గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949)
15-2-1949న రాధా వల్లభ త్రిపాఠీ జన్మించి ,1970 సంస్కృత ఎం.ఏ.లో గోల్డ్ మెడల్ సాధించి ,పి.హె.డి. పొంది,1981లో డి. లిట్ .అయ్యాడు .మధ్య ప్రదేశ్ సాగర్ లోని డా.హరి సింగ్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా చేరి 1983-2014వరకు పని చేసి ,2008-2013లో ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా పని చేసి ,సిమ్లాలోని ఇండియన్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడి ఫెలో అయ్యాడు .త్రిపాఠీ అభిమాన విషయాలు నాట్య శాస్త్రం ,సాహిత్య శాస్త్రం .
38 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యు ఏట్ క్లాసులు బోధించిన ,25ఏళ్ళు పిజి యూనివర్సిటి సంస్కృత డిపార్ట్ మెంట్ హెడ్ గా ,6ఏళ్ళు డీన్ గా ,5ఏళ్ళకు పైగా వైస్ చాన్సలర్ ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా మరొక అయిదేళ్లకు పైన పని చేసిన అనుభవం త్రిపాఠీ ది.38ఏళ్ళు రిసెర్చ్ గైడ్ గా 50మందికి పిహెచ్ డిలు రావటానికి తోడ్పడిన మార్గదర్శి .
నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం 4భాగాలు ప్రచురించిన శేముషీ సంపన్నుడు త్రిపాఠీ.కోల్పోయిన నాట్య శాస్త్ర విషయాలను క్రోడీకరించి మోనోగ్రాఫ్ లు గా ప్రచురించిన ప్రతిభా సంపన్నుడు .సంస్కృత నాటకం ,జానపద నాటకరంగం లపై అనేక ప్రాజెక్ట్ లు నిర్వహించి ప్రచురించిన కళాభిమాని .
త్రిపాఠీ కి ఉన్న అపార అనుభవం వలన ఆయనను ఎన్నో ప్రధాన ప్రసిద్ధ పదవులు వరించాయి .1-డీన్ ఆఫ్ ఫాకల్టి ఆఫ్ ఆర్ట్స్ ,2-మద్యప్రదేశ యూని వర్సిటి రిసెర్చ్ జర్నల్ ఎడిటర్ 3-సాగర్ యూనివర్సిటి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ మెంబర్ 4-సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ సాంస్క్రిట్ కు చైర్మన్ 5-ఇంటర్నల్ క్వాలిటి అస్స్యూరెన్స్ చైర్మన్ ,6-సంస్కృత పాఠ్య పుస్తకాల కమిటీ ముఖ్య సలహాదారు 7-కేంద్ర సాహిత్య అకాడెమీ ఎక్సి క్యూటివ్ మెంబర్ 8-N.C.E.R.T. సంస్కృత కర్రిక్యులం చైర్మన్ ,9-అనేక యూని వర్సిటీల ‘’నాక్ ‘’పీర్ టీం చైర్మన్ .
త్రిపాఠీ విజ్ఞాన సంపన్నతకు తగిన బిరుదులూ ,పురస్కారాలు అందుకొన్నాడు
1-సంస్కృత సాహిత్య అవార్డ్ 2-బెస్ట్ రిసెర్చ్ పేపర్ అవార్డ్ 3-రాజ శేఖర అవార్డ్ 4-నాటక రచనకు సాహిత్య కళా పరిషత్ అవార్డ్ 5-బెస్ట్ రిసెర్చ్ పబ్లికేషన్ అవార్డ్ 6-వ్యాస పురస్కారం 7-వి వి .కాణే స్మారక పురస్కారం 8-భోజ పురస్కారం 9-కంబన్ సమ్మాన్ హిందీ అకాడెమి అవార్డ్ 10-వాగీశ్వరి అవార్డ్ 11-కాళిదాస సమ్మాన్ రెండు సార్లు 12-కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ 13-రామ కృష్ణ సంస్కృత పురస్కారం 14-కేకే బిర్లా శంకర్ అవార్డ్ 15-సంస్కృత మహామహోపాధ్యాయ బిరుదు 16-నాట్యాయన సంస్థ చే భవభూతి అవార్డ్ 17-సంస్కృత గౌరవ సమ్మాన్ 18-జాతీయ వేదం వ్యాస పురస్కారం 19-5వమహా కవి కాళి దాస సంస్కృత జీవన్ వ్రతి అవార్డ్ 20-5వ జయదేవ సరస్వతి అవార్డ్ 21-సంస్కృత శిరోమణి సమ్మాన్ 22-మహా రాష్ట్ర ప్రభుత్వం చేత జీవన్ వ్రతి సంస్కృత సమ్మాన్ 23-పూనా యూని వర్సిటి నుంచి గౌరవ డాక్టరేట్ 24-రాజప్రభ పురస్కార 25-పండితరాజ జగన్నాథ పురస్కార 26-ఆచార్య సుమతీ సాగర్ స్మృతి అవార్డ్ 27-మీరా సమ్మాన్ 28-సమంతర్ సమ్మాన్ 29-అఖిలభారత అంబికా దత్త వ్యాస పురస్కార 30-శ్రీమతి చంద్రావతి జోషి సంస్కృత భాషా పురస్కార్31-నాట్య శాస్త్ర కళానిధి పురస్కారం .
ఈ మహా మహోపాధ్యాయ రచనలపై ఏడుగురు పరిశోధన చేసి గ్రంధాలు వెలువరించి ఆయన కీర్తిని మరింత పెంచారు .
రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా ఉంటూ ఖాళీ పోస్ట్ లను రిక్రూట్ మెంట్ ద్వారాభర్తీ చేశి ,అనేకమందికి ప్రమోషన్లు ఇచ్చి ,సంస్థను ఏ గ్రేడ్ స్థాయి సాధించాడు .ముక్త అధ్యాయ అంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ విధానం ప్రవేశ పెట్టి ,23కాంపస్ లు ,23సంస్కృత మహా విద్యాలయాలు స్థాపించాడు .మూడు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు, పది జాతీయ సమావేశాలు నిర్వహించాడు . అనేక జాతీయ ,అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు సెమినార్ లకు స్పాన్సర్ గా ఉన్నాడు .15 వ అంతర్జాతీయ సమావేశం న్యు ఢిల్లీ లోని విజ్ఞాన భవన్ లో2012లో 6రోజులు జనవరి 6నుంచి 10వరకు జరిపి ,పారిస్ లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ ఏర్పాటు చేయించాడు .
లక్నోలో పాళీ భాషకు రిసెర్చ్ సెంటర్ ,జైపూర్ లో ప్రాకృతభాషకు రిసెర్చ్ సెంటర్ ,సంస్కృత పాళీ ,ప్రాకృత భాషల తులనాత్మక అధ్యయనానికి’’ వాజ్మయి ‘’ సెంటర్ ,హిమాచల్ ప్రదేశ్ బలహార్ లో వుమెన్స్ స్టడీ సెంటర్ ,ముంబై లో సెంటర్ ఫర్ వొకేషనల్ స్టడీస్ ,భోపాల్ లో నాట్య శాస్త్రానికి స్టడీస్ సెంటర్ , శృంగేరిలో ఇండీజినస్ నాలెడ్జి సెంటర్ ఏర్పాటు అయ్యాయాయంటే అదంతా డా రాధా వల్లభ త్రిపాఠీ అకుంఠిత దీక్షా ,శ్రమ ఫలితమే .
ఇంతటి విద్యా వినయ సంపన్నుడు ,నిత్య కృషీవలుడు ,నాట్య, సాహిత్య శేముషీ దురంధరుడు , అయిన డా .రాధా వల్లభ త్రిపాఠీ సాధించిన విజయ పరంపర భారత సంస్కృత క్షేత్రం లో శాశ్వత కీర్తి నార్జించి పెట్టాయి .లాంగ్ లివ్ త్రిపాఠీ.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-19-ఉయ్యూరు
—