శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు
జనన విద్యాభ్యాసాలు
తొలి తెలుగు చారిత్రక నవలా రచయిత,కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి ,శ్రీమతి హనుమాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా రేపల్లెలో25-10-1941న బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు జన్మించారు .కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లొ 1958లోఎల్. సి .యి .లో చేరి 1961లొ ఉతీర్ణులై డిప్లోమాపొంది , ఉస్మానియా యూని వర్సిటి నుండి 1968లొ బి యి ను ,అదే యూని వర్సిటి నుండి 1976 లొ ఎం .యి.డిగ్రీలు అందుకొన్నారు .
ఉద్యోగం
హైదరాబాద్ లొ ఇండియన్ ఇన్ ష్టి ట్యూట్యూట్
కెమికల్ టెక్నాలజీ (ఐ .యెన్ .సి .టి.)లొ 1962లొ ఇంగానీర్ గా ఉద్యోగం ప్రారంభించి ,21సంవత్సరాలు మాత్రమే ఉద్యోగించి ,1983లొ స్వచ్చంద పదవీ విరమణ చేశారు .అప్పటినుంచి సివిల్ ఇంజనీరింగ్ నిపుణులుగా కన్సల్టేన్సీ చేస్తున్నారు . చార్టర్డ్ ఇంజినీర్ కూడా అయిన శాస్త్రిగారు ప్రభుత్వ ఆప్రువ్డ్ వాల్యుయర్ .అనుక్షణ పరిశ్రమ వీరి దీక్షకూడా .
వివాహం సంతానం
13-6-1953న శ్రీమతి అన్నపూర్ణ గారిని వివాహమాడి శ్రీ కళ్యాణ్ సుందర్ ,శ్రీ రాజశేఖర్ కుమారులను ,శ్రీమతి లలితా సావిత్రి కుమార్తెను సంతానంగా పొందారు .మనవలు మనవ రాళ్ళతో ఆనందం అనుభ విస్తున్నారు.
శ్రీ విద్యోపాసన –మంత్రోపదేశ, పాదుకాంత దీక్ష
వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన శ్రీ శాస్త్రిగారువంశపారంపర్యంగా వచ్చిన శ్రీ విద్యోపాసన కొనసాగించి 1953లొ శ్రీ శృంగేరీ విరూపాక్ష శ్రీ పీఠాధిపతులు జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మా౦తా చార్యమహాస్వామి వారిచే మంత్రోప దేశం పొంది ,మహా పాదుకాంత దీక్షను శ్రీ శృంగేరీ విరూపాక్ష పీఠాదీశ్వరులు శ్రీ నృసి౦హానంద మహా భారతీ స్వామి వారిచే 1988లో గ్రహించి దీక్షానామం ‘’పూర్ణాన౦ద నాభ ‘’పొందారు .స్నేహపురిలో అందమైన రెండు అంతస్తుల భవనం కట్టుకొని ,పై అంతస్తులో ఉంటూ ,అమ్మవారి పీఠం పెట్టుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో సుమారు 650కి పైగా శ్రీ చక్రార్చన చేసిన మహోపసకులు.శాస్త్రిగారు
సామాజిక సేవ
స్నేహపూరి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులుగా కాలుష్య నివారణ సేవలో అగ్రగామిగా ఉన్నారు. ఆర్ .ఆర్ .లాబ్ లొ సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ,స్నేహపూరి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గా 12ఏళ్ళు పని చేసి కాలనీ అభివృద్ధికి సేవ చేసిన అవిశ్రాంత సేవామూర్తి .
సాహితీ సేవ
. నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు తండ్రి గారి రచనలన్నిటినీ పునర్ముద్రించారు .
సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఆధ్యాత్మిక గ్రంథాలనురచించారు ప్రతి విషయాన్నీ వారు శ్రీ చక్ర దృష్టితో విశ్లేషించి గ్రంథ రచన చేసి ఎవరూ చేయని సాహితీ సేవ చేసి తమ ప్రత్యేకత చాటుకొన్నారు . ఈ లోచూపు అంతా గురువులు శ్రీ కల్యాణానంద భారతీ స్వామి కృపాకటాక్ష౦ శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహమే నని వినయంగా తెలియ జేస్తారు.వీరి గ్రందాల పేర్లు చదివితేనే వీరెంతటి మహోన్నత రచనలు చేశారో అర్ధమవుతుంది .లోపలి వెళ్లి తరచి చూస్తె అలౌకిక ఆనందమే అనుభవైక వేద్యమవుతుంది .
నోరి ట్రస్ట్ కార్యక్రమాలు
ప్రతియేటా వేదసభలను నిర్వహించి వేదపండితులను నగదు పురస్కారాలతో సత్కరిస్తారు .తెలుగు లొ ప్రసిద్ధకవులను గుర్తించి నగదు పురస్కారం తో సన్మానిస్తారు .యువ పద్యకవులను ప్రోత్సహించి సత్కరించి నగదు పురస్కారమిస్తారు .
ప్రచురించిన గ్రంథాలు-
1-ఆన౦దో బ్రహ్మేతి 2-శ్రీ కళ్యాణ హృదయము ౩-ఆత్మ తత్త్వం 4 శ్రీ శంకర హృదయం 5 బీజాక్షర నిఘంటువు 6 –శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము నామాక్షర ఛందో వైశిష్యము 7-శ్రీ భగవద్గీత విభూతి అధ్యాయం లొ శ్రీ విద్యా రహస్యాలు 8-మధు విద్యా దర్శనం 9-షట్చక్ర రహస్యాలు 10-శ్రీ దేవీ ఖడ్గమాలా రహస్యాలు 12-నమక చమకాలలొ శ్రీ విద్యా రహస్యాలు 13-దుర్గా సూక్తం – శ్రీ విద్యా రహస్యాలు 14 – అరుణము –శ్రీ విద్యా రహస్యాలు 15 –అగ్ని ,సూర్య ,సోమ కళలు –బీజాక్షర రహస్యాలు 16-సదాశివానుగ్రహం –నవల17-సుధా –సాంఘిక నవల
శాస్త్రిగారి సంపాదకత్వం లొ 16 పుస్తకాలు ప్రచురించారు .ప్రస్తుతం తండ్రిగారి పుస్తకాలన్నిటినీ ఎమెస్కో వారిచేత పునర్ముద్రణ చేయిస్తున్నారు .
శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆధ్యాత్మిక సేవకు తగిన బిరుదులు
-1-శ్రీ విద్యా రత్నాకర 2-శ్రీ విద్యానంద ౩-శ్రీ చక్రార్చన పరాయణ 4 ఆర్ష విద్యా రత్నాకర మొదలైన సార్ధక బిరుదనామాలు అందుకొన్నారు .
పురస్కారాలు
జగద్గురు శ్రీ కళ్యాణానంద భారతీస్వామి వారి పురస్కారం అందుకొన్న విద్వద్వరేణ్యులు శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .దేశం లోని ఎన్నో ఆధ్యాత్మిక సేవాసంస్థల దృష్టిలో ఇతర పీఠాదిపతుల దృష్టిలో శాస్త్రిగారు పడకపోవటం ఆశ్చర్యమే.
శాస్త్రి గారితో నా పరిచయం
14 -11- 18 బుధవారం శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నాకు హైదరాబాద్ నుండిఉయ్యూరుకు ఫోన్ చేసి తమకు మద్రాస్ లొ ఉన్న శ్రీ నోరి రామకృష్ణయ్యగారు 2011 లొ నేను రాసి ,సరసభారతి ప్రచురించిన ‘’ఆంద్ర వేద శాస్త్ర విద్యాలంకారులు ‘’లోనితిలక్ గీతారహస్యాన్ని తెలుగులోకి అనువదించిన నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వ్యాసం తనకు పంపారని ,అంతకంటే వారి గురించి అదనపు సమాచారం ఉంటె తెలియ జేయమని కోరారు .నేనూ మా అబ్బాయి శర్మా ప్రయత్నించాం ఏమీ దొరకలేదు . తాను నోరి నరసింహ శాస్త్రి గారబ్బాయినని ,హైదరాబాద్ లొ హెచ్ ఎం టి నగర్ దగ్గర ఉంటానని చెప్పారు. అప్పుడునేను సరసభారతి గ్రంథద్వయం రేపల్లెలో 24 -12 -17 న ఆవిష్కరించామని అవేదికకు శ్రీ నోరి నరసింహ శాస్స్త్రి సాహిత్య వేదిక ‘’అని పేర్కొన్నామని చెప్పగా చాలా సంతోషించారు .వీరి గురించి 5-9-18 ఉయ్యూరులో శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం లో సరసభారతి సన్మానించినకవి రాజమౌళి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు చెప్పి తనకూ శాస్త్రిగారు హైదరాబాద్ లొ నోరి చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం అందజేశారని నాకు చెప్పారు .. తర్వాత మేము శుక్రవారం బయల్దేరి హైదరాబాద్ మల్లాపూర్ వస్తానని ఆదివారం వీలయితే వారిని కలుస్తానని చెప్పగా ఆనందంగా తప్పక రమ్మన్నారు
ఈ రోజు ఆదివారం సాయంత్రం ఫోన్ చేసి నేనూ, మా పెద్దబ్బాయి శాస్త్రి వారింటికి వెళ్లాం .మాటల సందర్భం లో తిలక్ ’’ గీతారహస్యం’’ అనువదించిన శాస్త్రిగారు మద్రాస్ నోరి రామకృష్ణయ్యగారు బంధువులా అని అడిగితె, కాదని తాము గుంటూరు జిల్లానోరి వారమని కృష్ణయ్యగారు కృష్ణాజిల్లావారని గీతారహస్య శాస్త్రిగారి గురించి తెలీదని చెప్పారు .సరసభారతి పుస్తకాలు వారికి అందజేయగా ,వారు తమ తండ్రిగారివీ,తమవీ గ్రంథాలు నాకు ఇచ్చారు . అన్నీ అత్యంత విలువైనవే . శాస్త్రిగారి కొన్నిఆధ్యాత్మిక పుస్తకాలు ఉయ్యూరు లైబ్రరీ లోతీసుకొని చదివాను .కానీ ఆయనే ఈయన అని తెలియలేదు. ఈ విషయం వారికీ చెప్పాను .నవ్వారు .సరసభారతి ఉగాది వేడుకలకు రమ్మని ఉగాది పురస్కారం అందుకోమని ఆహ్వానిస్తే తప్పక వస్తానన్నారు .సంభాషణలో శ్రీ అందుకూరి శాస్త్రిగారి ప్రస్తావన వచ్చింది ఆయన తనకు బాగా తెలుసునన్నారు .అందుకూరి వారికి అక్కడి నుంచే ఫోన్ చేస్తే వారి శ్రీమతిగారు అందుకొని కాసేపట్లో వస్తారని చెప్పగా మళ్ళీ చేసి ఆమాట ఈ శాస్త్రిగారికి చెప్పాను .ఇంటికి వచ్చాక అందుకూరి వారే ఫోన్ చేసి శాస్త్రిగారితో తమకు దూర బంధుత్వమూ ఉందని చెప్పగా ఉయ్యూరు ఆహ్వానించానని చెబితే తప్పక అలాంటి వారిని సన్మానించాలన్నారు . అందుకూరి వారు మా ఇద్దర్నీ వారింటికి ఆహ్వానించారు .21 మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నానని ,శుక్రవారం బాచుపల్లి మా రెండో అబ్బాయి శర్మ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయి౦చటానికి వెడతామని, వీలుని బట్టి అక్కడినుండి వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పాను .నోరివారు మంగళవారం సాయంత్రం 6 గంటలకు త్యాగరాజ గాన సభలో ఒక సభ తన అధ్యక్షతన జరుగుతుందని తప్పక రమ్మని చెప్పి 5 గంటలకు వారింటికి వస్తే తామే కారులో తీసుకు వెడతామనగా సరే అన్నాను
ఈ విధంగా అనుకోకుండా ఒక ఆధ్యాత్మిక వేత్తను ,తండ్రిగారి పేరు నిలబెడుతున్నకుమారరత్నం అయిన బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని సందర్శించిన మహద్భాగ్యం నాకు కలిగింది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
—
—