గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం )
సంపాదకుడు రచయిత,అనువాదకుడు కే .రామచంద్ర శర్మజనన వివరాలు తెలియదు .ఆయన ముఖ్య రచనలు 1-రామపనివాద వ్యాఖ్యానం తో వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశ 2-పౌస్కరాగమ 3-విరాట పర్వ మణిప్రవాళ మంజరి 4-యాజ్ఞికోపనిషద్వివరణం 5-సర్వజ్ఞోత్తమ రామః 6-అలంకార సంగ్రహః 7-డిస్క్రిప్టివ్ కేటలాగ్ ఆఫ్ తమిల్ మాన్యు స్క్రిప్ట్స్ 8-ది మెసేజ్ ఆఫ్ సెయింట్ తయామన్వార్ .
398-అర్వాచీన సంస్కృతం కర్త –రమాకాంత శుక్లా (1940)
1940లో ఉత్తరప్రదేశ్ ఖుర్జా లో జన్మించిన రమాకాంత శుక్లా తలిదంద్రులు సాహిత్యాచార్య పండిత బ్రహ్మానంద శుక్లా శ్రీమతి ప్రియంవద శుక్లా లనుంచి సంస్కృతం నేర్చాడు .సాహిత్య ఆచార్య ,సాంఖ్యయోగ ఆచార్య డిగ్రీలు పొంది ,ఆగ్రా యూని వర్సిటిలో చేరి హిందీ ఎం.ఏ.గోల్డ్ మెడల్ తో పాసై ,సంపూర్ణానంద యూనివర్సిటి నుంచి సంస్కృత ఎం.ఏ.పొందాడు .జైనా చార్య రవి సేన రచించిన పద్మపురాణం -తులసీ దాసు రాసిన రామచరిత మానసం ల తులనాత్మక పరిశోధన చేసి 1967లో పిహెచ్ డి సాధించాడు .
మోడీ నగర్ లోని ముల్తానిమల్ మోడీ పిజి కాలేజి లో 1962లో హిందీ లెక్చరర్ గా చేరి ,తర్వాత ఢిల్లీ యూనివర్సిటిలోని రాజధాని కాలేజి లో హిందీ ఫాకల్టి మెంబరయ్యాడు .1986లో రీడర్ అయి ,2006లో రిటైరయ్యాడు .ప్రపంచ సంస్కృత సమ్మేళనం తో సహా చాలా సెమినార్ లకు కాన్ఫరెన్స్ లకు హాజరయ్యాడు .’’ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ ఈస్తెటిక్స్ అండ్ పోయెట్రి ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’కు అధ్యక్షత వహించాడు .’’అర్వాచీన సంస్కృతం ‘’అనే త్రైమాస పత్రిఅకు ముఖ్య స౦పాదకుడు గా ఉన్నాడు.ఈ పత్రిక ఆయనే ఢిల్లీ లో స్థాపించిన ‘’దేవవాణి’’పరిషత్ ఆధ్వర్యం లో వెలువడేది .రేడియోలో సర్వభాషా కవిసమ్మేళన లో సంస్కృత కవిగా పాల్గొన్నాడు .
దూర దర్శన్ ప్రసారం చేసిన ‘’భాటీ మే భారతం ‘’అనే సంస్కృత సీరియల్ రాశాడు శుక్లా ఆయన జీవితం సంస్కృత సేవ పై ‘’దేవవాణి సుయశః ‘’అనే ప్రత్యేకక సంచిక వెలువడింది . అర్వాచీన సంస్కృతం ,సారస్వత సంగమ౦,భారత జ్ఞానతాహం అనే రచనలు చేశాడు .ప్రస్తుతం ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ‘’లో ‘’శాస్త్ర చూడామణి విద్వాన్ ‘’గా సేవలందిస్తున్నాడు .
శుక్లా సంస్కృత ,హిందీ భాషా పాండిత్యం కు తగిన సంస్కృత రాష్ట్ర (జాతీయ )కవి ,కవి రత్న ,కవి శిరోమణి ,హిందీ –సంస్కృత సేతు బిరుదులు పొందాడు .కాళిదాస సమ్మాన్ ,సంస్కృత సాహిత్య సేవా సమ్మాన్ అందుకొన్నాడు .ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారం అందజేసింది .ఢిల్లీ సంస్కృత అకాడెమి ‘’అఖిల భారతీయ మౌలిక సంస్కృత రచనా పురస్కారం ‘’అందించి గౌరవించి సత్కరించింది .2009లో భారత రాష్ట్ర పతి’’సంస్కృత విద్వాంస ‘’పురస్కారం ఇచ్చారు .2013 భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారమిచ్చి గౌరవించింది .’’ భారతీయ ప్రకార సంఘం ‘’కు శుక్లా వ్యవస్థాపక అధ్యక్షుడు .2018లో శుక్లా రచించిన ‘’మమ జనని ‘’పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ లభించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు