చత్తీష్ గడ్ రాష్ట్రంలో మావోయిస్ట్ బస్తర్ పర్వతాలలో 13 వేల అడుగుల ఎత్తున ఉన్న డోల్కా పర్వత శిఖరాగ్రం పై వెయ్యేళ్ళ నాటి ప్రాచీన గణపతి విగ్రహం లభించి ,అందర్నీ ఆశ్చర్య పరచింది .భీకరారణ్యాలమధ్య ఉన్న ఈ పర్వతం చేరటం చాలాకష్టం ..పదవ శతాబ్ది కి చెందినా 6 అడుగుల ఎత్తు 21 అడుగుల వెడల్పు ఉన్న అతి భారీ గ్రానైట్ విగ్రహమిది .దీన్ని స్థానిక జర్నలిస్ట్ కనుగొన్నాడు .ఎవరు శిల్పించి అంతఎత్తుకు చేర్చారో అన్నదానిపై ఆర్కియాలజిస్ట లు బుర్రలు పగలకోట్టుకొంటున్నారు .
ఇక్కడ లభించటానికి పౌరాణిక చారిత్రక కారణం ఉంది .బస్తర్ ప్రాంతం లోనే పూర్వం వినాయకుడికి ,పరశురాముడికి యుద్ధం జరిగింది .అందుకే ఈ గణేశునికి విపరీతమైన ఆరాధన ఇక్కడ జరుగుతుంది .వేలాది భక్తులు దేశం నలుమూలలనుంచి వచ్చి , దర్శించి ఆశీస్సులు పొంది , కోర్కెలను తీర్చుకొంటారు .రాజీవ్ రంజన్ అనే రచయిత ,ఇలాంటి అద్భుత విషయాలు బస్తర్ లో చాలాఉన్నాయని ,పరిశోధకులు వీటిపై దృష్టి పెడితే మరిన్ని విగ్రహాలు, దేవాలయాలు బయట అడతాయని లేకపోతే వాటి చరిత్ర భూగర్భం లో కలిసిపోతుందని హెచ్చరించాడు .ఈ ప్రాంతం ఒకప్పుడు అతి బీద అటవీ వాసుల ఆవాస భూమిగా ఉండేది .ఇప్పుడంతా మావోయిస్ట్ ల అధీనం లో ఉంది .అరణ్య సొగసు ,ప్రకృతి సంపద సహజ సౌందర్యం బస్తర్ ప్రాంతవిశేషం .ప్రభుత్వాలకు శ్రద్ధాసక్తులు తక్కువవటం తో అందరూ బాధపడుతున్నారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-18 ఉయ్యూరు