యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -15
చనిపోయినవాడు పొందే స్థానాల గూర్చి వివరించమని యాజ్ఞవల్క్యమహర్షినిజనకమహారాజు అడిగాడు .ఆయన ‘’ఆత్మ-పాదాలనుంచి నిష్క్రమిస్తే విష్ణువు యొక్కయు ,పిక్కలనుండి పొతే వసువుల యొక్క,మొకాలినుంచి అయితే మహా సాధ్యులయొక్క,గుదం నుండి అయితే మిత్రునియొక్క,జఘనం నుంచి అయితే భూమి యొక్క ,పార్శ్వాలనుండి అయితే మరుత్తులయొక్క,నాశిక నుండి అయితే చంద్రుని యొక్క,వక్షం నుంచి అయితే రుద్రుని యొక్క ,మెడనుంచి అయితే రుషి శ్రేష్టుడైన నరుని యొక్క ,ముఖం నుంచి అయితే విశ్వే దేవతలయొక్క ,చెవులనుంచి అయితే దిక్కులయొక్క ,ముక్కునుంచి అయితే వాయువు యొక్క ,కళ్ళనుంచి అయితే సూర్యుని యొక్క ,కనుబొమలనుండి అయితే అశ్వినీ దేవతల యొక్క ,లలాటం నుంచి అయితే పితృ దేవతల యొక్క,మూర్ధం నుండి అయితే బ్రహ్మయొక్క స్థానాలను పొందుతారు ‘’అన్నాడు .
‘’మనీషులు విధించిన అరిస్టాలేవి?’’వివరించండి ‘’అని రాజు ప్రశ్నిస్తే మహర్షి ‘’కనిపించే అరుంధతి నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రాన్ని చూడలేకపోతే ,దీపకాంతులు కుడిప్రక్కకు చీలినట్లు కనిపిస్తే మనిషి ఆయుర్దాయం ఒక సంవత్సరం మాత్రమె .తన ప్రతిబింబాన్ని ఇతరుల కళ్ళల్లో చూడలేకపోయినా ఏడాది లోపు బాల్చీ తన్నేస్తాడు .తనలోని కాంతిని, అతి ప్రజ్ఞను ,తనస్వభావం లోపలాబయటా మారితే, అరునెలలే బతుకుతాడు .దేవతలను పూజించక బ్రాహ్మణులతో వైరం పెట్టుకొంటే ,నల్లని రంగు తెల్లబడితే బతుకుఇక ఆరునెలలే .చంద్ర బి౦బ౦ లోకాని, సూర్య బింబం లోకాని సాలెపురుగు అల్లికలో లాగా రంద్రాలున్నట్లు కనిపిస్తే వారంకంటే బతకడు .దేవాలయం లో సుగంధం శవగంధంగా అనిపిస్తే వారంలో ఖాళీ .చెవులు ముక్కు వాలిపోయి ,పండ్లు చూపులు వసివాడితే ,సంఖ్యజ్ఞానం మర్చిపోతే ,లోపలి వేడి చల్లారిపోతే వెంటనే చావు ఖాయం .అకస్మాత్తుగా ఎడమకంటి నుంచి నీరు ధారగా కారటం ,తలనుండి పొగవచ్చినవాడు ఆరోజే టపాకడతాడు. కనుక పగలు రాత్రి తన ఆత్మను పరమాత్మలో అనుసంధానం చేసుకోవాలి .అప్పుడే మృత్యుంజయుడు అవుతాడు .ఆత్మజ్ఞానమున్నవాడు సాంఖ్యుల పధ్ధతి ప్రకారం ఆత్మను పరమాత్మతో యోచన చేసి చావును జయిస్తాడు .చివరికి అక్షయ అవ్యయ శాశ్వత స్థానం పొందుతాడు ‘’అని వివరించాడు ‘ జనకుడు అవ్యక్త పరబ్రహ్మ గురించి వివరించమని కోరగా యాజ్ఞవల్క్యుడు –‘’నేను సూర్యుని ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని పొంది శిష్యులకు బోధించి,బ్రహ్మ ను గూర్చి చి౦తిస్తుంటే విశ్వావశువు వచ్చి ప్రశ్నించగా ,ఆయనకు చెప్పినదంతా నీకు బోధిస్తాను అని చెప్పిబోధించి ద్విజాదులవలననే మోక్షసాధన జ్ఞానం పొందవచ్చు ‘’అన్నాడు .
ఒక రోజు జనకుడు గౌతమ రాహూ గణుడు ‘’వేదాంగాలు బాగా తెలిసి ఎవరు ఇష్టి చేసి దాని ఫలితం పొందారో తెలుసుకొని .వాళ్లకు వెయ్యి బంగారునాణాలు ఇస్తాను ‘’అని అంతటి విశిష్ట వ్యక్తీ యాజ్ఞావల్క్యుడే అని గ్రహించి తాను అన్నధనాన్ని ఆ మహర్షికిచ్చి సంతృప్తి చెందాడు .ఆయనతో ఆయన బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ఋషులవలన విని కొంత తాను ఆయనతో చర్చి౦చి కొంతా తెలుసుకొన్నానని, కర్మ బ్రహ్మలను గురించి పూర్తిగా తెలిసినవాడు ఆయనే అని .లోకోద్ధరణకు ఉద్భవించిన అవతార పురుషునిగా తాను ఆయనను భావిస్తానని వినయంగా చెప్పి తనను శిష్యునిగా స్వీకరింఛి మోక్షమార్గం ప్రసాదించమని యాజ్ఞవల్యుని ప్రార్ధించాడు .దీనికి ఆయనేమన్నాడో ,ఆతర్వాత ఏమి జరిగిందో తర్వాత తెలుసుకొందాం .
సశేషం
రేపు 4-3-19 సోమవారం మాఘబహుళ చతుర్దశి ’’ మహా శివరాత్రి ‘’శుభాకాంక్షలు
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-19-ఉయ్యూరు
.