గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
378-అమరవాణి ప్రసారములు –కవి సామ్రాట్ డా.పైడి పాటి సుబ్బరామయ్య శాస్త్రి (1918-2006)
ఆంద్ర రచయితలు రచించిన సంస్కృత గ్రంథాలను ప్రచురించినట్లే ,ఆంద్ర సాహిత్య అకాడెమి వారు విజయవాడ ఆకాశవాణి ప్రసారం చేసిన సంస్కృత ప్రసారములను కవిసామ్రాట్ డా శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారి చేత సంకలింప జేసి ప్రచురించించింది .ఇందులో నాలుగుమాత్రమే సంస్కృతం లోను ,మిగిలినవి తెలుగులో ఉన్నాయి .వీటిలో ఎనిమిది సూరి రామకోటి శాస్త్రి గారి వి ,అయిదు శ్రీ అప్పల్ల సోమేశ్వర శర్మ గారివి ఉన్నాయి . .వీటిని చదివితే ,కావ్యాత్మను గురించిన వివిధ సిద్ధాంతాలలో ప్రధానమైనవి ,వేదాంత విషయాలు స్థూలంగా తెలుసుకోవటానికి వీలవుతుంది .సంస్కృత పండితులలో జగత్ప్రసిద్ధులైన అన్నంభట్టు ,అప్పయ్య దీక్షితుల గూర్చి రామ కోటి శర్మగారి ప్రసంగాలు ,సంస్కృతం లోని సాంఘిక రూపకాలు ,ఉపహాస కావ్యాలను గురించి సోమేశ్వర శర్మగారి ప్రసంగాలు ,నాట్య శాస్త్రం ,ఆంధ్రుల సేవ గూర్చి డా పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చేసిన ప్రసంగాలు అభినంద నీయాలు అని సంకలనకర్త డా పైడిపాటి శాస్త్రిగారన్నారు .ఈ ప్రసంగాలన్నీ సంస్కృతం లో శాస్త్రాలలో ,సాహిత్యాలలో సామాన్యులకు ప్రవేశం కలిగించేవిగా స్పూర్తి దాయకంగా ఉన్నాయి . ఈ పుస్తకం లో ఉన్న 118 పేజీలలోప్రసార భాగాలు ఉంటె , సుబ్బరామ శాస్త్రిగారి సింహావలోకనం 205పేజీలున్నాయి .’’భారతీయ సంస్కృతే రేకత్వం ‘’అనే మొదటి ప్రసంగానికి డా శాస్త్రిగారి పరిచయం 117పేజీలకు దేకింది .మిగిలిన 70పేజీలలో సంస్కృత భాష విశిష్టత ,దాన్ని అనుసందానభాషగా చేయాల్సిన అవసరం ,ప్రస్తుతం దానికి లభిస్తున్న ప్రచారం మొదలైన విషయాలున్నాయి .బిషప్ కాడ్వెల్ చెప్పిన ద్రావిడ భాషా సిద్ధాంతం వలన ఆర్య ,ద్రావిడ జాతి భేదాలేర్పడి ,అవిచ్చిన్న భారత భూమి అంతర్ ద్వేషాలతో విచ్చిన్నమయ్యే ప్రమాద స్థితికి చేరిందని డా పైడిపాటి బాధపడ్డారు .విదేశీపాలనవలన దేశం బలహీనమైనది అనటానికి ఇది ప్రధానకారణం .మానవ జాతికి అంతటికి భారత దేశమే జ్ఞాన స్థానమని ,ప్రపంచ ప్రజలంతా భారత దేశం నుండి వెళ్ళినవారే అని పైడిపాటివారి నమ్మకం .వీటికి తగిన హేతువులను చెప్పలేదాయన .
హైదరాబాద్ ,ఇతర రాష్ట్రీయ రేడియో కేంద్రాలు ప్రసారం చేసిన అమరవాణి కార్యక్రమాలను విచక్షణతో సేకరించి ,సాహిత్య అకాడెమీ ప్రచురించి భారతీయ సంస్కృతికి విశేష సేవ చేయాలని ఈ పుస్తకానికి1971 మార్చి భారతి లో సమీక్ష చేసిన శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు అన్నమాట నిజం కావాలి .
ఇప్పుడు పైడిపాటివారి జీవిత విశేషాలు తెలుసుకొందాం ఆయన కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, సాయిపురం గ్రామంలో 1918లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యుడిగా ఉన్నారు. వీరికి కవిసామ్రాట్ అనే బిరుదు లభించింది. ఆయన స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గరిమెళ్ల సత్యనారాయణ వంటి వారితో కలసి జాతీయ భావాలను తన కవిత్వం ద్వారా పెంపొందించారు.
1. నీలం (కథాసంపుటం)
2. మేనరికం (కథాసంపుటం)
3. అభిషేకము (రామలింగేశ్వర స్తవము)
4. మగదిక్కు (నవల)
5. మహారుద్రము
6. అనిరుద్ధ చరిత్రము
7. నృత్యభారతి (గేయాలు) [3]
8. జాతీయభారతి (గేయాలు)
9. జయభారతి (గేయాలు)
10. మధురభారతి (గేయాలు)
11. విక్రమభారతి
12. దిశమ్
13. తుణీరం
14. మధుర సంక్రాంతి (గేయాలు)
15. బాలభారతి (గేయాలు)
16. వఱద కృష్ణమ్మ (గేయాలు)
17. ఆంధ్ర భారతి (పద్యములు)
18. ఉషాసుందరి (నాటకము)
19. అమరవాణీ ప్రసారములు
20. అంకితం (నాటకము)
21. శతపత్రము[4] (పద్యములు)
22. దివ్వటీలు (పద్యములు)
మరణం
ఇతడు తన 89వ యేట ఆగస్టు 19, 2006న విజయవాడ, మారుతీనగర్‌లో తన స్వగృహంలో మరణించారు
2013 ఏప్రిల్ 11వ తేదీ న డా ఆచార్య ఫణీ౦ద్రకు ‘’పైడిపాటి సుబ్బరామ శాస్త్రి సాహిత్య పురస్కారం ‘’అందజేశారు .
విజయవాడ లో ఇద్దరు కవి సామ్రాట్టులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ,శ్రీ పైడిపాటి సుబ్బరామయ్య గారు సమకాలీనులుగా ఉండటం అరుదైన విషయమే .మన అదృష్టం కూడా .అందుకే పైడిపాటి వారు ‘’శ్రీ విశ్వనాథ కులమణి-నీ వన్నటులీవు నన్నవే,తమ్ముడ నే –వావిరి ‘’పద్మ –శ్రీ ‘’విభవుని జేయ నిన్ను ,జేతము పొంగెన్ ‘’అంటూ అన్న విశ్వనాధ పద్మశ్రీ వైభవాన్ని పొంగి ప్రశంసించారు తమ్ముడు పైడిపాటి .అంటే కాదు ‘’అన్న నీ వొక యుగ కర్త వగుట నిజాము –నీ యుగమున నేను జన్మించుటన్న-ఒక యదృష్ట౦పు ఫలము ‘’అనీ పొంగిపోయారు పైడిపాటి. అంతేనా తమ ‘’శతపత్రం ‘’కావ్యాన్ని విశ్వనాథ కు అంకితమిచ్చి ధన్యు లయ్యారు పైడి పాటి .ఒకరకంగా సుబ్బరామ శాస్త్రిగారు ‘’పైడి పాళి’’అనచ్చు నెమో ?
సశేషం
సంక్రాంతి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-1-19-ఉయ్యూరు