మా నైంత్ క్లాస్ మనవడు పరిగెత్తుకొచ్చి ‘’తాతా!రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా’’అన్నాడు .పిల్లకాకి కేం తెలుసు?అనుకోని ,’’ఏరా అదేమైనా ఆషామాషీ వ్యవహారమా ? అది యుద్ధ విమానం రా ‘’అన్నాను .’’అయితే ఏంటిట?’’అన్నాడు .’’కాదురా బుడ్డీ !దాని సంగతి నీకేం తెలుసు ?’’అన్నాను .’’తాతా!చిన్నప్పుడు నేను కాగితం పడవలు చేసి వాననీళ్ళలో పరిగెత్తించా .కాగితాలతో రాకెట్లు తయారు’ చేసి క్లాస్ రూమ్ లో టీచర్లపై వేశా.కాగితం విమానాలు చేసి గాల్లో ఎగరేశా .ఇంతకంటే అనుభవం ఏం కావాలయ్యా తాతయ్యా ?’’అన్నాడు రెచ్చిపోయి . ‘’కూల్ డౌన్ మై డియర్ గ్రాండ్ సన్’’అన్నాను .’’తాతా !నువ్వు టి.వి. చూడవ్ .న్యూస్ వినవ్ .ఎవరైనా చానెళ్ళలో డిస్కస్ చేస్తుంటే కట్టి పారేస్తావు .మోడీ భజన తప్ప నీకేం తెలుసు ?’’అన్నాడు .తలది౦చు కొన్నా మాట్లాడ లేక .’’సరేరా !కాగితం పడవలు , విమానాలు చేస్తావు బాగానే ఉంది .ఇవి డిఫెన్స్ విమానాలు .వాటిబోల్ట్ లు, నట్లూ కూడా తయారు చేయటం కూడా రాని వాడివి .నువ్వు మీసాలు మెలేస్తావా ?’’అన్నాను .తాతా !మిస్టర్ క్లీన్ అనిపించుకున్నవాళ్ళు పీకల్లోతు అవినీతి బురదలో కూరుకుపోయి ,ఎన్నికలలో ఓడిపోయారు తెలుసా ? ‘’అని దబాయించాడు .’’ఒరే !నువ్వు మిడికేది తొమ్మిదో గలాసు .ఇన్ని విషయాలు ఎలా తెల్సు ?’’అని నేను దబాయించా .అసలు రహస్యం చెప్పాడు . ‘’రోజూ చదువు కొన్నతర్వాత యు ట్యూబ్ లో దేశం లో ఏం జరుగుతోందో చూడండి .భావి పౌరులు మీరేకదా!అని మా టీచర్లు చెప్పారు .అందుకే చూసి విషయాలు తెలుసుకొన్నా .మాఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తా ‘’అన్నాడు .ఇంకేం మాట్లాడను ? వాడి చేతిలో దొరికి పోయా ఫుల్లు గా .’’ఏంటితాతా ఇందాక నట్లు బోల్ట్లు అన్నావ్ ?’’అన్నాడు .’’అవున్రా! కనీసం టెక్నాలజీ పై అండర్ స్టాండింగ్ కూడా లేని నువ్వు రాఫెల్ అంటూ ఫూల్ అవుతావేంట్రా ?’’అన్నా .’’చాల్లే తాతా ! మన ప్రదానికి సైన్స్, టెక్నాలజీ నాలెడ్జ్ పూజ్యం అన్నాడు విశ్లేషకుడు సి నాగేశ్వరరావు ‘’అన్నాడు .’’రే!ఆయన౦టే వాళ్లకు ద్వేషం .ఆయన ప్రగతి శీల విధానాలను తప్పు పట్టటమే వాళ్ల ధ్యేయం .మీడియా ఉందికదా అని సొల్లు కబుర్లతో డిస్కషన్ పేరిట గంటలు గంటలు సాగదీస్తారని విన్నాను’’అన్నాడు .’’అబ్బచ్చీ !యెంత నంగనాచి తుంగబుర్ర మీ నాయకుడు తాతాజీ ?‘’ అన్నాడు ‘.’’ఒరే ఊరుకొంటూ ఉంటె మరీ పెట్రేగి పోతున్నావు .అడ్డకట్ట వెయ్యి ‘’అని దబాయించాను .’’అ౦బానీకున్న క్వాలిఫికేషన్ ఏమిటి ? నాకు లేని దేమిటి ?’’అన్నాడు .’’మళ్ళీ మొదటికే వచ్చావా ?అతడికి ఇండియాను కొనేంత డబ్బుంది ‘’అన్నా .’’అంతకు మించి అప్పుకూడా ఉందిట తాతగారూ ‘’’అన్నాడు .అవాక్కయ్యా .లేని ధైర్యం తెచ్చుకొని ‘’ఆయన కావాలంటే కోట్లు పెట్టుబడి పెట్టగలడు . మరినువ్వో ?’’అన్నా .’’నేను నీపాత కోట్లు పెట్టుబడి పెడతాలే తాతా’’అని వేళాకోళమాడాడు .
‘’సరేరా !ఇది అంతర్జాతీయ ఒప్పందం .ఆ విమానాలు తయారు చేసేది ఫ్రాన్స్ దేశం .వాళ్లకు బోలెడు టెక్నాలజీ ఉంది .అంత టెక్నాలజీ అంబానీ రిలయెన్స్ కుందని నమ్మి ఆ డీల్ ఇప్పించాడు మోడీ ‘’అన్నాను .’’ఓహో ఏం సెలవిచ్చావ్ తాతా !అంబాని విమాన తయారీ కంపెనీ పెట్టి అప్పటికి ఆరునెలలు కూడా కాలేదు .విమానం తయారు చేసే అనుభవం ఉన్న కంపెనీకాదు . నువ్వన్నట్లు కనీసం వాటి నట్లూ బోల్ట్ లు కూడా తయారు చేసే టెక్నాలజీ వాళ్లకు లేదు ‘’’’అన్నాడు .’’ఎదురు మాట్లాడే సాహసం చేయలేకపోయా .’’యుద్ధ విమానాల డీల్ చాలా రహస్యం .దాన్ని ఎవరూ బయటపెట్టరు అంత సీక్రెట్ ‘’అన్నా .’’సాకులు చెప్పకు తాతా .అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడి గర్ల్ ఫ్రెండ్ సినిమాకు అంబాని 23 కోట్లు పెట్టుబడి పెట్టాడట .అంబానీ మోడీకి జిగ్నీదోస్త్ .అందుకే డీల్ అప్పగించాడు మీ గురువు ‘’అన్నాడు .నిరుత్తరుడనయ్యా .’’తాతా ! నిష్పక్ష పాతంగా విషయాన్ని విశ్లేషించే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ‘’యుడిఎఫ్ ప్రభుత్వం 136 రాఫెల్ విమానాలు కొందామనుకొంటే ,ఇప్పుడు మోడీ ప్రభుత్వం 36 విమానాలనే వాళ్ళు కొందామనుకొన్న రేటుకంటే 5 రెట్లు ఎక్కువ పెట్టి డీల్ కుదుర్చుకున్నారు . అసలు’’ తేజస్వి’’ లాంటి ప్రసిద్ధ యుద్ధ విమానాలు తయారు చేసి ఎంతో అనుభవమున్న భారతప్రభుత్వ’’ హిందూస్తాన్ ఐరో నాటికల్ మిటెడ్- హాల్ ‘’ఉండగా ,ఇంతవరకు ఏ కంపెనీని సమర్ధవంతంగా నడిపాడు అన్న పేరులేని , భారతీయ బ్యాంకులకు రెండు లక్షలకోట్ల అప్పుఉన్న అంబానీకి అప్పగించటం ఏమిటి ?“’అని ప్రశ్నించాడు .’’అవునా ’’అన్నాను నేనూ నంగనాచిలా .
‘’ అదికాదు కాని తాతా !యెంత స్నేహితుడైనా భారత దేశం డబ్బు 30 వేలకోట్లు అప్పనంగా ఆయనకు ,మరోపేరుతో నాన్ డిఫెన్స్ ఆర్టికల్స్ తయారు చేయటానికి అంబానీ సోదరుడికి కట్టబెట్టి దేశం పరువు తీశాడు మీ అధినాయకుడు .ప్రభుత్వ రంగ సంస్థ సమర్ధవంతంగా యుద్ధ విమానాలు తయారు చేసే సామర్ధ్యం ఉంటే నట్లూ బోల్ట్ లూ తయారు చేయటానికి ఫ్రాన్స్ తో ఒప్పందం ఆఘమేఘాలమీద కుదుర్చుకోవటం ఏమిటి ?మరోమాట తాతాజీ !అంబానీ రిలయెన్స్ సంస్థను సూచిందే మోడీ అనీ ,దానినే ఫ్రాన్స్ ఆమోదించిందని మాజీ అధ్యక్షుడు చెప్పాడని , మోడీ అబద్దాలకోరు అని పాక్ కొత్తప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అన్నాడని ‘’కుండబద్దలు కొట్టాడు ‘’బంగారాన్ని ధర్మకాటా వేసినట్లు ఎటూ మొగ్గులేకుండా కాటా సుబ్బారావు ‘’అనగానే నిజంగా నా మైండ్ బ్లాంక్ అయి ఏదో అనాలని ‘’కుదబద్దలు ఏమిట్రా .కొత్తగా ఉంది ‘’అన్నా .కాటా సుబ్బారావు అనే ఆయన దాన్ని నడుపుతున్నాడు చాలా నిర్మోహమాటంగా నిష్పాక్ష పాతంగా విశ్లేషిస్తాడు సుబ్బారావు .’’అన్నాడు .
‘’సడే లే సంబడం ‘’అన్నా .’’తాతా ! నీ ఫ్రెండ్ కు ఫోన్ చేసి రాఫెల్ నాకిప్పించు .రఫ్ఫాడిస్తా’’ నన్ను గేలి చేస్తూ అని పారిపోయాడు . ..దేశ రక్షణ ఇలాంటి బచ్చా గాళ్ళ లాంటి చిన్నపిల్లాళ్ళ చేతిలో, మాటలో నవ్వులపాలైందని సిగ్గు తో తలవంచుకున్నా చేసేది లేక .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు . ,.
.
—