13-ఏదుట్ల శేషాచలుడు
Byజగన్నాటక కర్త ఏదుట్ల శేషాచలుడు గద్వాల సంస్థానకవి .కవి సంగీత సాహిత్య భరత శాస్త్రాది కళలలో నిష్ణాతుడు .కౌండిన్య గోత్రుడు .చెన్నయ పండితుని పౌత్రుడు ,నాగభూషణ పండితుని పుత్రుడు .వనపర్తిదగ్గర ఖిల్లా గణపురవాసి. ఏదుట్ల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడు .పూర్వకవి స్తుతిలో పింగళి సూరన ను స్మరించటం చేత అతని తర్వాత కాలం వాడు అనుకోవచ్చు .జగన్నాటకం అయిదు ఆశ్వాసాలకావ్యం .గ్రంథం బాగా జీర్ణావస్థలో ఉన్నది .
మొదటి పద్యం
‘’శా.శ్రీ సీతాంత మండల౦బున వర శ్రీ గంధమున్ బూసి సా-ఖ్యానంబౌ తన విశ్వరూపము కడున్ భద్రంబుగా వ్రాసి యో
హో సాధ్వీ బహుభారమ య్యెనని నర్మోక్తుల్ పచారి౦పుచున్ –హాస క్రీడలు సల్పు రాఘవుడు కృత్యాదికృపన్ బ్రోవుతన్ ‘’
పూర్వకవులు ఎవరూ చేయని నవగ్రహ, అష్ట దిక్పాలక ,45గురు మునులను స్తుతించాడు.అందులో ఆంజనేయ స్తోత్రం –
సీ-‘’ఏ మహాసత్వుండు రామకార్యంబున గిరులెల్ల నచ్చన గిల్ల లాడె-ఏ బలప్రఖ్యాతు డేడు వారాసులు కాల్వల రీతి లంఘనము జేసె
ఏ సింహ విక్రము౦ డెలమి రక్షః కు౦జరాలి నీగల రీతి నణచి పుచ్చె-
ఏమహా సమకాయు డింద్రారి ఖండించు వేళతారలు కటి వ్రేల బెరగె
దారగిరి చాలన క్రియా దక్ష శక్తి –పాత సౌమిత్రి జీవమే ప్రభుడొసంగె
నట్టి గుణవంతు ధీమంతు ,నదిక శాంతు –ప్రకట జయవంతు హనుమంతు బ్రస్తుతింతు’’
తర్వాత సుకవి స్తుతి కుకవి నింద చేసి ,తనవంశం గురించి చెప్పాడు గురువు పేరు చెప్పకుండా ‘’గురువు ‘’అని మాత్రమె చెప్పాడు –
‘’అమర మంత్రోపదేశంబు విమలతయును –పుణ్య జనవర్ధనంబును ,బుధ సమీప
వర్తనము ,కావ్యచింత యవ్యాయ నివాస –మడరు శ్రీ గురుదేవు నే నభినతింతు ‘’ అనటం లో కవి ఆధాయ్త్మిక స్థితి గోచరి౦చి౦దన్నారు రాజుగారు .తనవంశ మూలపురుషుడు ఎర్రయ .చివరికి నాగభూషణ సుబ్బమా౦బలకు కవి పుట్టాడు .తాతముత్తాతలు ఎక్కడి వారో చెప్పలేదుకాని తండ్రి ‘’ఖిల్లా గణపుర మందిరుడు ‘’అన్నాడు .భరత శాస్త్ర ఆధ్యాత్మ విద్యాను సారం అయిన ‘’జగన్నాటకం ‘’ కథా సూత్రం చెప్పాడు .
‘’ మేటిగవిశ్వరూపుడు నమేయ గుణుండగునట్టి బ్రహ్మ ,జం –జాటము మీర నొప్పగ నజస్రము —టకైబనర్చెనీ
నాటక మాతకు౦దగిన నాణేములైనటు వంటి వస్తువుల్ –దీటు కోనంగ జేసె నతి ధీరత నా —-దంబు నొందగన్ ‘’
కం.-వడిగల తా౦డంబనగా –కడువడి లాస్యంబన౦గ ఘనమగు నీ రెం
దడ రించి వీ —దగి– -నదలక సామాజికంబు సంపాదించెన్ ‘’
కం-వర తాండవ నటనమునకు –పురుషుడువలె,లాస్య నృత్యమునకు చతురతయై
సరసికయగు సతిగావలె -నిరవుగ నీ ఇచ్చ —ములు జూడన్ ‘’
ఇలా చూడగానే ఒక అవ్యక్త మిధునం ఆవిర్భవించటం వలన ,సకల సామాజిక ఉత్పత్తి జరిగిందనే సృస్టి క్రమం చెప్పాడు .సామాజిక స్తవాన్ని స్రగ్విణి పంచచామరం ,వనమయూరి ,భుజంగప్రయాత ,దోదక, మత్తకోకిల వృత్తాలలో చేశాడు .తర్వాత వచనం ,చూర్నిక,ఆశ్వాసా౦తపద్యాలు రాశాడు .ఈ మహాకావ్యం లో అహంకారుడు అనేవాడు మమకారి అనే భార్యతో తన ప్రభావం చెప్పటం ,మోహుడు తనస్థితి చెప్పటం ,కామం రతి,లోభ తృష్ణ వర్ణన వీరిమధ్యవైరం వివేకుడు సుమతి సమేతంగా వచ్చి కలహం మాన్పించటం ఉంటుంది .ప్రబోధ చంద్రోదయం లోని కథపోలిక కొంత కనిపిస్తుంది .
శేషాచలుని రెండవ కృతి ‘’బారిగడుపుల నరసింహ శతకం ‘’.అన్నీ సీసపద్యాలే .నృసి౦హ స్వామిని ఆపాదమస్తకం వర్ణించాడు .స్వామి వైభవ పద్యాలు షోడషోపచారాలుగా ఉంటాయి .ఎత్తు గీతలలో’’ప్రీతి ననుబ్రోవు దయతోన యాతుధాన –గణ కరటి సింహ సింగ పట్టణ నృసింహ ‘’అనే ఉంటుంది .మచ్చుకొక పద్యం –
‘’ప్రాగ్గిరి మీదను బాలాతపచ్ఛద సాంద్ర దీధితి నెల్ల సమయ జేసి –కమల కైరవ షండకర్ణికాంతస్థమౌ పు ప్పొడికాంతుల గప్పి పుచ్చి
పదియారు వన్నెల బరగి సువర్ణమౌ బంగారు చాయలపాటి నొంచి
దిననాథుడస్తమించిన వేళల సెలంగు సా౦ధ్య రాగంబుల సవురు సవిరి
యలరి పీతాభమై చెలువమరుచున్న-వస్త్ర యుగ్మంబు నొసగెద వసుమతీశ
’’ప్రీతి ననుబ్రోవు దయతోన యాతుధాన –
గణ కరటి సింహ సింగ పట్టణ నృసింహ ‘’.
ఈ శతకం తర్వాత తాటి ఆకులపై మూడు పద్యాలు నారాయణ పుర కృష్ణునిపై రాశాడు .అదేక్కడున్నదో తెలీదు అంటారు ఆచార్య బిరుదురాజు వారు –చివరి గీతపద్యం –
‘’వెలది బోలు వెల్లి విరియంగనిన్ను దా –నమర వాడి దేల యందె పొమ్ము
ఎత్తుకోలు దిన్నె లిట్టి పల్లూరకె- యేల నీకు దాని నేలు కృష్ణా ‘’
‘’ ఏదుల శేషాచలకవి ఏకాలం వాడో తెలియకపోయినా ,ఆయన జగన్నాటక కృతి’’ త్రికాలాలకు చెందినది ‘’అని ఆచార్య బిరుదరాజువారు గొప్ప సర్టిఫికేట్ ప్రదానం చేశారు .
ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-19-ఉయ్యూరు .