కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11
3- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు
శ్రీరామపురం అగ్రహారం లో మూడవ ఆహితాగ్ని బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు .1915 లో జన్మించి 82 ఏళ్ళు జీవించి 1997 లో మరణించారు .భార్య సుబ్బలక్ష్మి సోమిదేవమ్మ .ముప్పై ఏళ్ళు ఇక్కడే సోమి దేవమ్మగా ఉండి,చయనులు గారి మరణా నంతరం రాజమండ్రి కూతురు వద్దకు చేరారు .చయనులగారి మరణం తో ఇంట్లో అగ్ని హోత్రాలన్నీ తీసేశారుఅప్పటికే . వైదికులైన గౌతమస గోత్రానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు .ఒకరు బులుసు వ్యాఘ్రేశ్వర సోమయాజులుగారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వ్యాఘ్రేశ్వరం లోనే ఉంటె ,రెండవవారైన ఈ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులుగారు శ్రీ రామ పురాగ్రహార వాసి .అగ్ని చయనం చేసి చయనులయ్యారు .ఈయననే అందరూ’’ బులుసు చయనులు గారు’’ అని సంబోధిస్తారు .శ్రీరామపురం లో రావి చయనులు అనే స్మార్త బ్రాహ్మణుడు ఉన్నారుకాని ఆయన ఆహితాగ్నీ కాదు ,అగ్ని చయనమూ చేయలేదు .
బులుసు చయనులుగారు గారి పూర్వీకులంతా గణపతి ఆరాధకులు .ఒకసారి ఆయనపూర్వీకుని ముసలితనం లో గణేశుడు ప్రత్యక్షమైనాడని అందరూ చెప్పుకొనే వారు .వీరిలో మూడుతరాలవారు వేదపండితులు అవుతారని తర్వాత తరం వారుకూడా ప్రముఖ వేదపండితులే అవుతారని వినాయకుడు అప్పుడు ఆయనకు వరమిచ్చారట . మన చయనులుగారు చివరి మూడవ తరం వారు .
ముగ్గురన్నదమ్ములలో ఈయనకే వేదం అబ్బింది .అదే వయసున్న రెండు చింతల వెంకటా చలు తండ్రి గారి వద్ద బ్రహ్మ చారిగా వేదాభ్యాసానికి చయనులు గారు చేరారు . రెండు చింతల వెంకటాచలు తర్వాత రెండు చింతల యాజులు గా శ్రౌత స్మార్తాలలో ఎదురు లేని వాడి గా ప్రసిద్ధి చెందాడు .30 క్రతువులు చేసి వేదం లోనూ భారత దేశం లోనే సాటిలేని వాడనిపించారు .ఆయన వేదం గానం చేస్తుంటే మహామహా వేదపండితులు ఆశ్చర్యం తో నోరు వెళ్ళబెట్టి చూసేవారట .అంతటి గొప్పవారు రెండు చింతలవారు .ఎక్కువ కాలం కాశీ లోనే గడిపేవారు .అప్పుడప్పుడు విజయవాడ లోని స్వగృహానికి వచ్చి వెళ్ళేవారు .కోనసీమలో వేదం, శ్రౌతాల పరిస్థితి తెలుసుకొనేవారు . 1936 లో భార్య లక్ష్మీ కాంతతో కలిసి మొదటి యజ్ఞం ,అగ్ని స్టోమం చేశారు .1980 లో కాశీ లోనే చివరి యజ్ఞం చేశారు .50 ఏళ్ళకు పైగా అగ్ని హోత్రాన్ని ఆరాధించి 1987 లో వారణాసిలోనే మరణించారు రెండు చింతల యాజులు గారు .
బులుసు చయనులు గారు ,రెండు చింతల చయనులుగారు కలిసి 82 పన్నాలు పూర్తి చేసి వేదపండితులని పించుకున్నారు .ఇద్దరూ వివాహాలు చేసుకొని జీవిత సౌఖ్యం అనుభవించారు .కాని వ్యాఘ్రేశ్వరుల భార్య రామ సూర్యకాంత గారు 24 వ ఏట టైఫాయిడ్ జ్వరం తో 1945 లో చనిపోయారు..కర్మ కాండ పదవ రోజున మూసివాయనం అంటే చేటలు ,గాజులు రాజమండ్రి నుంచి వచ్చి వ్యాఘ్రేశ్వరం లో ఇప్పించారు .ఈ యువ దంపతుల కుమారుడు రామ మూర్తి వయసు కేవలం 6 .రెండు చింతల యాజులు బులుసువారిని తాను చేయబోయే పౌ౦డరీక యాగానికి నికి ఋత్విక్కుగా నియమించాలనుకున్నాడు కాని ‘’అపత్నీకుడు ‘’ఋత్విక్కు కాకూడదు అనే నియమం ఉండటం వలన ఆయన కు కన్యను ఇచ్చి అయిదు రోజుల వివాహం చేయాలి .తన మిత్రునికి ఈ విషయం లో సాయం చేయాలని గంగలకుర్రులో తన 14 ఏళ్ళ కూతురు సుబ్బ లక్ష్మి ని 30 ఏళ్ళ యువకుడు ,భార్య లేనివాడు , వేదపండితుడైన బులుసు వారికిచ్చి పెళ్లి చేయటానికి ఆమె తండ్రి అంగీకరించాడు.8 నెలలతర్వాత వీరి వివాహం జరిగింది .మళ్ళీ ఇప్పుడు బులుసువారు శ్రౌతకర్మలు చేయటానికి పూర్తిగా అర్హులయ్యారు. ‘
సుబ్బలక్ష్మి వ్యాఘ్రేశ్వరులకు ముగ్గురు ఆడపిల్లలు,తర్వాత ఒక కొడుకు ,మళ్ళీ కూతురు కలిగారు .చయనులుగారి మొదటి భార్య సంతానం రామమూర్తి వ్యాఘ్రేశ్వరం లో అమ్మమ్మ గారింట్లో పెరిగాడు .తర్వాత శ్రీరామ పురం తండ్రి వద్దకు వచ్చాడు.బులుసు ,రెండు చింతల కుటుంబాలు పెళ్ళిళ్ళతో బంధువులూ అయ్యారు .రెండు చింతలవారి అబ్బాయి సత్యనారాయణ కు బులుసువారి మూడవ కుమార్తెతో వివాహం చేసి మూడవ సారి గా మళ్ళీ బంధువులవ్వాలనుకొన్నారు . .కట్నకానుకలు లేవు కాని అల్లుడికి బులుసువారు విద్యా గురువులై వేదం నేర్పారు .అతనికి 15 ,ఆమెకు 10 వయసులో ఇద్దరికీ విజయవాడలో వివాహం చేశారు . బులుసు ఛయనుల గారి ఫోటో జత చేశాను చూడండి
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-18 –ఉయ్యూరు
.
—