నాటి దుర్యోధనుడి చివరి మజిలి ‘’ మడుగు ‘’నేటి జగన్ ‘’లోటస్ పాండ్ ?’’
మహాభారతం లో ఎన్నెన్ని దుష్కార్యాలు కుయుక్తులు ,దస్టపన్నాగాలు పన్నినా చివరికి తనవంశం వారందర్నీ చంపుకొని ధర్మ క్షేత్రమైన కురు క్షేత్ర యుద్ధం లో నిలువనీడలేక భీముడికి భయపడి ‘’మడుగు ‘’లోని నీటిలో ప్రాణభీతితో బిక్కు బిక్కు మంటూ చేసినపాపాలకు పరిహారం అనుభవించే దశలో జీవించాడు దుర్యోధనుడు అని మనకు తెలుసు .ఇవాళ ఆంద్ర దేశం పై అలాంటి దుర్మార్గ దుస్ట కుహనా రాచకీయం తో అసూయ ,అహంకారం కళ్లుగప్పి పగలంతా కాసేపు ఎన్నికల ప్రచారం రాత్రికి హైదరాబాద్ వెళ్లి ‘’లోటస్ పాండ్ ‘’లో హాయిగాసేద దీరుతున్న ఫాన్ ఆయన ను చూస్తే,చరిత్ర పునరావృత్త మౌతోందా అని పిస్తోంది .నాడు దుస్ట చతుస్టయం అయిన కర్ణ శకుని మొదలైనవారు దుర్యోధనుడి అంతానికి కారకులైతే ఇవాళ ,సాయి ,గద్దముక్కాయన ,వాచాలబాబు , కనుసన్నల్లో మెలిగే కమీషన్ ‘’పైనున్న’’ కరటక దమనకులు మొదలైనవారు ఆయన రాజకీయ అంతానికి దోహదం చేస్తున్నట్లు కనిపిస్తోంది .
మడుగులో దాక్కున్న రాజు దుస్ట పన్నాగాలకు ఫుల్ స్టాప్ పెట్టలేదు .అశ్వత్ధామ ను ప్రేరేపించి దారుణం జరిపించాడు .తగిన ప్రాయశ్చిత్తం పొంది శిరోమణి ని అర్జునుడు కత్తితో కోసేస్తే గబ్బు కంపుతో వాసనా భరిస్తూ అందరికీ దూరమై’’ పాపీ చిరాయువు’’ గా జీవించాడని మనకు తెలుసు .ఇక మిగిలిన ఒకే ఒక్కడు దుర్యోధనుడు భీముడికి భయపడి’’ మడుగు’’లో కంపు నీటివాసన భరిస్తూ అందులో ఉండిపోయాడు .విషయం తెలిసిన ధర్మరాజు భీముడు మొదలైనవారు ‘’ఆపాండ్ ‘’అంటే మడుగు దగ్గరకు వెళ్లి ,సూటీ పోటీ మాటలతో రెచ్చగొట్టి పౌరుషం రగిలిస్తే ఇక భయం వదిలి భీముడితో గదాయుద్ధానికి భూమిపైకి రావటం ,రెండు తొడలు విరగ గొట్టించుకొని చేసిన పాపాలను సమీక్షించుకొంటూ ,తనవల్లనే కురువంశం సర్వం నాశనమైందని ఒక్కడూ వారసుడుగా మిగలలేదని గ్రహించి పరితపించి పరితపించి ,తన చేష్టలకు కారకులైనవారు తనను ఎంత లోతు పాపం లో ముంచారో తెలుసుకొని ‘’యతో ధర్మః తతో జయః ‘’అని గ్రహించాడని భారతం చెప్పింది .ఇవాళ లోటస్ పాండ్ ఆయనపరిస్థితీ ఇంతేనా అని పిస్తోంది .శాంతం పాపం .’’కర్ణు డీల్గే ఏవురిచే ‘’అని భారతం చెప్పిన విషయం పునరా వృత్త మౌతోందా?అంటే ఔననే చెప్పాల్సి వస్తోంది .
తన ‘’అన్న’’వద్దన్నా పార్టీ పెట్టి 23సీట్లన్నా సాధించి తర్వాత చుట్టేసి హస్తినలో హస్తం లో ఇమిడిపోయిన సంగతి తెలిసికూడా ,గడ్డం పెంచి భారీ డైలా—గు లతో పొడిచేస్తా, చి౦చేస్తా అంటూ ఎన్నికల అగ్నిగుండం లో దూకి ఒకటో రెండో సీట్లు మాత్రమె పొందబోతూ తాను మునగటం కాకుండా ,పాపం ‘’జెడి’’ ని కూడా మురికిలోకి దింపి ,ఇప్పుడు ఉసూరుమంటున్నాడు తెచ్చిపెట్టుకొన్న జనం తో ఆనాయకుడు .కరటక దమనక ,జేవిఎల్ ,కన్నా ,రాం మాధవ్ వంటి శల్యుల సారధ్యం లో దిగిన కమలం కిందా ,పైనా రేకులన్నీ ఊడిపోయి భీభత్సంగా శల్యావశిస్ట మై కొన ఊపిరులతో ఉందిపాపం .చేసుకొన్నవారికి చేసుకోన్నంత కదా . నీతికీ నిజాయితీకి ఆర్ ఎస్ ఎస్ ,జనస౦ఘ్ బిజెపి లు చిరునామాగా ఉండేవి .ఇవాళ కుహనా రాచకీయం నరనరానా వ్యాపించి కలుషితమై వాళ్ళు అంటేనే పేరు చెబితేనే కంపరం అసహ్యం ఏర్పడుతోంది .’’ఆబ్సల్యూట్ పవర్ కరప్త్స్ అబ్సల్యూట్లీ’’అని నిరూపించారు ఈకుహనా హిందూ వాదులు .పాపం పరిపూర్నస్వామినీ ముంచేశారు పీకల్లోతు బురదలో . హస్తం అయిదేళ్ళ కితం ఎన్నికలలోనే చేతి, కాలి వేళ్ళు అన్నీ ఊడగోట్టుకొని విలవిలలాడింది .ఈ ఎలెక్షన్ లోనూ బోణీ అంటూ ఉండనే ఉండదని సర్వేలన్నీ చెప్పేశాయి .అంటే ఆంధ్రాజనం కాంగ్రెస్ చేసిన అన్యాయాలను ఇంకామరచి పోలేదన్నమాట .మళ్ళీ శృంగ భంగం ఖాయమే నన్నమాట . ఫాను కాండి డేట్లు ఇప్పటికే చాలాఖర్చుచేసి ని౦డా మునిగిపోయి మధ్యదళారీలుకోట్లు నొక్కేస్తే కిక్కురుమనకుండా ,లోటస్ పాండ్ నుంచి ‘’తామర రేకులు ‘’కూడా రాలవు అని గ్రహించి ,ఇక ఖర్చుపెట్టే సత్తాలేక చేతులెత్తేసి సైకిల్ కే ఓటేసుకోమని,అదే మంచిపార్టీ అనీ భూమన ,వంగవీటి గీత మొదలైన 11మంది చెబుతున్నారని వీటిలో సైకిల్కు ఏకపక్షమే అవుతుందని నిన్న కాటా సుబ్బారావు ‘’కుండ బద్దలు ‘’కొట్టేశాడు .ఇందులో నిజమెంతో తర్వాత తెలుస్తుంది .
నీతీ నిజాయితీ కి మారుపెరయిన లోక్ సత్తా జయప్రకాష్ ,పార్టీ పెట్టి చేతులుకాల్చుకొని తానొక్కడే గెలిచి ,పార్టీ చాప చుట్టేసి చాలాకాలమైంది .ఈయన్ను చూసైనా పవన్ లాంటివాళ్ళు యదార్ధం గ్రహించకపోవటం వాళ్లఖర్మ . ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది .’’అంభి’’ లాంటి వారికి ఒకచాన్స్ ఇస్తే ఇక భస్మాసురహస్తమే. తస్మాత్ జాగ్రత జాగ్రత.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-19-ఉయ్యూరు