’2018 సెప్టెంబర్ 28 వార్ధా లోని గాంధి పీస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు శ్రీ కుమార్ ప్రశాంత్ నాతొ చేసిన టెలిఫోన్ సంభాషణలో నా మొదటి ,చివరి 1988 లో వార్ధా సేవాగ్రామసందర్శన యాత్ర జ్ఞాపకాలు సుళ్ళు తిరిగాయి .మొదట నేను పౌనార్ ఆశ్రమ వెళ్లి శ్రీ వినోబాభావే సోదరుని చూశాను .అక్కడనుంచి వార్ధా వెళ్లి సర్క్యూట్ హౌస్ లో బస చేశాను .అప్పటికి నేను షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్నాను .జులై 1988 లో రిటైరయ్యాను .అక్కడ 1943-46 మధ్యకాలం లో బెనారస్ నుండి ప్రచురితమౌతున్న ‘’ఆజ్ ‘’పత్రిక లో ప్రచురితమైన వ్యాసాలను నా యవ్వనం లో చాలా ఆసక్తిగా చదివేవాడిని .వీటిని నాకు పంపించే శ్రీ ఉమాశ౦కర శుక్లాను ఇప్పుడు కలిసి మాట్లాడాను .ఆయన దేశం లో లబ్ధ ప్రతిస్టు డైన జర్నలిస్ట్ .ఆయన రాయిటర్స్ పత్రికలోనూ పనిచేసేవారు .లూయీ ఫిషర్ సేవాగ్రాం సందర్శించి బాపు పై పుస్తకం రాసినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు .45 ఏళ్ళ క్రితం నాటి తన రచనలు నేను ఆసక్తిగా చదవటం ఆయన అభినందించారు .మా తండ్రి పండిట్ చంద్ర బాలి త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని బస్తి లో ఆజ్ పత్రిక ,అమృత బజార్ పత్రికలకు కరేస్పా౦ డెంట్ గా ఉండేవారు .అమృత బజార్ పత్రిక కలకత్తా ను౦డి మారి, అలహాబాద్ నుండి అచ్చు అయ్యేది .అప్పుడు ప్రసిద్ధ సంపాదకుడు తుషార్ కాంతి ఘోష్ దాని సంపాదకుడు .శుక్లాగారు నన్ను మగన్ వాడికి తీసుకు వెళ్లి ,ప్రసిద్ధ ఆర్ధికవేత్త ,ప్లానింగ్ కమిషన్ మెంబర్ స్వర్గీయ శ్రీ నారాయణ అగర్వాల్ గారి అర్ధాంగి శ్రీమతి మదాలసా దేవి గారిని పరిచయం చేశారు. ఈమె గాంధీజీ కి అత్యంత సన్నిహితులు, భారత జాతీయ కాంగ్రెస్ కు చాలాకాలం కోశాధికారి గా ఉన్న శ్రీ జమ్నాలాల్ బజాజ్ కుమార్తె . నేను వచ్చే ఏడాదిలో రిటైరయ్యాక తమ సంస్థలలో ఏదో ఒకదానిలో పనిచేయమని ఆమె కోరారు .
శుక్లాగారు నన్ను సేవాగ్రాం తీసుకు వెళ్ళారు .అక్కడొక రోజంతా గడిపాను .అక్కడ అత్యల్ప వేతనం తో పనిచేసే బాపు సహాయకుని చూశాను .మహాత్ముడు నివశించి ,ప్రపంచప్రసిద్ధ నేతతో సంభాషించిన ఆశ్రమ౦ , .దాని ప్రక్కనేకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమయే ప్రదేశం ఇప్పుడు ఖాళీ గా ఉండటం మర్చి పోలేని విషయం .ఈతరం వారు ఆ ఆశ్రమ వారసత్వాన్ని ఊహించుకోలేరు . కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరిని,నీటి ద్వారా మరుగు దొడ్లనుపాయిఖానాలను స్వయంగా కడిగి శుభ్రం చేయమని ఆదేశించేవారు .వీరిలో సర్దార్ పటేల్ ,రాజేంద్ర ప్రసాద్ ,మౌలానా ఆజాద్ ,పండిట్ జవహర్ లాల్ నెహ్రు మొదలైన హేమాహేమీలైన జాతీయ నాయకులు కూడా ఆపని చేసేవారు .అక్కడ నేను ప్రముఖులైన ఇద్దరిని -స్వర్గీయ రామదాస్ గాంధీ భార్య ను ,నా విద్యార్ధి జీవిత సహచరుడు రవీంద్ర వర్మలను చూశాను .
సేవాశ్రమం దగ్గరనుంచి శుక్లా నన్ను ‘’ఆనందవనం’’ తీసుకు వెళ్ళారు .ఇక్కడ కూడా పూర్తిగా ఒక రోజున్నాను .దీని వ్యవస్థాపకులు శ్రీ బాబా ఆ౦ప్టే.దీన్ని దర్శించేదాకా ఆయన అద్భుత కృషిని తెలుసుకోలేక పోయాను .సంపన్న ఉన్నత బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన బాబా ఆం ప్టే, ఇంగ్లాండ్ వెళ్లి ,బార్ యెట్-లా చదువుతూ, రోజూ టెన్నిస్ ఆడేవారు .స్వదేశానికి తిరిగి వచ్చి భార్యతో సహా కుష్టునివారణ, కుష్టు రోగుల సేవలో నిమగ్నమయ్యారు .అందుకని ఆనాటి బ్ర్రాహ్మణులు ఆయనను సంఘ బహిష్క్రుతుని చేశారు .వెనకడుగు వేయకుండా పట్టణం వెలుపల , కుష్టు రోగులతోకలిసే జీవించారు .రాళ్ళు రప్పలు పొదలు దట్టంగా ఉన్న ఆప్రాంతాన్ని ఇతరుల , రోగుల సాయంతో ఎంతో శ్రమ చేసి , పచ్చదనంతో కనువిందు చేసే నివాసభూమిగా మార్చారు . ఆ తర్వాత ఇలాంటిదే మరొక గ్రామీణ సాంకేతిక అద్భుతాన్నిఅన్నాహజారే తన స్వగ్రామం రాలెగావ్ షిండే లో చేసి చూపారు .ఈ రెండిటిలో ఆనందవనం చాలా పెద్దది , విస్త్రుతమైనది .ఆ కాలం లో కుష్టు రోగుల పిల్లలకు బడులలో ప్రవేశం ఉండేదికాదు .బాబా ఆంప్టే దీనికి పరిష్కారంగా తానే వారికోసం ఒక స్కూల్ స్థాపించి ,క్రమ౦గా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయికి పెంచి ,కుష్టు రోగులకాలనీ వారికేకాక ,ఈ విద్యా సంస్థలలో తమపిల్లలు చదువు కోవచ్చునని సాధారణ ప్రజలనుకూడా ఆహ్వానించారు .అందరి సహకారం తో సహకార జీవితం సాధించి ,వర్క్ షాప్ ,చేతి తోతయారు చేసేకాగిత పరిశ్రమ ,కోఆపరేటివ్ సొసైటీ ,బహిరంగ సినిమా దియేటర్ వంటి ఎన్నో సంస్థలను నెలకొల్పి ‘’ఆనందవనం’’గా రూపొందించి తీర్చి దిద్దారు .ప్రఖ్యాత నాటకరచయిత శ్రీ పి.ఎల్.దేశ పాండే దియేటర్ ను ప్రారంభించి అందరికి అందుబాటులోకి తెచ్చారు .బాబా ఆంప్టే దంపతులు , ,పూర్వపు ,ఇప్పటి కుష్టు రగుల నిరంతర అవిశ్రాంత శ్రమ కృషి ఫలితంగా ఏర్పడినదే ‘’ఆనందవనం ‘’.హాట్స్ ఆఫ్ బాబాజీ .ఇంత గొప్ప ఆశ్రమ౦ సందర్శించే అదృష్టం నాకు కలిగించిన శుక్లా గారికి ధన్యవాదాలు .ఆనందవనం లో బాబా గారి భార్య శ్రీమతి ఆంప్టే ను సందర్శించాను .నేను వెళ్ళిన సమయానికి బాబా దూరంగా అస్సాం లో’’భారత్ జోడో యాత్ర ‘’లో ఉన్నారు .కనుక వారిని దర్శించే భాగ్యంకలగలేదునాకు . వెన్నెముక సంబంధమైన ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నా కూడా బాబా, తన వాన్ లో స్పెషల్ స్ట్రెచర్ పై పడుకొని దేశం లో ఎంతదూరమైనా ప్రయాణం చేస్తారు .అలాగే నర్మదానదీ తీరం లో జరిగిన’’ నర్మదా బచావో ‘’ఆందోళనలో పాల్గొన్నారు .తన ఆరోగ్యం కంటే ప్రజా సమస్యయే ఆయనకు ముఖ్యం .మళ్ళీ ఆన౦దవనం కు తిరిగి రానేలేదు .ఇంతటి లెజేండరి వ్యక్తులు అరుదు .బాబా గారి కుమారులిద్దరూ డాక్టర్లు .వారినీ చూడలేక పోయాను .వీరిద్దరూ గ౦ధ్ చిరోలీ లో పీడిత గిరిజనుల తో కలిసి పని చేస్తున్నారు . వీరిద్దరూ ప్రజలలో బాగా సుప్రసిద్ధులైనారు . ఈ గిరిజనులు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల దృష్టిలో తీవ్రవాదులు, నేరస్తులు అవటం ఒక విచిత్ర విడ్డూరం -ఐరనీ . ఈ ప్రభుత్వాలు పారా మిలిటరీ దళాల త్యాగాలతో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఈ గిరిజనులను, వీరిఉద్యమాన్ని అణచి వేయవచ్చునని భావిస్తోంది .నేనుమాత్రం గిరిజనులు చేసే , ,ప్రభుత్వాలు చేబట్టే హింసకు మద్దతు తెలిపపేవాడినికాను . ‘’
ఆధారం –శ్రీమైనేనిగోపాలకృష్ణ గారు ఈ ఉదయం పంపిన శ్రీ చంద్రభాల్ త్రిపాఠీ రచన ‘’A Pigrimage to Wardha –Sewagram in 19 88’’.
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా శ్రీ త్రిపాఠీ జ్ఞాపక శకలం ఇది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-9-18 –ఉయ్యూరు
వినోబాజీ పౌనార్ ఆశ్రమం
—