తెలియబరచటానికి విచ్చేసిన విజయవాడ రేడియో కేంద్రం మాజీ డైరెక్టర్ శ్రీమతి ము౦జు లూరి క్రిష్ణకుమారిగారు విజయవాడ నుంచి బస్సులో రావటం నాకు చాలాఆశ్చర్యమేసింది .వారికీ ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ?ఆ సౌజన్యం అలాంటిది .పెద్దిభొట్ల వారి కథా విశేషాలపై మాట్లాడటానికి వచ్చిన ప్రసిద్ధ సాహితీవేత్త ఆంగ్ల ఉపన్యాసకులు శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ ,సెలవు పెట్టి రావటం ,ఇవాళ శనివారం కనుక ఉపవాసం ఉండి మరీ రావటం ,మా ఇంట్లో టిఫిన్ పెడతామన్నా ఒద్దని టీ మాత్రమే త్రాగి నాతో సభకు రావటం ఆయన నిబద్ధతకు నిదర్శనం నాపై అభిమానం .యద్దనపూడి నవలలలో స్త్రీల వ్యక్తిత్వం పై ప్రసంగం చేయటానికి వచ్చిన శ్రీమతి గుడిపూడి రాధికా రాణి టీచర్ కావటం వలన సెలవు పెట్టి బందరు నుంచి రావటం నేను ఆమెను’’యువసాహితీ కెరటం’’ అనటం లో యదార్ధం గోచరమైంది .తెలుగు లెక్చరర్ శ్రీ శ్రీనివాస్ ,సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ఆఫీస్ కు మధ్యాహ్నం సెలవు పెట్టి భర్త శ్రీ శ్రీనివాసశర్మ, కుమార్తె కుమారి బిందు దత్తశ్రీ తో నిండుగా పాల్గొనటం ఆమెసాహితీ సేవా తత్పరత తెలుస్తుంది .ఇందరు ఇన్నిరకాలుగా సహకారం అందించటం వలననే సభ విజయవంతమైంది. రావలసిన రజని గారి కోడలు శ్రీమతి ప్రసూన ,పెద్దిభొట్లవారి శ్రీమతి శ్రీమతి గీతారాణి రాలేక పోయారు .ఆ వెలితి ఎలానూ ఉన్నది . ఈసభలో ప్రసంగించిన వారంతా ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ననుసరించి ,సమయం విలువ గ్రహించి విద్యార్ధుల స్థాయికి దిగి ప్రసంగించి ఆకట్టుకున్నారు .వారి అమూల్య భావాలను , నేను చెప్పదలచుకున్న వాటినీ కలిపి మీకు అందిస్తున్నాను .రెండుగంటల సేపు జరిగిన సభ సాయంత్రం 4 గంటలకే ‘’ ఇక్కడే మరో సభ ఉంది అని’’ రెడ్డి నాచెవిలో ఊదటం ‘’వలన అసంతృప్తిగా ముగించటం వక్తలకు తీవ్ర ఆశాభంగం కలిగింది .మన్నించ మని వేడుకొంటున్నాను . వారు మాట్లాడాల్సిన సమయాన్ని కబ్జాచేయాల్సివచ్చింది అయిష్టంగానే .దీనికి తోడు మొదట్లో విద్యార్ధులు చాలా గోల గా ఉండటం తో మా సహనం దెబ్బతి౦ది కూడా .మనసులు వికలంయ్యాయి ..ఒక లేడీ టీచర్ బహుశా శ్రీమతి రమాదేవి అనుకుంటా హైస్కూల్లో నా శిష్యురాలు శ్రీమతి శివలక్ష్మి కొంచెం శ్రద్ధ తీసుకుని విద్యార్ధులను కంట్రోల్ చేశారు .లేకపోతె కాలేజీ పరువు ,మా పరువు గోవిందా అయ్యేది .ఇదంతా చూసి శ్రీ పూర్ణచంద్ ఏ మాత్రం మొహమాట పడకుండా విద్యార్ధుల క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎండగట్టారు .డిగ్రీ తీసుకుంటే చాలదు మర్యాదా ,పద్ధతీ నేర్చుకోకపోతే చదువు నిరర్ధకం .ముగ్గురు ప్రతిభామూర్తులమీద మాట్లాడటానికి వారిని కాచి వడబోసిన ముగ్గురు సుప్రసిద్ధులు వారిపై అవగాహన కలిపించటానికి ఎంతో శ్రమపడి వస్తే ఇదామీరు చూపే మర్యాద ?ఇది ఏమాత్రం క్ష౦తవ్య౦ కాదు.మీ ప్రవర్తనతో మేము తలవంచుకోవాల్సివచ్చింది .అని చాలాతీవ్రంగా దులిపేశారు .సభ సమాప్తం చేయటానికి ముందు నేను కూడా అంతకంటే తీవ్ర స్వరం తో ‘’ఇక్కడ మేము కనీసం ఎనిమిది సభలు జరిపాం .ఏ సభలోనూ మాకు ఇలాంటి సంఘటన జరగలేదు. మాహృదయాలు గాయపడలేదు .ఎంతో డిసిప్లిన్ గావిద్యార్ధులు వ్యవహరించారు .వారికి పోటీలు పెట్టి బహుమతులిచ్చాం. చక్కగా పాటలు కూడా పాడారు .రెండు పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించాం .రెండుసార్లూ వందేసి పుస్తకాలు మీ లైబ్రరీకి ఇచ్చాం .ఒక సభ ఉదయం నుండి సాయంత్రం వరకు జరిపాం .అప్పుడు వచ్చిన సహకారం, పిల్లలు చూపిన మర్యాదా , మన్ననా మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి .అప్పటి విద్యార్ధుల వినయానికి ,డిసిప్లిన్ కు మేము ముగ్దులమయ్యాం .ఆ సభల్లో పూర్ణచంద్ గారున్నారు అప్పుడెప్పుడూ రాని ఆవేశం ,ఆవేదనా ఇప్పుడు ఈ సభలో ఆయనకు వచ్చాయంటే ఆయన మనసు ఎంత బాధ పడిందో గ్రహించండి .మీ తప్పులు మీకు తెలియ జెప్పకపోతే మేమూ అందరి వాళ్ళలాగే అవుతాం .అందుకే ఇంతగా మేమిద్దరం చెప్పాం .మీప్రవర్తనకు సిగ్గు పడండి . ముందుగా మేడం కృష్ణకుమారి గారికి అంతా లేచినిలబడి ‘’సారీ ‘’చెప్పండి .’’అన్నాను .వారి లోమార్పు వచ్చి అందరూ లేచినిలబడి సారీ చెప్పారు .మళ్ళీ ఇలా ఎప్పుడూ చేయం అని అన్నారు .అందరం సంతోషించాం .సభ పూర్తి అయి బయటకొస్తుండగా తెలుగు లెక్చరర్స్ శ్రీనివాస్ ,వేణులు నాదగ్గరకొచ్చి ‘’మాస్టారూ ! మీరూ పూర్ణచంద్ గారు చాలాబాగా గడ్డిపెట్టారు .ఇలా చెప్పక పొతే వాళ్లకు తెలియనే తెలియదు , తెలుసుకోలేరు ‘’అన్నారు .సంతోషించాను .తర్వాత కొoతమంది ఆడపిల్లలు నాదగ్గరకొచ్చి’’సారీ సార్ !మేము చాలా బాడ్ గా బిహేవ్ చేశాం .క్షమించండి .’’అని ప్రాధేయ పడ్డారు .నేను ‘’అమ్మా ! మీలో ఏ నలుగురైదుగురో అల్లరి చేయటం వలన మీ అందర్నీ అనాల్సి వచ్చింది .వచ్చిన గెస్ట్ లను గౌరవించటం నేర్చుకోకపోతే చదువుకు అర్ధం ఉండదు .డోంట్ రిపీట్ హియరాఫ్టర్’’అని చెప్పి అనునయించాను .ఇలా వారిలో గుణాత్మక మార్పు వచ్చినందుకు అందరం హేపీ .మాకూ ఈ అనుభవం కొత్తదే .
ముక్తాయింపు –మధ్యాహ్నం పన్నెండు గంటలకు చెన్నై నుంచి 70 ఏళ్ళ ముసలాయన ఫోన్ చేసి ‘’సార్!ముగ్గురు ప్రతిభా మూర్తులపై అవగాహన సదస్సు పెట్టాలని మీకు ఆలోచన కలగటం ,దాన్ని సార్ధకం చేయటానికి అంతటి లబ్ధ ప్రతిస్టులను ఆహ్వాని౦చటం నాకు ఆశ్చర్యం కలిగించింది .ఫేస్ బుక్ లో మీ ఆహ్వానం చూసి ఫోన్ చేశాను .సభ జయప్రదం కావాలని కోరుతున్నాను’’అన్నారు పెద్దమనసుతో .ఉప్పొంగిపోయాను ఇంతగొప్ప అవగాహన సదస్సు నిర్వహిస్తున్నందుకు .కాని మా ఆశలపై నీళ్ళు చల్లారు అక్కడ . అందుకనే ఈబాధ .ఇది అందరికీ తెలియాలనే ఇంత వివరంగా రాశాను .అర్ధం చేసుకోగలరు .ఎవరి హృదయాలైనా గాయపడితే బాధ్యుడను నేనే కనుక నన్ను మన్నించ ప్రార్ధన అని అతిధులకు సవినయంగామనవి చేసుకొంటూ ,సభలో వక్తలు అందించిన విశేషాల వివరాలు మరో ఆర్టికల్ లో తెలియ జేస్తానని చెబుతున్నాను . . సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-18 –ఉయ్యూరు
,
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797