కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -18
‘’సారీ ‘’తో ఆధార౦ వివరాలు –
‘’ కోన సీమ ఆహితాగ్నులు ‘’ గురించి 17 ఎపిసోడ్ లు రాశాక ,ఇప్పటిదాకా సస్పెన్స్ లో ఉంచి , దీనికి ఆధారం విషయం ఇక భరించలేక ‘’అతి రహస్యం బట్ట బయలు చందం ‘’ గా’’ సారీ’’ తో ఇప్పుడు బయట పెడుతున్నాను . ,హైదరాబాద్ లో ఉంటున్న మా రెండో అబ్బాయి శర్మ నా కోసం ‘’గీర్వాణ౦ -4 ‘’సంస్కృత కవుల ఆచూకీ కోసం చాలా శ్రమపడి ఎన్నో రిఫరెన్స్ గ్రంథాలను షేక రించి మెయిల్ లో పెట్టి పంపిస్తూ ,నా బాధ్యత తానే ఎక్కువగా తీసుకొంటూ ,నిజంగా ఐ బి ఏం పని ఒత్తిడి లో క్షణంన్నర తీరిక కూడా లేకుండా ఉన్నా, నేను అడిగింది ,వెతికి, కొత్త కవులను,నేను అడిగిన విషయాలనూ పంపుతూ ఉంటాడు .అలాంటిది ఆర్నెల్ల క్రితం ఒక రోజు ‘’నాన్నా !గూగుల్ లో ‘’వేదిక్ వాయిసెస్ ‘’అనే పుస్తకం గురించి చదివాను .అందులో కోనసీమ వేద విద్వాంసుల గురించి ఉన్నట్లు’’ సినాప్సిస్ ‘’ చెబుతోంది. మైనేని గారి ద్వారా ట్రై చేస్తే బాగుంటుందేమో ‘’అని మెయిల్ రాశాడు .’’ఉచిత సలహా’’ బాగానే ఉంది .నేను ఆగుతానా ,వెంటనే గోపాలకృష్ణ గారికి మా వాడిచ్చిన వివరాలతో మెయిల్ రాశాను .ఆయన నా దగ్గర్నుంచి మెయిల్ వస్తే ,అసలు ఆగరు కదా !వెంటనే గూగుల్ లో వెతికి అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసి నాకు పంపించే ఏర్పాటు నిమిషాలమీద చేసేశారు .’’ఈ నాటి ఈ బంధ మేనాటిదో ‘’అని పించారు .పుస్తకం నాకు 12-2-18 బహు జాగ్రత్తగా అందింది .అదే 24 సెంటిమీటర్ల పొడవు ,15 సెంటి మీటర్ల వెడల్పు ,3 సెంటి మీటర్ల మందం ఉన్న సుమారు 3 వేల రూపాయల 260పేజీల అరుదైన బృహత్ గ్రంథం ‘’Vedic Voices ‘’.-Intimate Narratives of a living ‘’ANDHRA TRADITION ‘’ దీన్ని రాసినవారు అమెరికన్ రచయిత’’DAAVID .M. KNIPE .’’డేవిడ్ ఏం ,నైప్-ప్రోఫెసర్ ఎమిరిటస్ సౌత్ ఏషియన్ స్టడీస్ ఎట్ ది యూనివర్సిటి ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ యు .ఎస్.ఏ .ఈయన మరో రచన ‘’హిందూ ఇజం –ఎక్ష్పెరిమెన్ట్స్ ఇన్ ది సేక్రేడ్ ‘’
పుస్తకం చేతిలోకి వచ్చిన క్షణాన్నే మైనేనిగారికి కృతజ్ఞతలు, మా శర్మకు అభినందనలు తెలియ జేసి ,పుస్తకం లో దూరి పోయాను .ఒక సరికొత్త పాత లోకం లో అడుగు పెట్టిన గొప్ప అనుభూతి కలిగింది .ఆపు లేకుండా 10 రోజుల్లో చదివేశాను .చాలా ప్రణాళికా బద్ధంగా .అత్యంత నిర్దుష్టంగా కోనసీమ ఆహితాగ్నుల గురించి రచించినపుస్తకం ఇది .రచయిత కున్న అవగాహన ,చెప్పాలన్న తపన ,వారందరి ఇళ్ళకు వెళ్లి వివరాలు సేకరించిన విధానం వారి అనుమతి తో తీసిన ఫోటోలు ,వారి కుటుంబ వంశాల నేపధ్యాల వివరణ ,వారి తరువాత తరం వారి విశేషాలు అతనిభాషలో Extended Famiies ‘’అన్నీ సవివరంగా అతి తేలిక ఇంగ్లీష్ పదజాలం తో హృదయానికి హత్తుకొనేట్లు రాశాడు .ఇంతటి ఆంకిత భావానికి ఏమిచ్చి తెలుగు జాతి రచయిత ఋణం తీర్చుకో గలదు ?
వీరి గురించి మనవాళ్ళెవరూ ఇంత అధ్యయనం చేసి రాసిన దాఖ లాలు లేవు అనిపించింది నా చిన్నబుర్రకు .శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తమ ‘’అనుభవాలు జ్ఞాపకాలు ‘’లో కొందరి వేద విద్వత్తు, వారి అమోఘ సామర్ధ్యాల గురించి కొంత అక్కడక్కడ తెలియ జేసి ఉండవచ్చు .వీరేశలింగం గారు వాళ్ల ఛాందసాన్ని హాస్య అపహాస్య వ్యంగ్యాలకెక్కడైనా పేర్లు లేకుండా ప్రస్తావించి ఉండచ్చు .కాని ఇంత సమగ్రంగా ఏరచయితా రాసినట్లు లేదనే నేను అనుకొంటున్నాను .ఎవరైనా వారి కుటుంబసభ్యులు ఒకరిద్దరి గురించి రాసి ఉండవచ్చు .కాని ఇంతటి సమగ్ర రచన లేదనే నా విశ్వాసం .
అన్నీ వేద వ్యవహార ,కర్మ కాండల పదజాలమే .పడికట్టు పదాలే .వాటిని ఆంగ్లం లో అతి తేలికభాషలో రాయటం ‘’అంత వీజీ కాదు ‘ . ’అసాధ్యాన్ని సుసాధ్యం చేసిచూపాడు రచయిత’’ ’నైప్’’ నిజంగా కత్తి’’నైఫ్ ‘’అని పించాడు హాట్సాఫ్ .1980 అక్టోబర్ 3 న అతడు కోనసీమ వేదపండితులతో అతని భాష లో ‘’ఎన్ కౌంటర్ ‘’ప్రారంభించాడు .కొందరు వేదపండితులు అతన్ని సంశయించారు ,కొందరు విషయాలు చెప్పటానికి స౦దేహించారు ,అతన్ని వారు ‘’దొర ‘’అని దూరం పెట్టారు ఈ రచయిత తన యువ కొలీగ్ ప్రొఫెసర్ ,ఆంద్ర విశ్వ విద్యాలయఫిలాసఫీ ఎమిరిటస్ చైర్ శ్రీ ఏం వి .కృష్ణయ్య తో కలిసి ఎక్కే ,గుమ్మం దిగే గుమ్మం గా శ్రమించాడు అగ్రహారాలు వాటి నేపధ్యంతెలుసుకొని ,రాజమండ్రి ,అన్నవరం ,సింహాచలం ,విజయవాడ లు తిరిగాడు .’’రామ ,కృష్ణ ‘’వచ్చారని పించుకున్నారుఇద్దరూ .3 ,700 ఏళ్ళ భారతీయ సంప్రదాయాన్ని అర్ధం చేసుకొన్నారు .కైమోడ్పు ఘటించాడు .ప్రముఖ ఆంగ్ల కవి టిఎస్ ఇలియట్ కవితాపంక్తి ‘’Ido not know much about gods,but I think that the river is a strong brown god ‘’రచయితకు ప్రేరరణ .
డెల్టా ,ఏర్పాటు ,రాజవంశాలు ,స్థానిక రాజులు ,కాకతీయ సామ్రాజ్యం ,ఇస్లాం మతం దక్కన్ లో కాలుపెట్టటం, విజయనగర సామ్రాజ్యం,యూరోపియన్ లరాక, డెల్టాలోఆదిపత్యం ,ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు ,అగ్రహారాలు ,వేదపండితులపరిభాష ,నాలుగు ఆశ్రమాలు , ధర్మాలు ,జీవన భ్రుతి అవకాశాలు ,ఆహితగ్ని నిర్వచనం వారి పరిభాష ,ఆగ్ని హోత్రం తో అనుబంధం,ఆహితాగ్నుల , వేదపండితుల’’ స్వర హేల ‘’మొదలైన శీర్షికలతో రచయిత ఈ గ్రంథాన్ని’’సుసంపన్నం ‘’చేశాడు .
ఇది చదివి మీకు ఆవిషయాలు అందించాలని మధనపడి ,శీర్షికకోసం కొన్ని రోజులు ఆలోచించి ఇప్పుడున్న శీర్షికతో 25-7-18 రాయటం ప్రారంభించాను .అయ్యా ఇదీ నేపధ్యం అని విన్నవిస్తున్నాను .రచయితా నైప్ కు ,పుస్తకం కొనిపంపిన మైనేని గారికి వ్యాసాలు చదివి ఆదరించిన మీకు ధన్యవాదాలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-7-10-18 –ఉయ్యూరు
1-
.