ఐస్ లాండ్ దేశం ధృవ ప్రాంత దేశం యూరప్ లో ఉంటుంది .నిత్యం మంచు కరిగి ,ఇవాళ ఉన్న ప్రదేశం రేపు కనిపించదు .అంటే నిత్య అభద్రతా పరిస్థితి అన్నమాట .క్రీ.శ.874లో నార్వీజియన్ చీఫ్ ఇంగోల్ అమర్సన్ లో మొదటి పర్మనెంట్ సెట్లర్ .తర్వాత నార్వీజియన్ లు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొన్నారు .తమతో త్రాల్స్ అనే బానిసలనూ తెచ్చుకొన్నారు .నార్వేజియన్ లది గాలిక్ మూలం .13వ శతాబ్దం లోఇండిపెండెంట్ కామన్ వెల్త్ నార్వీజియన్ ప్రభుత్వమేర్పడింది 1397లో నార్వే స్వీడెన్ డెన్మార్క్ ఐస్ లాండ్ లు కలిసి సంయుక్త ప్రభుత్వ మేర్పడింది .ఫ్రెంచ్ విప్లవం నెపోలియన్ యుద్ధాలలో ఐస్లాండ్ బాగా దెబ్బతిని ,1918లో స్వాతంత్ర్యం ప్రకటించుకొని 1944లో రిపబ్లిక్ అయింది .20వ శతాబ్దం వరకు చేపలు ,వ్యవసాయం వీరికి ముఖ్య వృత్తి.రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచం లోనే అత్యంత సంపన్న దేశంగా ఎదిగి యూరోపియన్ ఎకనామిక్ ఏరియా లో భాగమైంది .వీరిది స్కాండినేవియన్ సంస్కృతి.
అయితే ఈ దేశ ప్రజలున్నంత ఆనందంగా ప్రపంచం లో ఏ దేశం వారూ ఉండరని అనేక సర్వేలు తెలియజేశాయి .దీనికి కారణం ‘’Language is an immense source of joy ‘’అని ఆదేశ౦వారి నమ్మకం .’’The part of the brain that controls language is ,like the part that controls happiness ,relatively new in evolutionary terms ‘’అని అమెరికాలోని విస్కాన్సిన్ యూని వర్సిటి వాళ్ళు పరిశోధించి చెప్పారు ..వారానికి కనీసం 50గంటలు పని చేసే కస్టజీవులే వారంతా .ఉష్ణోగ్రత సాధారణం గా -10డిగ్రీలసేంటి గ్రేడ్ ఉంటుంది .సున్నా డిగ్రీలకే నీరు గడ్డ కడుతుందని మనకు తెలుసు .ఇక్కడి వర్షం కూడా బలే సరదాగా సమాంతరం గా( హారిజాంటల్ )గా పడుతుంది .
ఐస్ లాండ్ దేశం లో కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండటం మరో ప్రత్యేకత .ఈ దేశభాష ‘’వైకింగ్ భాష ‘’.వైకింగులుఒకప్పుడు గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి పాలించి యూరప్ దేశాలను గజగజ వణికించిన సముద్ర జీవులైన గొప్ప పోరాట యోధులు .వైకింగ్ సామ్రాజ్య పతనం తర్వాత ఈ దేశం బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళింది .వీరికి తమభాష అంటే మహా ప్రాణం .దేశం కంటే భాషకే అధిక ప్రాధాన్యమిస్తారు . ఈ దేశం లో ఒక సామెత ఉంది .’’Better to go barefoot than without a book ‘’ అంతటి పుస్తక ప్రియులన్నమాట .ఇంగ్లీష్ కు చాలాతక్కువ ప్రాధాన్యమిస్తారు .
మామూలుగా వాడుకొనే వస్తువుల కు ఇంగ్లిష్ పేర్లు వాడనే వాడరు .తమమాతృ భాషలోనే ఆ పేరును సృష్టించుకొని వాడుకొంటారు .ఉదాహరణకు సినిమా ,హెలికాప్టర్ టెలివిజన్ ,కంప్యూటర్ ఫోన్ లకు ఇంగ్లీష్ మాటలు వాడరు .అవి చేసే పనిని బట్టి తమభాషలో పేరు పెట్టుకొంటారు .ఇందువలన మాతృభాషా పరి రక్షణలో వీరు ప్రపంచానికే ఆదర్శ ప్రాయులయ్యారు .కంప్యూటర్ ను వీరు’’ VOLVA ‘’అంటారు వారి వైకింగ్ భాషలో .అంటే అర్ధం Prophet of numbers ‘’అనగా సంఖ్యా దర్శిని .టెలిఫోన్ ను వైర్ అంటే దారం అనే అర్ధం వచ్చేట్లు ‘’SIMI ‘’అంటారు .
వీరి మరో ప్రత్యేకత పుస్తక ప్రచురణ .ప్రపంచం లోనే సంవత్సరానికి ఎక్కువ పుస్తకాలు ప్రచురించే దేశం ఐస్ లాండ్.కుటుంబం లో ఆడవాళ్లే మార్గదర్శకులుగా ఉంటారు .ఇందులోనూ ప్రపంచం లో ఆ దేశం ప్రత్యేకత పొంది ఆదర్శవంతమైంది. అక్కడి కవులదీ ప్రత్యేకతే –‘Land Nation .Language is the only Trinity ‘’అని అక్కడికవుల నమ్మకం .అందరూ తమ భాషను ప్రాణప్రదంగా,పవిత్రంగా కాపాడుకొంటారు .భాష పలచన పడటానికి అంగీకరించరు .తమ భాషా పదాల సృష్టి కోసం ,అర్ధవంతమైన మాటలకోసం అకాడెమిక్ కమిటీ లను ఏర్పాటు చేసుకొంటారు .దీనివలన సరైన ఐస్లాండిక్ పదాలు భాషలోకి వచ్చి చేరుతాయి .తమభాష అంటే అంతటి తపన వారికి ఉంది .
ఐస్ లాండ్ లో భాష ఒక మాధ్యమం (మీడియా )మాత్రమే కాదు ,భావ నినిమయం –The essence of Culture ‘’అంటే సాంస్కృతిక సారం కూడా .ప్రజలకు ఒక గొప్ప అభి ప్రాయం ఉంటుంది –‘’Icelandic Language is more noble ,than that of any other language ‘’అని వారి ప్రగాఢ విశ్వాసం .ఈ దేశంలో నోబెల్ పురస్కారం పొందిన కవి ‘’Holdar King Zan Laxness ‘’ఉన్నాడు.
21-2-2011 న మాతృభాషా దినోత్సవం నాడు ప్రనగం కోసం రాసుకొన్న వ్యాసం మళ్ళీ మీకోసం –
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-19-ఉయ్యూరు
‘’–