సాహితీ బంధువులకు శుభకామనలు -ఇప్పుడే కవి ,విమర్శకులు తెలుగు శాఖాధిపతి ,”విహంగ”మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు ఇటీవలే స్వర్గస్తురాలైన శ్రీమతి డా పుట్ల హేమలత గారి భర్త, ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో తెలుగు శాఖలో ఉన్న డా ఎండ్లూరి సుధాకర్ గారు ఫోన్ చేసి తాను రాజమండ్రి ఆదికవి నన్నయ యూని వర్సిటీ నుండి హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి వచ్చి పని చేస్స్తున్నానని రాజమండ్రికి నేను పంపిన -1- అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య 2- ప్రయోగాత్మక కాంతి పరిశోధన పిత డా పుచ్చా వెంకటేశ్వర్లు 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 అందాయని ఇవాళ హేమలత గారి సమాధి కార్యక్రమానికి రాజమండ్రి వచ్చామని చెప్పారు .”నాకే తెలియని శాస్త్ర వేత్తల గురించి అద్భుతంగా రాశారు మీరు . చదివాను చాలాబాగా రాశారు ధన్యవాదాలు .మీ సరసభారతి పుస్తకాలు ఉంటె నాకు పంపండి కేంద్రీయ విశ్వ విద్యాలయ గ్రంధాలయం లో పెట్టిస్తాను చాలా విలువైన పుస్తకాలు ఇలాంటి లైబ్రరీలలో తప్పక ఉండాల్సినవి .మీ శ్రమకు ధన్యవాదాలు ”అని ఎంతో సహృదయంగా సౌజన్యంగా మాట్లాడారు . తప్పకపుస్తకాలు పంపిస్తానని చెప్పారు .ఆయన రాజమండ్రిలోఉండగా హేమలతగారికి మూడు నాలుగు కాపీలు పంపేవాడిని ఆమె తానూ తీసుకొని నన్నయ యూని వర్సిటీకి సుధాకర్ గారి ద్వారా అందజేసేవారు .చదివి ఆయనకూడా ఎప్పటికప్పుడు అభినందించేవారు .ఆయన కవిత్వం అంటే నాకు చాలాఇష్టం కూడా . జననాంతర సౌహృదం అంటే ఇదేనేమో -దుర్గాప్రసాద్
వీక్షకులు
- 996,594 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- స్వాగతం శోభకృత్
- (no title)
- సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -3(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.18వ భాగం.1.4.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.35వభాగం.మీమాంసా దర్శనం .1.4.23.
- సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -2
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.17వ భాగం.31.3.23.
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.34వ భాగం.31.3.23.
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.16వ భాగం.30.3.23.
- సరసభారతి శ్రీశోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -1
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,953)
- సమీక్ష (1,308)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (397)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (510)
- సినిమా (369)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు