మహా సంస్కృత విద్వాంసుడు లింగ్విస్ట్, రచయిత-పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి
భారతీయ సంస్కృత మహా విద్వాంసుడు మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి ఉత్తర ప్రదేశ్ వారణాసి లో జన్మించాడు .ఆ పరిసరాలలో ఆయనొక్కడే అయిదవ తరగతి పాసైనవాడు అంటే యెంత వెనకబడిన ప్రాంతం వాడో అర్ధమౌతుంది .హైస్కూల్ చదువులో తప్పటం వలన అతని టీచర్ ‘’రతన్ లాల్ శాస్త్రి’’ రోజు కొక భగవద్గీత అధ్యాయం చదవమని ,దానివలన కస్టాలు గట్టే క్కటమేకాకుండా పరమాత్మ కృప కలుగుతుందని సలహా ఇచ్చాడు .భగవద్గీతా పఠనానికి అలవాటు పడిన ఖాన్ ,క్రమగా అందులోని లోతైన విషయాలకు ఆకర్షితుడై , సంపూర్ణంగా అధ్యయనం చేసి అందులోని రహస్యాలను ఆకళింపు చేసుకొని స్నేహితులకు బోధించేవాడు తన జీవిత పరమార్ధం నెరవేరాలంటే సంస్కృతం నేర్చి అందులో ప్రావీణ్యం సంపాదిస్తేనే భగవద్గీత అధ్యయన ఫలప్రాప్తి కలుగుతుందని విశ్వసించాడు .
పట్టుదలతో చదివి సంస్కృతం లో ఎం. ఏ .పాసయ్యాడు ఖాన్ శాస్త్రి .వారణాసి లో సంపూర్ణానంద్ వద్ద పురాణాలు కూలంకషంగా చదివి నిష్ణాతుడై ఆచార్య ,శాస్త్రి పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు .కంపారటివ్ రెలిజియన్ లో డాక్టరేట్ పొందాడు .ఆయన పరిశోధన అంశం ‘’మహా మంత్ర గాయత్రి ఔర్ సురాఫతా కా అర్ధ ప్రయోగ్ ఏవం మహాత్మ్యా కి దృష్టిసే తులనాత్మక్ అధ్యయన్ ‘’దీన్నే ఇంగ్లీష్ లో ‘’Comparative Analyisis of Gayatri Mantra and Surah Fatiyah with reference to meaning and importanace ‘’అంటారు .భారతీయ సంస్కృత సంస్థాన్ లో ఖాన్ శాస్త్రి సంస్కృత ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు ..
ఖాన్ శాస్త్రి రచనలు –మోహన్ గీత ,గీత ఔర్ ఖురాన్ మే సామంజస్య , వేద ఔర్ ఖురాన్ సే మహామంత్ర గాయత్రి ఔర్ సురా ఫతాః,వేదోం మే మానవ అధికార్,మీజోయ్ ,మహామంత్ర గాయత్రి కా బౌద్ధిక్ ఉపయోగ్,శ్రీమద్భగవద్గీతా ఔర్ ఖురాన్ ,విశ్వ బందుత్వకా ప్రత్యచ్చ్ ప్రమాద్ ‘’.
మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రికి 2009లో ‘’నేషనల్ కమ్యూనల్ హార్మని అవార్డ్ ‘’(జాతీయ మతసామరస్య పురస్కారం )అందజేశారు .2019లో భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందించి గౌరవించింది.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-19-ఉయ్యూరు