కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25(శ్రీ శశికుమార్ పంపిన సవరణలతో )
శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారు
కపిలవాయి సోదరులు ఏడవ ఏటనుంచి 12 వ ఏట వరకు తండ్రితో ,మేనమామలతో కలిసి శ్రౌతకార్యాలకు వెళ్ళేవారు. 1953లొ పుట్టిన వెంకటేశ్వర శాస్త్రి తైత్తిరీయ సంహిత అపస్తంభం తో పాటు నేర్చి12నుంచి 15వ ఏడు వరకు ‘’ఆధ్వర్యవ ‘’,’’హోత్రీయ ‘’,’’ఔద్గాత్రీయ కాండలను0అంగుళాల మ౦ద౦ ఉన్న తాతగారు తెలుగు ,సంస్కృతాలలో రాసిన దాదాపు శిదిలావస్థలో ల ఉన్న తాళపత్రాలగ్రంథంలో ని ‘’శ్రౌతం ‘’ నేర్చుకున్నారు .తర్వాత ఋగ్వేదం ,సకల శాఖ ,ఆశ్వలాయన౦తో అభ్యసించారు.ఆ తర్వాత అధర్వ వేదం ‘’శౌనిక శాఖ ‘’అధ్యయనం చేసి 27వ ఏట1979లొ పూర్తి చేశారు .వీరికి స్పూర్తి ల౦కావారు.సామవేదాన్నీ వదిలిపెట్టలేదు .మూడు పాఠ భేదాలున్న దానిలో కొన్ని భాగాలు నేర్చుకొన్నారు .
వీరి బాబాయి శ్రీ చిన్నరామ శాస్త్రి గారు సింహాచల దేవాలయం లొ రిటైరై ,వీరిని ఆ పోస్ట్ కు సిఫార్స్ చేశారు .నిత్యమూ మహా పండితుని వలె ఋగ్వేదం వల్లే వేసుకొంటారు .19 ఏట శాస్త్రిగారికి శ్రీమతి అన్నదానం సీతామః లక్ష్మి గారితో వివాహం జరిగింది .ఈమె తెనాలిదగ్గర ఆర్యపాటి అగ్రహారం లోని వేదపండితుని కుమార్తె . భార్యతో సింహాచలం లొ కాపురము౦డి ,మగ పిల్లల కోసమని ఆశపడి వరుసగా ముగ్గురు ఆడపిల్లలను కన్నారు .చివరికి కోరిక నెరవేరి వరుస గా ఇద్దరు కుమారులు పుట్టారు .కొడుకులను వెంట తీసుకొని 1922ఏప్రిల్ లొ సింహాచలం అప్పన్న దేవాలయానికి వెళ్ళేవారు .13 ,8 ఏళ్ళ వయసులో వారిదర్నీ బడి చదువు మాన్పించేశారు ‘’వాళ్ళకి స్టమేనా ‘’’’అని అడిగితే ‘’బోడి వాళ్ళఅంగీకారం ఎవడిక్కావాలి ? పనిలేదు. నేను నిర్ణయించా.అలా జరగాల్సిందే ‘’అన్నారు మొండిగా .సోదరులిద్దరూ రోజూ ఉదయం 5 గంటలకే లేచి మూడవ కాండ రెండవ పన్నం సంతను 5 గంటలపాటు చెప్పుకొంటు౦టే ,తండ్రిగారి పారాయణ పూర్తయ్యేది .,అగ్ని రామకుమార్ ,రామ యజ్నవరాహ నరసింహ మూర్తి లకు వరుసగా ఉపనయనాలు జరిపిచారు .అన్న వేదం నేరుస్తుంటే తమ్ముడు వింటూ ఉండేవాడు ‘’ఇలా చేస్తే రెండవవాడు నేర్వటం ప్రారంభించేనాటికి అనుభవం బాగా వస్తుంది ‘’అన్నారు తండ్రి .ఆరేళ్ళ తర్వాత ఇద్దరూ మళ్ళీ బడిలో చేరి పెద్దాయన ఇంటర్ పాసై నేవీ లొ ఉద్యోగార్హత సాధిస్తే, తమ్ముడు టెన్త్ క్లాస్ లొ ఉండి,వేదం పూర్తి చేశాడు .
1998నాటికి వెంకటేశ్వర శాస్త్రిగారి ముగ్గురమ్మాయిలు సీతారామ లక్ష్మి ,సీతా మహాలక్ష్మి ,శ్రీదేవి లకు వివాహాలు అయిపోయాయి .సంతానవతులై తలిదండ్రులకు మనవళ్ళు మనవరాళ్ళను అందించారు .పెద్దమ్మాయికి ఇద్దరాడ పిల్లలతర్వాత కవల మగపిల్లలు పుట్టారు .వీళ్లిద్దరిని అతిజాగ్రత్తగా పెంచి తమ అగ్ని హోత్రవిదులు అప్పగించారు .అతి పెద్దనగరమైన విశాఖ పట్టణానికి సింహాచల౦ అతి చేరువలో ఉండటం వలన ,ఋగ్వేద పఠనం లొ మంచి గుర్తింపు పొందినందువలన వెంకటేశ్వర శాస్త్రిగారి ఆదాయం చాలా బాగా ఉండేది .వేదపండితులలో మొట్ట మొదటి సారిగా మోటార్ సైకిల్, టి.వి. సెల్ ఫోన్ లను కొన్న ఘనులాయన .మధ్యతరగతి కుటుంబమైనా మంచి ఆధునిక వనరులతో సంతృప్తిగా సంసారం గడిపారు .
దురదృస్టవశాత్తు శాస్త్రిగారి భార్య సీతా లక్ష్మి గారు 49ఏళ్ళకే కేన్సర్ వ్యాధి తో 2010లొ మరణించారు.ఆమె మరణం శాస్త్రిగారికి ,పిల్లలకు అత్య౦త బాదాకరమైంది .మళ్ళీ వివాహమాడకుండా,అగ్నిహోత్రం జోలికి వెళ్ళకుండా ఉన్నారు. ఆయన చిన్నతమ్ముడు రామశాస్త్రి కూడా అంతే .ఈయనకూడా బాబాయి ,తండ్రి గార్లలాగానే ఉండిపోయాడు .సాగారాంధ్ర లొ కుటుంబం లొ యవ్వనం లొ ఉన్న వాడు మరణిస్తే అతనిభార్య ఆమె స్నేహితులు ,బంధుజనం ‘’గుండా గుండా ‘’అని ఏడవటం సంప్రదాయం .దీనిఅర్ధం అగ్నిగుండం లొ దూకాలని .అంటే సహగమనం చేయాలని భావం .కాని కాల౦ మారి ఇప్పుడెవరూ అలా చేయటం లేదు . చట్టం ఊరుకోదుకూడా .ఆహితాగ్ని భార్య మరణిస్తే అగ్ని హోత్రం ఆర్పేయటం ,శ్రౌతకార్యాలు నిషేధించటం జరుగుతాయి.
వెంకటేశ్వర గారు తనజాతక రీత్యా ద్వితీయం రాసిపెట్టి ఉందని తెలుసుకొన్నారు .కాని వివాహం చేసుకొంటే రజస్వల కాని పిల్లనే చేసుకోవాలి .తనకు అప్పటికే 61,కొడుక్కి 35ఏళ్ళు కనుక అలా చేసుకోవటం భావ్యం కాదని, విరమించుకున్నారు .ఇంతలో వీరి కొడుకులిద్దరూ వేదం లొ సర్టిఫికేట్ పొంది తిరుపతి దేవస్థానం వారి వేదం పారాయణ కార్యక్రమ౦లొ నియోగి౦ప బడ్డారు . రామ యజ్న శాస్త్రికి చిత్తూరు జిల్లా కాణీపాకం దేవాలయం లొ పారాయణ ఉద్యోగం లొ చేరాడు .ఈ దంపతులకు ఒక కొడుకు .రామ యజ్నేశ్వరుడు,తాతగారు ,గురువు అయిన వెంకటేశ్వర శాస్త్రి గారివద్దనే సింహాచల౦లొ ఉన్నాడు ;2014లొ ఉపనయనం అయింది .చిన్నతమ్ముడు రామకుమార్ ఋగ్వేద పండితుడైవిశాఖ పట్టణం లొ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం లొ పారాయణ ఉద్యోగం చేస్తున్నాడు .ఇవీ శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారి కుటుంబ విషయాలు,విశేషాలు .సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
సవరణ –శ్రీ శశికుమార్ పై వ్యాసం లో కొన్ని సవరణలు 2-11-18న పంపారు వాటిని యధాతధంగా పొందుపరుస్తున్నాను- -గబ్బిట దుర్గాప్రసాద్ 3-11-18-ఉయ్యూరు
పెద్దలు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి నమస్కారములు!!
మీరు ప్రచురించిన కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25
శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారు
వ్యాసాంగంలో చిన్న సవరణలు చేయాలండి. ఈ క్రింది సవరణలు స్వయాన శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారి మేనల్లుడు శ్రీ పవనకుమార శర్మ, బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయ వేదపండితులు గారు నాకు స్వయంగా పంపించారు.
సవరణ 1: – వీరి సంతానం
మొదట ఆడపిల్ల అనంతరం మగపిల్లవాడు పునః ఇద్దరు ఆడపిల్లలు,మరల మగపిల్లవాడు.ఇది పిల్లల వరుస.
సవరణ 2: – వీరి విద్యాభ్యాసం
ఋగ్వేదమూలం, యజుర్వేదక్రమాన్తం,
అథర్వవేదమూలం, సామవేదం యజ్ఞభాగం ఆంధ్రగానంవరకు అధ్యయనం, ఆంగ్లంలో BA డిగ్రీని కూడా పొందనారు.
సవరణ 3: – వీరి పునర్వివాహంలో చేసిన కల్పన (ఊహ)
పునర్వివాహ ఆలోచన విషయం ఊహాజనితమే.
దయచేసి మీ వ్యాసం సరిచేయమని మనవి.
భవదీయుడు
–
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26
—
I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever. |