అద్వితీయ అపురూప సౌ౦దర్యాకర్షణ గల కపుర్తల యువరాణి -సీతాదేవి-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ పత్రిక -సెప్టెంబర్
సౌ౦దర్యం
లో రతీ దేవిని,అప్సరసలను మించిన వారు లేరని మనకు తెలిసిన విషయం .వారు దివి వాసులేకాని భువి వాసులుకారు .చిత్తూర్ రాణి పద్మిని సౌందర్యం జగద్విదితమైన విషయం .కాని ఆధునిక కాలం లో కపుర్తల యువరాణి సీతాదేవి సౌ౦దర్యాకర్షణ కు సాటి వేరెవరూ లేరని రుజువైన సత్యం .
కపుర్తలయువరాణి సీతాదేవి కుమాన్ రాజు కుమార్తె .1915 లో జన్మించింది .కపుర్తల మహారాజు జగజీత్ సింగ్ చిన్న కుమారుడు యువరాజు కరం జిత్ సింగ్ సీతాదేవి ని ఆమె 13 వ ఏట వివాహమాడాడు .అందుకని ఆమెను కపుర్తల ప్రిన్సెస్ అన్నారు . ఆమె అనేక భాషలలో అత్యంత ధారాళంగా సంభాషించే నైపుణ్యం కలది .చిన్నప్పటి నుండి దుస్తుల, అలంకరణ విషయాలలో ప్రత్యేక శైలిని కనబరచేది .అందుకే ఎందరో ఫోటోగ్రాఫర్లు ఆమె అందాన్ని ఫోటోలలో బంధించి మేగజైన్ లలో ప్రచురించి ఆమె సౌందర్యాన్ని జగద్విదితం చేశారు .ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ సిసిల్ బీటన్ నుంచి మాన్ రే దాకా ఆమె సౌందర్య దీదితులను లోకానికి తెలియ జేసినవారే .ఆమెకు తన వివాహ దుస్తులు అత్యంత అందంగా ఆకర్షణీయంగా డిజైన్ చేసి కుట్టిన మెయిన్ బోచేర్ అంటే అభిమానం ఎక్కువ .ఇతడే వాలిస్ సి౦ప్సన్ కు ఆమె కు, డ్యూక్ ఆఫ్ విండ్సర్ తో శోభనం జరిగినపుడు కళ్ళు చెదిరే డ్రెస్ కుట్టినవాడు .సీతాదేవికి షిఫాన్ చీరలన్నా ,ఫర్ డ్రెస్ లన్నా మహా క్రేజు . వీటి ముఖ్య డిజైనర్ మెయిన్ బ్రోచర్ . సమాజం లోని మహిళలందరూ ఆమె ఫాషన్ డ్రెస్ కు అదిరిపోయేవారు ,అనుసరించేవారు .అంతటి ప్రభావం కలిగించింది సీతాదేవి .
1930కాలం లో సీతాదేవి సమాజం లో అత్యంత ప్రజారంజన, ప్రజాకర్షణ కలిగించిన వ్యక్తి అయింది .193 6 లో జీగ్ ఫెల్డ్ ఫాలీస్ వాళ్ల ఇరా గెర్శ్విన్స్ ఉత్పత్తుకు సీతాదేవి ప్రేరణగా నిలిచింది .ఆమె 19 వ ఏట ‘’వోగ్ మేగజైన్ ‘’ఆమెను అత్యాధునిక ‘’లౌకిక దేవత ‘(సెక్యులర్ గాడెస్ ) గా ఎంపికచేసి అభిషేకించింది .మూడేళ్ళ తర్వాత ‘’లుక్ మాగజైన్ ‘’ఆమెను భూమిపై అత్యుత్తమ వస్త్రధారణ చేసిన అయిదుగురు మహిళల లో ఒకరుగా అభి వర్ణించింది .ప్రఖ్యాత ఫాషన్ డిజైన్ వస్త్ర వ్యాపారి ఎల్సా షియాప రెల్లి సీతాదేవికి 1935 లో డిజైన్ చేసి కుట్టిన గౌన్లు భారతీయ చీరల లాగా ఉండటం చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు .1939 లో హాలీవుడ్ డయటీషియన్ డా.గెలార్డ్ హాసర్ గౌరవార్ధం లేడి మెండిస్ లో ఏర్పాటు చేసిన టీపార్టీ లో సీతాదేవిని ప్రపంచ ప్రసిద్ధ పన్నెండు మంది అత్యాకర్షణ గల అందగత్తెలలో ఒకరుగా ఎంపిక చేసి ,ఆమె అందానికి ఆకర్షణకు గొప్ప గుర్తింపు కలిగించారు.
1939 జులైలో డిజైనర్, రచయిత, కళారాధకుడు ,పోషకుడు,సౌ౦దర్యారాధక ,పునరుజ్జీవన(రినైసేన్స్ ) తత్వవేత్త కౌంట్ ఎలిన్నే డీ బ్యుమౌంట్ ,భార్య ఎడిత్ ల చే ఏర్పాటు చేయబడిన ‘’కాస్ట్యూమ్ బాల్’’ కు కపుర్తల యువరాణి సీతాదేవి, ప్రముఖ డిజైనర్ అలెక్సీ రూపొందించిన ‘’గ్రేషియన్ స్టైల్ గౌన్ ‘’ధరించి హుందాగా ,రాజసం ఒలకబోస్తూ నెమ్మదిగా నడుచుకొంటూ హాల్ లోకి ప్రవేశించింది. ఆమెనూ ఆమె డ్రెస్ నూ చూసి భూలోక సుందరా లేక దేవ గ౦ధర్వ కిన్నెర కింపురుష అప్సరసా !అని ఆశ్చర్యంతో రెప్పలార్పకుండా వీక్షించారామెను .1939 వేసవి చివరి రోజులలో ఎల్సి డీ ఉల్ఫ్ కపుర్తల యువరాణికోసం ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు .అందులో వినోద ప్రదర్శనకూడా ఉంది .శిక్షణ పొందిన ఏనుగులతో కవాతు చేయించారు .వేసవి సీజన్ కు తగిన ధగద్ధగాయమానమైన బంగారు, వజ్రాల ఆభరణాలు దరించి యువరాణి సీతాదేవి ,అంతే ఆకర్షణతో వినూత్న ఆభరణాలు ధరించి ఆమెభర్త ,యువరాజు మహారాజకుమార్ కరంజిత్ సింగ్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ఆభరణాలు డిజైన్ చేసి రూపొందినవారు కార్టర్,వాన్ క్లీఫ్ అండ్ అపెరల్స్ మొదలైన వారు .ఈ అందాల అతిలోక జగదేక సుందరి కపుర్తల యువరాణి సీతాదేవి 2002లో ఢిల్లీ లో 87 వ ఏట భువినుండిఅప్సరసలతో అందాలపోటీకి దివికేగింది ..ఆమె మనవడు హంట్ సింగ్ ప్రఖ్యాత జ్యుయలరి డిజైనర్ .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
