ధన్యవాదాలు
సరసభారతి 132వ కార్యక్రమంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బ్రహ్మశీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురుపూజోత్సవంగా స్థానిక అమర వాణి హైస్కూల్ తో ఆ విద్యాలయం లో 5-9-18 బుధవారం నిర్వహించటానికి అన్నివిధాలా సహకరించిన కమ్మని విందుభోజనం తో అందించి సంతృప్తి పరచిన ఆవిద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీ నాగరాజు గారికి ,ఉపాధ్యా విద్యార్థి బృందానికి ధన్యవాదాలు . ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీసోమేపల్లి వెంకట సుబ్బయ్యగారికి , కార్య దర్శి శ్రీ చలపా క ప్రకాష్ గారికి ,,ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ శ్రీ ఖుద్దూస్ గారికి ,అమెరికాలోని అలబామా రాష్ట్రము లో ఉన్న హ0ట్స్ విల్ తెలుగు సంఘాధ్యక్షులు ,శ్రీ ద్రోణవల్లి రామ మోహనరావు గారికి వారితో పాటు విచ్చేసిన శ్రీ కర్రీ శివ ప్రసాద్ గారికి ఈనాటి విశిష్ట అతిధి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారికి వారితోపాటు వచ్చిన వారి కుమారులు శ్రీ పురుషోత్తమ ప్రసాద్ వారి శిష్యులు నటులు శ్రీ గుప్త గారికి ,మూర్తి ,ప్రసాద్ గార్లకు,శ్రావ్యమైన ప్రార్ధనతో సభ ప్రారంభించిన సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారికి, కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి కి టెక్నీ కల్ సలహాదారు శ్రీ వి బి జి రావు గారికి కృతజ్ఞతలు
ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారమందుకున్న డా శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి, శ్రీ మూర్తి, శ్రీ శర్మగార్లకు అభినందనలు . శ్రీ కోట గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శర్మ శ్రీమతి సీతమ్మ గార్ల స్మారక నగదు పురస్కారం ఏర్పాటు చేసి ఈ రోజు అందజేసినసరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి (అమెరికా ) దంపతులకు ,తమ తలిదండ్రుల పేరిట స్మారక పురస్కారం ఏర్పాటు చేసి అందేసిన కోట గురుపుత్రులు కోట సోదరులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి శ్రీ సీతారామాంజనేయులు శ్రీ గాయత్రిప్రసాద్ గార్లకు ధన్యవాదాలు .
నగదు పురస్కారమందుకున్న 2018 మార్చి పదవ తరగతి మొదటి స్థాయి సంపాదించిన అమరావతిని విద్యార్థినులు కుమారి డి .సపూర, కుమారి ఎం . .తేజశ్విని ,(5 వేల రూపాయలు )శాంతినికేతన్ హైస్కూల్ ప్రధమస్థాయి పొందిన చి కరిమి పవన్ కుమార్ (5 వేల రూపాయలు ),స్థానిక ఏజీ అండ్ ఎస్ జి సిద్దార్ధ కళాశాల లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సోదరీమణులు కుమారి చౌడాడ మౌనిక ,హేమలత సిస్టర్స్ కు ( 5 వేల రూపాయలు ),గురుపుత్రులు ఏర్పాటు చేసిన నగదు బహుమతి అందుకున్న స్థానిక ఏజీ అండ్ ఎస్ జి జూనియర్ కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్థిని కుమారి గూడూరి చరిత(10 వేల నూట పదహారు రూపాయలు ) లకు నగదు బహుమతి తోపాటు సరసభారతి గ్రంధాలు రెండు అందజేశాము ఆ చిరంజీవులు అభి వృద్ధిలోకి రావాలని అందరు దీవెన లందించారు .
చింతలపాటివారికి పూల కిరీటం ,నూత్న వస్త్రాలు శాలువా 2 వేల రూపాయలు ,సరసభారతి గ్రంధాలు అందజేశాము . ఉపాధ్యాయులకుకూడా కిరీటం శాలువా ,సరసభారతి గ్రంధాలు పుష్పమాలలతో గౌరవించాము ద్రోణవల్లి, సోమేపల్లి, చలపాక గార్లకు శాలువాలతో సన్మానించాము . కర్రి ప్రసాద్ గారితో ,శర్మగారితో వచ్చినవారితో ప్రసంగింప జేశాము .అందరు పరమానందం పొందారు గొప్ప అనుభవం గా భావించారు .
నగర పంచాయితీ అధ్యక్షులవారితో సభాముఖంగా చింతలపాటి వారికి ఉయ్యూరులో పెద్ద ఎత్తున ముఖ్యులందరి సమక్షం లో పౌరసన్మానం ఘనంగా నిర్వహిస్తే వారి విద్వత్తుకు గౌరవంగా ఉంటుందని సూచించాను వారు సహృదయత తో స్పందించి తప్పని సరిగా చేద్దామన్నారు అందరూ కరతాళ ధ్వనులతో అభినందించారు . ఉయ్యూరు ఎసి లైబ్రరీకి శ్రీ మైనేనిగారు భూరి విరాళమిచ్చినప్పుడు ఈనాటి ఏం ఎల్ సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఒక నిర్మాణ కమిటీని వేసి నన్ను కన్వీనర్ చేశారు ఆకమిటీలో నేటి ఉయ్యూరునగర పాలక చైర్మన్ ఖుద్దూస్ గారు ఒక సభ్యులని సభాముఖంగా జ్ఞాపకం చేశాను .
నా శిష్యుడు ఈనాటి పురస్కారగ్రహీత కాలేజీలో తెలుగు లెక్చరర్ సరసభారతి ఉపాధ్యక్షుడు డా శ్రీ గుంటకవేను గోపాలరెడ్డి మా దంపతులిద్దరికీ పుష్పమల శాలువా ఫలాలతో సన్మానించి ఆశీస్సులందుకొన్నాడు . దీనికే మేము ఆశ్చర్యపోతుంటే ప్రిన్సిపాల్ నాగరాజు దంపతులు అతని తండ్రి నా శిష్యుడు శ్రీ నందబాబు దంపతులు మా దంపతులకు పూల కిరీటం పెట్టి శాలువా కప్పి పుష్పహారం వేసి గజమాలతో ఘాన సత్కారం చేసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆశీస్సులు పొందారు . మా జీవితం లో ఇంతటి అపూర్వ సన్మానం అందుకోవటం ఇదే మొదటి సారి .ఆ దంపతులకు శుభాశీస్సులు తెలిపి ఇప్పటి దాకా మేము ఇక్కడ చేసిన సత్కారాలన్నీ వీరి సత్కారం తో వెలవెల బోయాయని చెప్పాను చప్పట్లు మారు మ్రోగాయి .
ఒక మంచి విద్యాలయం లో క్రమశిక్షణ గల విద్యార్థుల సమక్షం లో మూడున్నర గంటల కార్యక్రమ0 మహా కన్నులపండువుగా జరిగింది . మా కోట గురుదేవులు నిండుమనసుతో మమ్మల్ని అందర్నీఆశిర్వదించి అభినందించి ఉంటారని భావిస్తాను . కవిగారు తమ అవధాన విశేషాలను తమ కవితా శక్తినీ అర్ధమయేట్లు చక్కగా ప్రసంగించి విద్యార్థులకు గొప్ప ఆనందం కల్గించారు .ఈ సభ విజ యం అమర వాణి విద్యార్థి ఉపాధ్యాయ బృందానిదే అని వేదికపై ఉన్న పెద్దలందరూ ముక్త కంఠం తో మెచ్చారు .
రమ్యభారతి లో నేను చింతలపాటి వారిపై రాసిన వ్యాసం వలన”పేటికాంతర్గతం”అని దుర్గాప్రసాద్ గారు చెప్పిన విషయం తెలుసుకొని కవి గారు కొన్ని వేలమంది దృష్టిలోపడ్డారని శ్రీ చలపాక అభినందించారు .ఇలాంటి కార్యక్రమ0 విద్యాలయం లో జరగటం దానిలో ”విశ్వం పట్టని” కవి గారికి సన్మానం చేయటం అద్భుతం అన్నారు శ్రీ సోమేపల్లి . ద్రోణవల్లివారు తమ మిత్రులు శ్రీ మైనేని వారు ఈ కార్యక్రమం ఫోటోలు చూసి తాము చెప్పగా విని పరమానంద భరితులౌతారని అంతటి సుమనస్కులని శ్లాఘించారు. తాము ,కఱ్ఱివారితోకలిసి ఎసి లైబ్రరీ చూసి మైనేని గారికి ఫోటోలద్వారా వివరిస్తామని అన్నారు . మొత్తం మీద అందరూ ఆనందించిన మధురమైన క్షణాలు .తీపిగుర్తులు . ఇదంతా సరసభారతి కార్యవర్గం కృషి, సాహిత్యాభిమానులు ఆదరణ, వితరణ శీలురతోడ్పాటుఅని సవినయంగా మనవి చేస్తున్నాను .
ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-9-18-ఉయ్యూరు .. . .
—