స్త్రీ శక్తి ‘’పై సరసభారతి 31-3-19శ్రీ వికారి ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళన కవితలు -4(చివరిభాగం )

స్త్రీ శక్తి ‘’పై

సరసభారతి 31-3-19శ్రీ వికారి ఉగాది వేడుకలలో

నిర్వహించిన కవిసమ్మేళన కవితలు -4(చివరిభాగం )

విన్నపం –వచన కవితలలో ఎక్కడైనా కవిత పలచబడిందని ,పునరుక్తమైనదని నేను భావించిన చోట్ల,విషయానికి సంబంధం లేని చోట్ల  మార్పులు చేసి ,ధారకొనసాగి ,చిక్కబడేట్లు చేశాను .నా సాహసాన్ని మన్నించండి –దుర్గాప్రసాద్

26-లయన్ శ్రీ బందా వెంకటరామారావు –విజయవాడ -6281754709

ప్రమాద పధం లో స్త్రీ శక్తి

అరిషడ్వ ర్గాలున్న స్త్రీకి భవితవ్యం సున్నా

అత్తలు వదినలు కోడళ్ళు భార్యలు హద్దుమీరితే ప్రగతి శూన్యం

కుంతీ ,కైకా గర్భం అద్దెకిచ్చే అమ్మ

పేకాడే మహిళా పోగతాగుతూ  మందుకొట్టే మానినీ

ప్రమాదాత్మకపధం లో స్త్రీ శక్తులు.

సరస్వతి లక్ష్మి పార్వతీ వైదేహి శిరోమాణిక్యాలు 

 దుస్టు డైన కన్నకొడుకునే చంపిన సాత్రాజితి  ,

కౌరవా౦తాన్ని చూసి కేశ పాశం ముడేసుకొన్న ద్రౌపది

ఆదర్శప్రాయ మహిళా శక్తులు .

శ్రమలో పరిశ్రమలో మహిళ పై చేయి

ప్రియదర్శిని ఇందిర,నేటి నిర్మల ,సుష్మా ,స్మృతి

సమర్ధతకు నిలుటద్దాలు .

మెతుకులో బతుకులో ఆమెదే కష్టం

అర్ధనారీశ్వరి అమృతహాసిని ఆమెయే

ఇదే త్రికాల వేదం ఈ బందా నాదం .

27-శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ –ఉయ్యూరు -9666020842

     అమ్మ

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి

చరాచరాలకు మూల రూపిణి

సచ్చిదానంద స్వరూపిణి

భవభయహారిణి, విశ్వేశ్వరి అమ్మ

సమసమాజ స్థాపనకు మూలం ,ఆదిగురువు ఆమెయే

తల్లులందరూ మేల్కొని

బిడ్డలకు నీతులు బోధించి

విశ్వ చైతన్యానికి బీజాలు నాటండి

మీ శ్రమ వృధాకాదు

సత్ఫలితాలనిస్తుంది .

 సమాప్తం

ఇవికాక నాలుగు  కవితలున్నాయి కాని పేర్లు లేవు .పోనీ వేద్దామంటే కవిత్వమూ శూన్యమే కనుక వాటిని వదిలేశాను .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-19-ఉయ్యూరు

 

 

 

 

 

 


 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.