గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
391-గణకార తరంగిణి కర్త –సుధాకర్ ద్వివేది (1855-1910)
సంస్కృత ,గణిత మహా విద్వాంసుడు సుధాకర్ ద్వివేది ఉత్తరప్రదేశ్ వారణాసి దగ్గర ఖజోరి గ్రామం లో 1855లో జన్మించాడు .బాల్యం లో గణితాన్ని పండిట్ దేవ కృష్ణవద్ద నేర్చాడు .1883 లోవారణాసిలోని ప్రభుత్వ సంస్కృత కళాశాలలో గణిత అధ్యాపకుడుగా చేరి బాపుదేవ శాస్త్రి అనే ఆయన రిటైర్ అయ్యాక ఆస్ట్రాలజీ కూడా బోధించాడు .తర్వాత వారణాసి క్వీన్స్ కాలేజి లో గణిత శాఖ హెడ్ గా చేరి 1905లో రిటైర్ అయ్యేదాకా పని చేశాడు .
సుధాకర్ ద్వివేదీ అనేక గ్రంథాలను అనువదించాడు .చాలావాటికి వ్యాఖ్యానాలు రాశాడు .ఎన్నో గ్రంథాలు రాసి వెలువరించాడు ..అందులో గణిత విభాగం ఆల్జీబ్రా లోని పెల్లియన్ ఈక్వేషన్స్ ,స్క్వేర్స్ ,డయో ఫాన్టైన్ ఈక్వేషన్స్ లపై విస్తృతంగా రచనలు చేశాడు .
సంస్కృతం లో ద్వివేదీ రచనలు -1-చలన్ కలన్ 2-దీర్ఘ వృత్త లక్షణ్(కేరక్టర్ స్టిక్స్ ఆఫ్ ఎల్లిప్స్)3-గోళీయ రేఖా గణిత్ (స్పియర్ లైన్ మాథమాటిక్స్ ) 4-సమీకరణ్ మీమాంసా (అనాలిసిస్ ఆఫ్ ఈక్వేషన్స్ )5-యాజుష జ్యోతిషం,అర్చా జ్యోతిషం 6-గణక తరంగిణి 7-యూక్లిడ్స్ ఎలిమెంట్స్ 6,11,12 భాగాలు 8-లీలావతి 9-బీజగణిత 10-పంచసిద్దా౦తికా ఆఫ్ వరాహమిహిర 11-సూర్య సిద్ధాంత 12-బ్రహ్మ గుప్తాస్ బ్రహ్మ స్ఫుట సిద్ధాంత 13-ఆర్యభట హిజ్ మాయా సిద్ధాంత .
హిందీలో –డిఫరెన్షియల్ కాల్క్యులస్ ,ఇంటెగ్రల్ కాల్క్యులస్ ,థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ ,ఎ హిస్టరీ ఆఫ్ హిందూ మాథమాటిక్స్
అరుదైన ఇంతటి గణిత మేధావి ,రచయిత సుధాకర్ ద్వివేది 55సంవత్సరాలు మాత్రమే జీవించి 1910 లో మరణించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-19-ఉయ్యూరు