కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10
2- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు గారు -3
శ్రీ దువ్వూరి సోమయాజులు గారి మూడవ కుమారుడు శ్రీ వెంకట సూర్య ప్రకాశ అవధాని
19 53లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజ మండ్రివద్ద పాత రైల్వే బ్రిడ్జి ని తాకు తూ 65 అడుగుల ఎత్తున నీరు వచ్చి తీర ప్రాంతాలను అతలాకుతలం చేసి , కపిళేశ్వరప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది .పంటలన్నీ పాడైపోయాయి .కానీ యాజులు గారి ‘’పంట పండింది’’ వారింట మూడవకుమారుడు వెంకటసూర్య ప్రకాశ అవధాని అన్మించటం తో .సర్వేశ్వర పుట్టిన దశాబ్దానికి ఈ పుత్రోదయం .ఎనిమిదవ ఏట ఉపనయన సంస్కారం పొంది తండ్రి వద్ద వేదం 8 ఏళ్ళు నేర్చి పూర్తి చేశాడు .ఉదయం 5 కే లేచి ,స్నాన సంధ్యలు చేసి ,తండ్రిగారి అగ్ని హోత్రం పూర్తయ్యాక వేదాభ్యాసం ప్రారంభించి మధ్యాహ్నం 12 వరకు కొనసాగేది .20 వ ఏట వేదం శ్రౌతాలలో గోదావరి మండల పరిషత్ వద్ద వ్యాఘ్రేశ్వరం లో 19 73 లో పరీక్ష నిచ్చిఅవధాని అయ్యాడు .కనక దుర్గ అనే గుళ్ళపల్లి వారి అమ్మాయిని ఇరగవరం లో 19 70 కే పెళ్ళాడాడు .అప్పుడామెకు 12 ,అతడికి 17 .16 వ ఏడు దాకాబడి చదువు లేదు .అక్షరం ముక్క అబ్బకపోతే లాభం లేదని శ్రీరామ పురం నుంచి ముక్కామలకు నడిచి వెళ్లి చదివాడు .తండ్రి అడుగు జాడలలో అప్పటిదాకా ఉన్నా, తర్వాత తెలుగు లేక సంస్కృత పండితుడి ఉద్యోగం లో చేరాలనిపించి ,మొద్దె కూరు లోని కాలేజిలో చేరి 1976 లో లోకోర్సు పూర్తి చేశాడు .ట్రెయిన్ లో ప్రయాణం చేస్తూ వరంగల్ లో అయిదునెలల కోర్సు చేశాడు .అప్పటికే పండితుల సంఖ్య ఎక్కువైందున ఉద్యోగం రావటం కష్టమైంది .శ్రీరామపురం లోనే రావి చయనులుగారి దగ్గర కావ్యాలు నేర్చాడు .వీటికి అయిన ఖర్చులకు అప్పు చేసీ, సభలో వచ్చే పారితోషికాలతో తీర్చాడు .వ్యాఘ్రేశ్వరం ,రాజమండ్రి ,గుంటూరు విజయవాడ వేదసభలకు వెళ్లి తన ప్రావీణ్య ప్రదర్శన తో నగదు పారితోషికాలు పొందాడు.
1982 లో శ్రీరామపురం వదిలి రాజమండ్రిలో శ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి వద్ద అయిదేళ్ళు మీమాంస శాస్త్రం అధ్యయనం చేశాడు .సుదూర ప్రాంతాలైన హైదరాబాద్ ,సిరిసిల్ల లకు సంభావన కోసం వెళ్ళేవాడు .ఊళ్ళో ఏదో ఒక కర్మకాండ చేయిస్తూ ధనం పొందేవాడు. .సంస్కార విదానాలన్నీ తండ్రి యాజులు గారి వద్దనే నేర్చాడు .ఒక సారి హైదరాబాద్ కుఒక బ్రాహ్మణ కుటుంబం లో పెళ్లి చేయించటానికి వెడితే ,అక్కడ ఏ అగ్ని హోత్రి భార్యా అన్నం వండి పెట్టకపోయేసరికి అవాక్కై అల్పాహారం తో గడిపాడు .ఇప్పటిదాకా తండ్రిగారి నిత్య ఇష్టి,ఇతర ఆహితాగ్నిలకు అధ్వర్యుగా ఉన్నాడు .నిత్యం ముక్కామల దేవాలయం లో రాజమండ్రి సత్య నారాయణ స్వామి దేవాలయం లో టిటిడి తరఫున నియమింపబడి వేదపారాయణ చేసేవాడు .
నలుగురు పుత్రులకు తల్లిదండ్రులైన అవధాని, భార్య 1988 జనవరి లోపెద్ద కొడుకు వేదం తాతగారు యాజులు గారి వద్దనేర్చిన ఫణి యజ్ఞేశ్వర యాజుల పెళ్లి చేశారు. ఆడపిల్లలు లేనందువల్ల కట్నాల బాద లేదు.గుళ్ళపల్లి వారమ్మాయి లక్ష్మి ,ఫణి భార్య .పిల్లలు అక్కరకు వచ్చారు.కనుక మళ్ళీ శ్రీరామపురం చేరి తండ్రి గారివద్ద వేదంతో కాలక్షేపం చేయాలని 1987 లో నిశ్చయించాడు.టిటిడి ఉద్యోగం చేస్తూ, వేద పారాయణ కొనసాగించాడు .అగ్ని ఆరాధన ,ఇష్టి ,అగ్ని స్టోమం చేశాడు .తండ్రి గారి పద్ధతినే అనుసరించాడు .తండ్రి తరానికి ,తనతరానికి ఉన్న దూరం, తేడా గమనించాడు .’’నాచుట్టూ ఉన్నసమాజం గురించి కూడా నేను ఆలోచించాలి వారికోసం పని చేయాలి .ఆదర్శ వైదిక జీవితం గడపాలి .నా అవసరాలను తగ్గించుకోవాలి ‘’అని తాను నిర్ణ యించుకొన్నట్లు అవధాని చెప్పాడు .
అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది .పదేళ్ళ ఆతర్వాత అవధాని ఇంకా రాజమండ్రిలోనే ఉండగా దువ్వూరి కుటుంబానికి చెందిన ఒక సంపన్న దాత శ్రీరామ పురం లో చుట్టూ గోడలు ఉన్న ఒక అందమైన ఇంటిని దానిలో ఒక పాఠశాల పెట్టటానికి శృంగేరి పీఠానికి అందజేశాడు .ఉద్దేశ్యం బాగానే ఉంది కాని అక్కడ పని చేయటానికి ఉపాధ్యాయుడేవరూ ముందుకు రాలేదు .అప్పుడు దాన్ని సూర్య ప్రకాశావ దానికే ఇచ్చిఅక్కడే ఉండిపోమ్మనీ తన కొడుకులకు ,తమ్ముడికొడుకులకు వేదం నేర్పుతూ ఉండమని కోరగా వచ్చి చేరాడు .
శ్రీ దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర యాజులు -అన్నిటా ప్రధమం
వైదిక –లౌకిక జీవితానికి సమన్వయము సాధించినవాడు సూర్య ప్రకాశ అవధాని పెద్దకుమారుడు ఫణి యజ్ఞేశ్వర యాజులు .1974 లో జన్మించి శ్రీరామపురం లోనే తాతగారు యాజులుగారి వద్ద ఆయన ముసలి గుడ్డి తనపు రోజుల్లో వేదం నేర్చి,ఇంటర్ చదివి ,ఇంగ్లిష్ నేర్చిమాట్లాడగలిగిన మొట్టమొదటి వేదపండితుడుగా రికార్డ్ సాధించాడు .బి.కాం. చదివి ,మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఆర్ట్స్ సాధించి కర్నాటక స్టేట్ బాంక్ లో ఉద్యోగం పొందాలనుకున్నాడు .కాని మళ్ళీ వేదం లోకి వచ్చి ,క్రమ౦ లోను శ్రీరామపురం లో సామవేదం వెంకట రమణగారి వద్ద నేర్చిన ఘనం లోను పరీక్ష ఇచ్చి ,విజయవాడలో శ్రీ విష్ణుభొట్ల లక్ష్మీ నారాయణ ఘనపాఠి గారి వద్ద రైల్ లో వచ్చి వారానికి మూడు రోజులు ఘనం నేర్చి ,1999 లో ‘’ఘన ‘’లో ఘనంగా సర్టిఫికేట్ సాధించాడు .25 వ ఏట మీమా౦స పై మనసుపడి తండ్రి తో సమానమై శ్రౌత విద్యలో మరీ ముందుకు వెళ్ళాడు
14 వయసులో 10 ఏళ్ళ మేనమామ గొల్లపల్లి వెంకట రామ సూర్యనారాయణ గారి కూతురు లక్ష్మిని పెళ్ళాడి ఇద్దరు మగపిల్లలు సూర్య ప్రకాశ పవన కుమార శర్మ,శ్యామ సుందర శ్రీరామ శర్మలను జన్మనిచ్చి , కుటుంబ నియంత్రణ పాటించాడు .పెద్దాడు 8 వ ఏటనే తైత్తిరీయం తండ్రి వద్ద మొదలుపెట్టి నేర్చాడు .తండ్రిలాగే ఇంగ్లిష్ లో ఆసక్తి కలిగి ఇంగ్లిష్ మీడియం లో చేరి చదువుతూ కూడా రోజుకుకనీసం అయిదు గంటలు వేదాధ్యయనం చేసేవాడు.ప్రాధమిక విద్య ఆంగ్ల మాధ్యమలో చదివిన ఏకైక వేద పండితుడు అనిపించాడు .
చాలాదేవాలయాలనుంచి వేద పారాయణకు ఫణి ఆహ్వానాలు పొందాడు .అమెరికాలోని న్యు జెర్సీ దేవాలయం లో ఋత్విక్ గా ఆహ్వానమూ వచ్చింది .’’తాత గారు ఇలాంటి వాటికి ఆశపడ వద్దు అన్నారు .కనుక ఇప్పుడేకాడు మరెప్పుడూ అమెరికావంటి ఇతర దేశాలకు వెళ్ళను ‘’ అని ఖచ్చితంగా చెప్పాడు .2000 ఫిబ్రవరిలో రాజమండ్రిలో అయిదుగదుల ఫ్లాట్ కట్టుకొని గృహ ప్రవేశం చేశాడు .2009 లో తిరుపతి వేంకటేశ్వర యూని వర్సిటిలో అధ్యాపక ఉద్యోగం అందుకొని శృంగేరి పీఠం బదివదిలేసి ,కృష్ణ యజుర్వేదం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ తర్వాత ప్రొఫెసర్ అయ్యాడు , ఆ ప్రాంతం లో వేద పండితుడు యూని వర్సిటి ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఫణి . ,కంచి పీఠం ఫణిని ఆహ్వానించి ,సన్మానించి ‘’వేద భాష్య రత్న ‘’బిరుదుతో సత్కరించింది .’’నా జీవితం లో ఇదొక గొప్ప మలుపు. తాతగారు యాజులుగారు ‘’దీనినే కొనసాగించు ‘’అన్నారు .అంతే ఇక వేదం –లౌకికం లమధ్య ఊగిసలాడలేదు నేను’’ అన్నాడు ఫణి 1998 లో .16 ఏళ్ళ తర్వాత వేద ప్రవీణులైన దువ్వూరి కుటుంబం కొత్త అర్హత, విలువ సాధించింది ఫణి వలన .కాని దువ్వూరి శ్రౌతం బలహీనమైన దారానికి వ్రేలాడుతూ ఉండిపోయింది .
2014 లో డయాబెటిస్ వలన సూర్య ప్రకాశ ,కనక దుర్గలు బాధపడి 2007 లో చేద్దామనుకొన్న ఆదాన ,అగ్ని స్ట మాలతో చేయాలనుకున్న ‘’వైశ్వ దేవం చేయలేక పోయారు .వారసత్వాన్ని కాపాడాలనుకున్న శ్రీ దువ్వూరి సీతారామ శాస్త్రి
అన్న ఫణి లాగానే తమ్ముడు సీతారామ శాస్త్రి అధ్వర్యుగా తాత యాజులుగారి వద్ద ప్రారంభించాడు .తైత్తిరీయం ముందుకు సాగలేదు .మాతామహుడు గొల్లపల్లి వారి వద్ద కూడా ఇలాగే జరిగింది .బలవంతం గా భట్టీయం వేస్తె గొంతు నెప్పి వచ్చేది.తాను వేదవారసత్వాన్ని కాపాడుదామనుకొన్నా పరిస్తితులు సహకరించన౦దుకు బాధ పడ్డాడు .టెక్నికల్ కోర్సు చేసి ,అమెరికా వెళ్లి పుష్కలంగా డాలర్లుసంపాదించి అన్న ఫణి, ఫణి కొడుకులు వేద,శ్రోతాల వారసత్వాన్ని నిలబెట్టటానికి సాయ పడుదామని అతని కోరిక.తనకు వేదవిద్య అబ్బదని గ్రహించి ,తన మన్సులోని ఆశయం సాధించటానికి అప్పటి 65వేల ప్రవాస భారతీయులతో పాటు అమెరికా కు కనెక్టికట్ లోని హాఫర్డ్ కు విమానం లో వెళ్ళాడు .ఆంద్ర ప్రదేశ నే అంతవరకూ దాటని వాడు దేశాలు ఖండాలు దాటాడు .సత్యం కంప్యూటర్స్ కు చెందిన’’సిగ్నా ఇన్సూరెన్స్ కంపెనీ ‘’లో చేరి ,తర్వాత భార్య గౌరి శ్యామల ,కొడుకు కార్తికేయ ,కూతురు ప్రణతి లను కూడా అమెరికా తెచ్చుకున్నాడు .ఇతని కజిన్ యజ్ఞేశ్వర యాజులు అంటే యాజులుగారిపెద్దబ్బాయి సర్వేశ్వర కొడుకు అంటే మనవడు కూడా విస్కాన్సిస్ లోని మిల్వాకీ కి వచ్చాడు . యాజులుగారి మూడవ మనవడు హైదరాబాద్ లో వాల్యు లాబ్ ఉద్యోగి గిరిజా శంకర్ కూడా అమెరికాకు యెగిరి పోయె ప్రయత్నం లో ఉన్నాడు .అమెరికాలోని హిందూ దేవాలయాల పూజారులకోసం ,హైటెక్ కార్పోరేషన్ల అవసరాలు అప్పుడు వరాలయ్యాయి .అందరి దృష్టీ భారత దేశం పైనే ఉంది అప్పుడు .ఒకప్పుడు సీమాంతర ప్రయాణానికి ఒప్పుకోని సనాతనులు ఇప్పుడు మనవళ్ళను పంపటానికి ముందుకొచ్చారు .
సూర్య ప్రకాశ అవధాని నలుగురు కుమారులు అంటే యాజులుగారి మనవళ్ళుగొల్లపల్లి కుటుంబం వారి పిల్లలనే పెళ్లి చేసుకున్నారు .సత్సంతానమూ పొందారు .అందులో ఒకరు ఘనాపాఠీ మాత్రమె కాక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ..మరొకరు అమెరికాలో అయిదేళ్ళ ఉద్యోగం లో చేరాడు .ఇంకొకరు కూడా వెళ్ళటానికి సిద్ధం .యాజులు గారు శ్రీరామ పురం లో పంచాయతన దేవాలయం లో అధర్వ వేదం పారాయణ చేస్తుంటే దేవతలే దిగి వచ్చి ఆసక్తిగా వినేట్లు ఉండేది. ఆస్వరం ఆ సాధనా ముచ్చటగా పరమ పవిత్రంగా ఉండేదని పెద్దల ఉవాచ .ఒక సారి ఒక అమెరికన్ వచ్చి ఆయన ఇంటర్వ్యు తీసుకుంటుండగా యాజులు గారు ఆతనితో ‘’మీరు అమెరికా వెళ్ళాక, అక్కడివాళ్ళతో నాకు అమెరికా లో ఉద్యోగం ఇప్పించని సిఫార్సు చేయ౦డి’’అని చమత్కరించారట .
దీనితో దువ్వూరి వారి చరిత్ర పూర్తి .మరో ఆహితాగ్ని గారిని ఈసారి పలకరిద్దాం .
శ్రీ సూర్య ప్రకాశం అవధాని గారి ఫోటో జత చేశాను చూడండి
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-18 –ఉయ్యూరు