కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24
బ్రహ్మశ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్ర శాస్త్రి గారు (1909-1983)
కాకినాడకు చెందిన కాశ్యప గోత్రీకులు బ్రహ్మశ్రీ కపిలవాయి వెంకట సోమ యాజులు ,సుబ్బలక్ష్మీ సోమి దేవమ్మ దంపతులకు అయిగురు పుత్రులు ,ముగ్గురు పుత్రికలు .వీరి పెద్దకుమారుడు పెద్ద రామ శాస్త్రి (1889-1987)గారు 98సంవత్సరాలు జీవించారు .అరుదైన వేదపండితునిగా గణనకెక్కారు.వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయారు .కనుక త్రేతాగ్నులలో ఒకే ఒక అగ్ని హోత్రాన్ని ఆరాధించారు.రెండవ కుమారుడు చిన్న రామ శాస్త్రి గారు (1904-85) కూడా గొప్ప వేదపండితుడే.వివాహమాడి గ్రాహ్యపత్యాగ్ని మాత్రమే చేశారు.కాని తండ్రిలాగా త్రేతాగ్నులను ఆరాధించలేదు .ఈయన బాబళ్ళశాస్త్రిగారికి సమకాలీనుడు .మూడవ కుమారుడు జన్మించిన తర్వాత నాలుగవ పుత్రుడు శ్రీ యజ్ఞేశ్వర శాస్త్రి గారు జన్మించారు .ఈయనే మన కథానాయకులు .
యజ్ఞేశ్వర శాస్త్రిగారు అన్నగారు పెద్ద రామ శాస్త్రి గారి వద్దనే వేద౦ నేర్చారు.వీరు అన్నివిధాల తండ్రికి సరిజోడు . దక్షిణ భారత దేశం లో వీరికి మించిన వేదపండితులు, శ్రౌతం కార్య నిర్వాహకులు లేరని పించుకొన్నారు .అనేక ప్రముఖ పట్టణాలలో తమ విద్వత్ ప్రదర్శన చేసి గొప్ప ప్రశంసల౦దుకొన్నారు .పర్య వేక్షణలో ,ఆర్ధిక ప్రోత్సాహమివ్వటం లో ,పదోన్నతిలో ,కార్య నిర్వహణలో ఆయనకు సాటి మరెవ్వరూలేరు .కాని చిన్నన్నగారు చిన్న రామ శాస్స్త్రి గారిలాగా ‘’ఆధానం ‘’చేయలేదు.కనుక అగ్ని స్టోమంకూడా లేదు .చెయ్యాలనే కోరికలేకకాదు కాని ,సోదరుల అనాసక్తి వలనమాత్రమే .పెద్ద అన్నలిద్దరూ త్రేతగ్నులను చేయనట్లే ఈయనా చేయలేదు .దీనికి బదులు సరిసాటిలేని శ్రౌతి అనిపించుకొన్నారుఆధునిక దక్షిణ భారత చరిత్ర లో .
ఆహితాగ్ని కుటుంబం’’వేదం లో ఉన్నాం ‘’అని చెప్పినట్లుగా చేయటానికి సరైన గురువు ప్రోద్బలం కూడా అవసరం .ధర్మ శాస్త్రం చెప్పిన ‘’పరీస్ట’’అంటే పెద్దవారిని అధిగమించి తాను చేయటం అనే సందిగ్ధం కూడా తోడైంది .కనుక అన్నగార్ల అనుమతి పొందాల్సి ఉంది .పెద్దన్నగారు దారిచూపి ఉంటె తనకు ఈ ధర్మ సంకటం రాకపోయేదికదా .అప్పుడుతాను కర్మాదికారి యోగ్యతపొందేవాడినికదా అని వితర్కి౦చు కొన్నారు .వారితో సహపంక్తి భోజనానికీ అర్హత లేదు .కనీసం చిన్నన్న అయినా మనసుమార్చుకొని అగ్ని స్టోమం చేసి ఉంటే తనకీ తిప్పలుండేవి కావు .ఎప్పుడూ తోడి పెళ్లి కొడుగ్గా ఉండటమే తప్ప పెళ్లి కొడుకు పాత్ర రావటం లేదని బాధ పడేవారు అంటే యజ్ఞం లో యజమాని అయ్యే అవకాశం కోల్పోతున్నానని భావం .కనుక యజ్ఞా యాగాలకు అధికారి ,పర్య వేక్షకులుగా ఉండి’’యజ్ఞేశ్వర అగ్ని హోత్రి ‘’అని పిలిపించుకోవాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు .అంతేఇక తిరుగు లేదు. ఈ రంగం లో తనకు మించిన వారెవరూ లేరనే స్థాయి సంపాదించి’’ యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి’’ అయ్యారు .
ఆరవ ఏటనే ఉపనయనం జరిగి,పెద్దన్నగారివద్ద’’తైత్తిరీయ౦’’నేర్చారు .ఒకరకంగా అరుదైన బాలమేధావి (wunder kind )అని పించారు .25-1-1984న యజ్ఞేశ్వరుల మరణం తర్వాత రెండు నెలలకు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఆయన ఫోటో ప్రచురించి ఆయనగురించి అత్యద్భుతంగా రాసింది –దాని సారాంశం తెలుసుకొంటే వారి ప్రతిభ మనకు అవగతమవుతుంది .
’’12వ ఏటనే యజ్ఞేశ్వర శాస్త్రిగారు వేద,వేదాంగాలలో , విద్యారణ్య భాష్యం లో ,షట్ శాస్త్రాలలో వీటికి మించి శ్రౌతం లో అపార జ్ఞాన సమన్నులవ్వటం ,అన్నీ నాలుకమీద నర్తిస్తున్నట్లు గోచరించటం చూసి ఇరుగూ,పొరుగూ వారు ఆశ్చర్య చకితులై కళ్ళు అప్పగించి చూసేవారు .16వ ఏటమొట్టమొదటి సారిగా ఒక యజ్ఞాన్ని పర్యవేక్షించారు .తర్వాతకుంభ కోణం లోని కంచికామకోటి పీఠం గురుకులం లో చేరారు .అక్కడ నేలమాళిగలో ఉన్న, అక్కడ స్థానిక వేదపండితులకు అవగాహన లేని మూడు తాళపత్ర గ్రంథాలనువెలికి తీసి ,వాటిలోని రహస్యాలను వెతికి రాసి ,లోకానికి తెలియ జేసేవరకు విశ్రమించలేదు .అంతటి కఠోర దీక్ష ఆయనది ‘’.అనిఆయన ప్రతిభను ఆవిష్కరిస్తూ రాసింది .
ఈ అసాధారణ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిసింది శాస్స్త్రి గారిపై .దీనితో వారికి వేదవిజ్ఞానం పై విపరీతమైన మక్కువ ఏర్పడింది .జీవితా౦త0 ఉత్తమ గురువుల ,అత్యుత్తమ గ్రంథాల అన్వేషణలోనే ఉన్నారు .గ్రంథాల ఆచూకీకోసం భార్యతో ,ఇద్దరన్నగార్లతో కలిసి రైళ్ళు బస్సులలో ప్రయాణం సంపాదించేవారు .ఒక్కోసారి వీరంతా అనేక మైళ్ళుసాదువులు లాగా నడిచి వెళ్ళాల్సి వచ్చేది .ఈ ప్రయాణాలలో వారి ఆహారం వేరుసెనగకాయలు, జీడిపప్పుమాత్రమే .వీరి అన్వేషణ ఎక్కడైనా గొప్ప వేదపండితులవద్ద అరుదైన శాస్త్ర గ్రంథాలున్నాయా , శ్రౌత కార్యాలకు ఇంకాఎవైనా నిర్దుష్ట పద్దతులున్నాయా అని తెలుసుకోవతానికే .ఒక్కోసారి పీఠాధిపతులను సందర్శించి సంభాషించి విషయ సేకరణ చేసేవారు .తన ముఖ్య స్నేహితుడు రెండు చింతల యాజులుగారితో ,గోదావరి డెల్టాలోని మరికొందరు పెద్దలతో సమావేశమై చర్చించేవారు .అది ఆయనకు బాగా గుర్తింపు పొందిన కాలం .ఈనాడు వేదపండితులు మొదలైనవారు రైళ్ళలో బస్సుల్లో టాక్సీలలో ప్రయాణాలు చేస్తుంటే ఆనాడు వారు యెంత శ్రమ పడ్డారో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది .
ఈ వేద అన్వేషణ శాస్త్రిగారి నడి వయస్సుపై దాకా సాగింది .యాభై వయేట ఆయనకు ‘’శుక్ల యజుర్వేద వాజసనేయ సంహిత’’ కాశీలో ఉన్నట్లు తెలిసింది.అప్పటికే సూర్యాస్తమయ ,అధ్యయనకాలం రాత్రి 8గంటలకు విశ్రమించాల్సిన సమయం .ఆయన ముఖ్య గ్రంథం’’ఆపస్తంభ శ్రౌత సూత్రం ‘’దీన్నే శ్రౌతం అంటారు .ఆయనకు అత్యంత ఇష్టమైనది ‘’పౌ౦ డరీకం ‘’ .ఇదిఒక రకమైన ‘’అగ్ని చయన౦’’.ఆంద్ర దేశమంతటా ఆచరించేది .దీన్ని వారు గోదావరి కృష్ణా ,కావేరీ ప్రాంతాలలో ,రామేశ్వరం దాటి శ్రింగేరి ,కంచి ,తిరుచినాపల్లి లలో దక్షిణాన, ఉత్తరాన బదరీనాద్ ,ఢిల్లీ ,కాశీ ల లో కూడా పర్య వేక్షకులుగా ఉంటూ నిర్వహించారు .
తైత్తిరీయ సంహిత ఆయనకు అభిమానమైనదే అయినా ,ఆయనకు సామవేదం మీదా అత్యంత ఆదరణ ఉండేది .యుక్త వయసులో విజయనగరం లో ‘’రనయానియ ‘’విధానాన్ని అధ్యయనం చేశారు .తర్వాత ‘’కౌతుక పధ్ధతి ‘కంచిలో ’నేర్చారు .’’జైమినీయ పధ్ధతి’’పై ఆసక్తిలేదు .పై రెండుపద్ధతులలో తేడాలు పెద్దగాలేవని అందరూ అంటున్నా శాస్త్రిగారికి వీటిలోని సూక్షం భేదాలను గుర్తించే సామర్ధ్యం ఉండేదని వారికుమారులు చెప్పారు .ఈ భేదాలే శ్రౌతకుటుంబాలలో 20వ శతాబ్దం లో చీలికలకు దారితీసింది .
అధర్వ వేదం విషయం లో డెల్టాలో ఒకటికంటే ఎక్కువ పంక్తులలో దాట వేతలున్నాయి.శ్రీ తంగిరాల బాల గంగాధర శాస్త్రిగారు ,.యజ్ఞేశ్వర శాస్త్రిగారికి కపిలళేశ్వర పురం లో ఋగ్వేదం నేర్పారని లంకావారు తెలియ జేశారు .శాస్త్రిగారు నేర్చుకొని ఋగ్వేదం బోధించారుకూడా .త౦గి రాలవారు కాశీలో అధర్వ వేదాన్ని ప్రత్యేక విధానంలో ఉదయం వేళమాత్రమే ఒక కుండలో ఉన్న అగ్ని హోత్రాన్ని శిరసు పై ఒక తడిగుడ్డపై ఉ౦చు కొని ‘’అగ్ని వ్రతం ‘’గా అభ్యసించారు .శిష్యుడు యజ్ఞేశ్వర శాస్త్రిగారు కూడా ఇదే పద్ధతిలో నేర్చుకొన్నారు .
1975లో యజ్ఞేశ్వర ,మహాలక్ష్మి దంపతులు విజయవాడ కృష్ణలంకలో స్వగృహం నిర్మించుకొని ,ఆంద్ర దేశమంతా సంచారం చేస్తూ జీవితం గడిపారు .తర్వాత నేదునూరు లో జరిగిన ‘’వాజపేయం ‘’కు యజ్ఞేశ్వర శాస్త్రిగారు ,లంకావారు పర్యవేక్షకులుగా ఉండి నిర్వహించారు .74వ ఏట బ్రహ్మశ్రీ యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి గారు యజ్ఞపురుషుని లో లీనమయ్యారు .ఆంధ్రదేశమేకాదు , యావద్భారత దేశం కూడా ఒక మహా శ్రౌతిని ,మహనీయ వేదపండితుని కోల్పోయింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-18-ఉయ్యూరు
1-
.
—