యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -12
‘’ఆధ్యాత్మ ,అధిభూత అది దైవతాల గురించి చెప్పండి ‘’అడిగాడు జనకుడు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’పాదాలు అధ్యాత్మ,గమనం అది భూతం విష్ణువు అది దైవతం .పాయువు ఆధ్యాత్మ మల విసర్జన అధిభూతం సూర్యుడు అది దైవతం .ఉపస్థ అధ్యాత్మం ,దాని ఆనందం అధిభూతం ,ప్రజాపతి అధి దైవం .చేతులు అధ్యాత్మ అవి చేసే పనులు అధిభూతం ,ఇంద్రుడు అధిదైవం .వాక్కు ఆధ్యాత్మ .మాట్లాడటం అదిభూతం అగ్ని అధి దైవం .కన్ను అధ్యాత్మ రూపం అదిభూతం సూర్యుడు అధి దైవం .చెవి అధ్యాత్మం ,శబ్దం అధిభూతం దిక్కులు అధిదిదైవాలు .జిహ్వ అధ్యాత్మ రసం అధిభూతం జాలం అది దైవతం .ఘ్రాణం అధ్యాత్మ గంధం అది భూతం ,పృథ్వి అధిదైవతం .చర్మం అధ్యాత్మ స్పర్శ అదిభూతం ,వాయువు అది దైవం మనస్సు అధ్యాత్మ ,మంతవ్య౦ అది భూతం చంద్రుడు అదధి దైవం .ఆహ౦ కారం అధ్యాత్మ అభిమానం అదిభూతం ,బుద్ధి అధిదైవం .బుద్ధి అధ్యాత్మ బోద్ధవ్యం అధిభూతం క్షేత్రజ్ఞుడు అధి దైవం .రాజా !భగవానుడిని ఆది మధ్యాన్తాలలో చూపిస్తూ విభూతులన్నిటినీ యధాక్రమ౦గా చెప్పాను .
‘’ప్రకృతి తనంత తాను కోరికతో అనేక వేల గుణ వికారాలు కలిగిస్తుంది.అది దాని సహజ లక్షణం .ప్రకృతి పురుషుని యొక్క సత్వ రజస్ తమో గుణాలకు అనేక వికృతులు కలిగిస్తుంది .సత్వం ఆనందం ఉద్రేకం ,ప్రీతి ఆరోగ్యం సంతోషం శ్రద్ధ క్షమా కార్పణ్యం సమత్వం,నిర్దయ ,దానహీనబుద్ధి హింస వైరం ,ధర్మ ద్వేషం మొదలైనవన్నీ కలిగించి మనిషిని చికాకు కలిగిస్తుంది ‘’అని చెప్పాడు .
జనకుడు సాత్వికాది గుణాలో తేడాల విషయం స్పస్టపరచమని అడిగాడు .మహర్షి ‘’ సత్వ రజస్తమోగుణాలు ప్రకృతి గుణాలు .అవి విడిచిపెట్టకుండా లోకం లో ఉంటూనే ఉంటాయి .అవ్యక్త రూప భగవానుడు ఈ గుణాలవలననే కోటానుకోట్ల జీవ రాశులలో ఉంటున్నాడు .వీటిలో సాత్వికం ఉత్తమ౦ రాజసం మధ్యమం, తామసం అధమం .మనిషికి పుణ్యం చేత ఊర్ధ్వగతి, పాపం చేత అధోగతి కలుగుతాయి .రజస్సు సత్వం తో ,తమస్సు రజస్సుతో సత్వం తమస్సు తో కలిస్తే ,లేక మూడూ సమానంగా కలిస్తే కానీ అవ్యక్తమైన ప్రకృతికూడా కలుస్తుంది .అవ్యక్త పురుషుడు సత్వం తో ఉంటె దేవలోకం లోనూ ,రజస్సు తమస్సు కలిగి ఉంటె మనుష్యలోకం లోనూ ,రజస్సు తమస్సులతో కలిస్తే పశు పక్ష్యాదులలోను పుడతాడు .మూడిటిలోనూ కలిసి ఉంటె మనుష్యత్వం కలుగుతుంది .పుణ్య పాపాలు లేని మహాత్ములు శాశ్వత అవ్యక్త అక్షయ స్థానం పొందుతారు .జ్ఞానులు ఉత్కృష్ట జన్మ పొందుతారు .అపుడు అచ్యుత అతీంద్రియ అజ్ఞానరహిత ,జన్మ మృత్యు తమోరహితం గా ఉంటారు ..’’అని వివరించాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-2-19-ఉయ్యూరు
.