యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -14
యాజ్ఞవల్క్యుడు ‘’జనకరాజా !ముండ్ల దుబ్బు ,ముండ్ల గడ్డి వేరు వేరు అయినట్లే ,పురుషుడు ,ప్రకృతి వేరు వేరు .వీరి పరస్పర సంయోగం వలన వేరు అనిపిస్తారు .మేడిపండుపై ఉన్న దోమ ఆపండు లో భాగం కాదు .నీటిలోని చేప నీటికంటే వేరు .కుంపటి అందులోని అగ్ని వేరువేరు అని సాంఖ్యులలభావన .ప్రకృతి,పురుషుడు భిన్నంకాదు .యోగులు ఎలా దీన్ని భావిస్తారని రాజు అడగగా మహర్షి ‘’సాంఖ్యానికి యోగానికున్న బలం లేదు .కానీ రెండూ ముక్తికి మార్గాలే .ఈ రెండు భిన్నం కాదు ఒక్కటేఅని నేనుభావిస్తాను .యోగులు దేన్ని దర్శిస్తారో సాంఖ్యులు కూడా దాన్నే దర్శిస్తారు .ఈ రెండిటిని ఒక్కటిగా చూసేవాడే నిజమైన తత్వ వేత్త .యోగం లో ప్రాణవాయువుకేకాక ఇంద్రియాలు ప్రధాన్యముంది .ఈ రెండిటిని అణగించుకొనియోగులుఅంతటా స్వేచ్చగా సంచారం చేస్తారు .స్థూల దేహాన్ని నశి౦ప జేసు కొని అణిమాది సిద్దులతో సూక్ష్మ దేహం పొంది ,ఆ దేహం లోనే అన్ని సుఖాలుపొండుతూ అన్నిటా సంచరిస్తారు .యోగం లో ఎనిమిది గుణాలున్నాయి ,ఎనిమిది అ౦గాలున్నాయి .
‘’ఉత్తమ యోగుల తీరు సగుణ ,నిర్గుణ అని రెండురకాలు .మనసుని పదహారింటి లో ధారణ చేయాటమే మొదటిదైన సగుణయోగం .రెండవదైన నిర్గుణం లో ప్రాణాయామాన్నీ చిత్తాన్నీ ధ్యాత ధ్యేయం భేదం నశి౦చేట్లు ఏకాగ్రత్వం పొంది ఇంద్రియ నిగ్రహత్వం తో ఉండటం .మొదట సగుణాన్నీ తర్వాత నిర్గుణాన్నీ అభ్యాసం చేయాలి .రాత్రి మొదటి యామం లో 12 ప్రాణాయామాలు ,నిద్రించాక చివరియాములో 12ప్రాణాయామాలు ఉన్నట్లు చెప్పారు .దాంతుడు, శాంతుడు ఈ 24విధాల ప్రాణాయామాలను నిరోధిస్తాడు .అప్పుడుపరమాత్మలో ఆత్మను విలీనం చేయగ లుగుతాడు .ఇంకా చాలా వివరాలున్నాయి మళ్ళీ చెబుతా ‘’అన్నాడు యాజ్ఞవల్క్యుడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-19-ఉయ్యూరు