అణు శాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకట రామయ్య
సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఇప్పటికి 30 సుప్రసిద్ధ గ్రంథాలను ప్రచురించింది .అందులో నేను రాసినవి 18 ఉన్నాయి .వీటిలో ‘’కేమోటాలజి పిత కొలచల సీతారామయ్య ‘’మన ఆంద్ర శాస్త్రవేత్త గురించి రాసినది .ఇప్పుడు అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య గారి పై వస్తున్న ఈ పుస్తకం నా 19 వది ,సరసభారతి ప్రచురిస్తున్న 31 వ పుస్తకం.దీనికి సరసభారతికి అత్యంత ఆప్తులు ,ఉయ్యూరు వాసి ప్రస్తుతం అమెరికా లో నివసిస్తున్న శ్రీ మైనేని గోపాల కృష్ణ ,ఆయన అర్ధాంగి శ్రీమతి సత్యవతి గార్లు . వీరిద్దరి ఆర్ధిక సహకారం తో ఇప్పటికి 8 గ్రంధాలు ప్రచురించాము .ఇది వారి స్పాన్సర్ షిప్ లో వస్తున్న9 వ అమూల్య మైన బుక్ లెట్ . వారిద్దరి సహకారానికి సరసభారతి సర్వదా కృతజ్ఞతలతో ఉంటుంది .శ్రీ రామయ్య గారు తమపై పుస్తకం మేము ప్రచురించటానికి అంగీకరించటం, వారు , వారి అర్ధాంగి శ్రీమతి కృష్ణమయి గారు నాకు ఫోన్ చేసి అభినందించి వారి కుటుంబం గురించిన విషయాలు ప్రాధమికంగా తెలియ జేశారు . రామయ్యగారి కుటుంబం విద్య ,ఉద్యోగవివరాలు, గ్రంథ రచన,ఇంటర్వ్యులుమొదలైన విలువైన సమాచారం , విశేషాలతో పాటు అరుదైన ఫోటోలు మాకు అందజేయటం వలన ఈ రచన సాధ్యమైంది .శ్రీ గోపాలకృష్ణగారు నాకూ శ్రీ రామయ్య దంపతులకు మధ్య చక్కని ఆత్మీయ వాతావరణం ఏర్పరచి రచనకు విపులంగా దోహద౦ చేశారు .ఇందరి అమృత మూర్తుల సహకార ఫలితమే ఈ చిరు పొత్తం .నేటి యువతకు ,శాస్త్ర పరిశోధకులకు రామయ్య గారి జీవితం ,పరిశోధనలు కరదీపికగా ఉండాలన్న మా ప్రయత్నం సఫలీకృతమౌతుందని ఆశిస్తున్నాం .
దీనిని అత్యంత సుందరంగా 16 ఫాంట్ , 1/8 డెమ్మీసైజులో రామయ్యగారి అరుదైన ఫోటోలతో ,పూర్ర్తి కలర్ పేజీలతో, కవర్ పేజీలతో సహా 36 పేజీల” కరదీపిక ”గా శ్రీ మైనేని గారు హైదరాబాద్ లో శ్రీ కర్రి శివప్రసాద్ ,,డా. ద్రోణవల్లి రామమోహనరావు గార్ల పర్యవేక్షణలో ముద్రింప జేస్తున్నారు ..పుస్తకావిష్కరణ తేదీ సమయం మొదలైన వివరాలను డిసెంబర్ మొదటి వారం లో తెలియజేస్తాం అప్పటిదాకా వేచి చూడమని మనవి .-గబ్బిట దుర్గా ప్రసాద్