బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం
-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10 గంటలకు స్థానిక అమరవాణి హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,మరియు స్పెషల్ అసిస్టెంట్ కలెక్టర్ –పులిచింతల ప్రాజెక్ట్
విశిష్ట అతిధి – ”కవి రాజ మౌళి ,కవి సార్వ భౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి ,70 గ్రంథాల రచయిత ,విశ్రాంత తెలుగు పండితులు ,గుంటూరు జిల్లావాసి ,93 ఏళ్ళ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు
ఆత్మీయ అతిధులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు ,శాసనమండలి సభ్యులు
శ్రీ అబ్దుల్ ఖుద్దూస్ – ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్
శ్రీ చలపాక ప్రకాష్ గారు –రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి
శ్రీ ద్రోణవల్లి రామమోహనరావు గారు –అమెరికాలోని హ౦ట్స్ విల్ తెలుగు సంఘాధ్యక్షులు ,ప్రముఖ సమాజ సేవకులు
శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట సీతారామంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )
మొదలగు ప్రముఖులు
కార్యక్రమ వివరం
స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం ,పుష్ప సమర్పణ
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు
1-విశిష్ట అతిధి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారికి
2-డా.శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి గారు –తెలుగు లెక్చరర్ ,ఏ. జి .అండ్ ఎస్. జి .సిద్ధార్ధ జూనియర్ కాలేజి
3-అమరవాణి పాఠశాల కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు
ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం
1–2018 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1- శాంతినికేతన్ పాఠశాల విద్యార్థి-చి.కరిమి పవన్ కుమార్ కు ,-5 వేలరూపాయలు
2- అమరవాణి పాఠశాల విద్యార్థినిలు -కుమారి ఎం. డి.సఫూర మరియు కుమారి పి .తులసి లకుకలిపి – 5 వేల రూపాయలు .
ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు ఏర్పాటు చేసిన ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –
3- ఎ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్ధినులలైన అక్కా చెల్లెళ్ళు -కుమారి చౌడాడ మౌనిక,కుమారి హేమలతలకు కలిపి –రూ 5,వేల రూపాయలు .
-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీమతి సీతమ్మ దంపతుల పేరిట ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధికి ఏర్పాటు చేసిన 10 ,11 6 రూపాయల స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦ –
4-2018 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 9.8 మార్కులతో ఉత్తీర్ణత సాధించి, స్థానిక .ఎ. జి. అండ్ ఎస్ .జి . సిద్ధార్ధ జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న -కుమారి గూడూరి చరిత కు
శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .
సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
ఆహ్వాని౦చు వారు
ఉయ్యూరు -29-8-18 గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు
పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమరవాణి
అమరవాణి వారిఆహ్వానం కింద జత చేశాను చూడండి -దుర్గాప్రసాద్
—