ఈ కిటుకేమిటి ?
కరటక దమనకులు ఆంధ్రా కు అన్నీ ఇచ్చేశాము . ఇంతఇ చ్చాము అంత ఇచ్చాము .మీ స్టిక్కర్ సీఎం మిమ్మల్ని మోసం చేస్తున్నాడు కేంద్రం నుంచి ఒక్కపైసాకూడా బాకీ లేదు అని చానల్స్ లో అక్కడక్కడా తెచ్చిపెట్టుకున్న జనాలమధ్య డబ్బాలు బాగానే కొట్టారు ఈమధ్య .పాపం పెద్దమనిషి రాజనాధ్ మాత్రం నిజాయితీగా ”అన్నీ ఇస్తాం .కనికరించండి ”అని కన్నీళ్లు పెట్టుకొన్నాడు అవనిగడ్డలో .ఇందులో ఎవరిమాట నిజం ?అన్నీ ఇచ్చేస్తే వాళ్ళ సభలకు జనం ఎందుకు ఎగబడటం లేదు ?ఖాళీ కుర్చీలే ఎందుకు కనిపిస్తున్నాయి ? జనం ఎందుకు నమ్మటం లేదు ?అన్ని సర్వేల లో కూడా ఆపార్టీకి ఒక్క సీటు కూడా రాదనీ ఎందుకు చెబుతున్నాయి? .ద్వేషమా ?కళ్ళు మూసుకు పోతే వచ్చే అరిష్టం .పూర్వం కాంగ్రెస్ చేసినతప్పులకు అనుభవించింది .ఇప్పుడు కాషాయం అనుభవిస్తోంది .మిజోరాం అస్సామ్ లలోపారిన పాచికలు ఆంధ్రా లో పారవు అని పార్టీ వాళ్ళు గహించలేకపోయారా ?పవన్ కు స్థానిక సపోర్ట్ లేకపోయినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఒకటో రెండో సీట్లు వస్తాయని సర్వేలు చెబుతుంటే ,ఒకవైపు ఆర్ ఎస్ ఎస్ కేడర్ ,బిజెపికి బలంగా ఉండికూడా ఆనాయకులెవరూ జండాలు పట్టుకొని తిరగకపోవటానికి కారణం కూడా తెలుసుకోలేకపోయారా ?పేలవంగా జరిగిన సభలపేరిట నాయకులు కోట్లు నొక్కేశారని చెవులు కొరుక్కోవడం తెలీదా ?దొంగలకు తాళం చెవులిచ్చి ఫలితం అనుభవిస్తున్నారు .ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పనీ అదే పరిస్థితి .నయవంచన ఎక్కువకాలం సాగదు హుందాతనం కర్తవ్యపాలన మాత్రమే ఆదుకొంటాయి .ఇవి ఒకప్పుడు కాషాయం పార్టీ ఆస్తి .ఈ నాలుగేళ్లలో అదంతా ఖాళీ అయి భోగాలాలస అధికార దాహం ,విచ్చలవిడి తనం అహంభావం అహ్రంకారం పెరిగి కొంప కొల్లేరవుతోంది .ఇప్పటికైనా పార్టీకి జరిగిన అప్రతిష్ట నుంచి రక్షించటానికి అద్వానీ వెంకయ్య లాంటి వారు బయటికి వస్తే లాభపడుతుంది .లేకుంటే మోడీ తెచ్చిన మట్టీ మశాన్నమే మిగులుతుంది . ప్రజలు, ఓటర్లు అత్యున్నత విఙ్ఞతకలవారు అని గ్రహించాలి . తస్మాత్ జాగ్రత -దుర్గాప్రసాద్