ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 95. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కులదీప్ నయ్యర్ 14 ఆగస్ట్ 1923లో పాకిస్తాన్‌లోని సియాల్కోటలో జన్మించారు. కులదీప్ ఉర్దూలో జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. ది స్టేట్స్‌మెన్‌లో పని చేశారు. ఇందిరా గాంధీ హయాంలో 1975లో విధించిన ఎమర్జెన్సీసమయంలో ఆయన అరెస్టయ్యారు. కులదీప్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా. 1996లో యునైటెడ్ నేషన్స్ ఇండియా డెలిగేషన్ మెంబర్. 1990లలో గ్రేట్ బ్రిటన్ హై కమిషనర్‌గా అపాయింట్ అయ్యారు.
1997 ఆగస్ట్‌లో పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కులదీప్ కాలమ్ ‘బిట్వీన్ ది లైన్స్’ను దాదాపు ఎనబై న్యూస్ పేపర్స్ ప్రచురించాయి. ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడులో ఆయన శీర్షికలు వస్తుంటాయి
అవునా నిజమేనా