17-నేబతి కృష్ణయామాత్యుడు
అమాత్యుడు, కవీశ్వరుడు అయిన నేబతి కృష్ణయామాత్యుడు కవిపోషకుడు ,మహమ్మదీయ సుల్తానుల సభకు అల౦కార మైనవాడు .కాని చరిత్ర మరుగునపడటం విధి వైపరీత్యం .కౌండిన్య గోత్రీకుడు .తండ్రి కమలయామాత్యుడు తల్లి కొండాంబ .గోల్కొందదగ్గర సిద్ధలూరు పుట్టినవూరు .దీనికి దగ్గరున్న అనంతగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పు .మహమ్మద్ ఖులీ కుతుబ్ షా అనే మహమ్మద్ షాహి ప్రదానమందలిలో ,కవులలో ఒకడు గా ఉన్నవాడు .’’రాజనీతి రత్నాకరం ‘’అనే ఆరు ఆశ్వాసాల కావ్యం రాసిన ఘనుడు .
పీఠిక లో సమకాలీన రాజకీయ ,సాహిత్య చరిత్ర రాశాడు ..గురువు కందాళ రంగా చార్యుడు .తర్వాత వైజయంతీ విలాసకర్త అయిన సారంగు తమ్మయ గురువు కందాళ అప్పు గారిని ,తర్వాత ముడుంబ సాదు భట్టాచార్యులను స్మరించాడు .చరిత్ర కెక్కని గురు మూర్దన్యుడు ,శతావధాని ,ద్రావిడ ఆమ్నాయ తత్వ రసజ్ఞుడు ,కర్నాటక్షమాభ్రుత్సభాంతర పూజ్యుడు మరి౦ గంటివెంకట జగన్నాధా చార్యులను కూడా స్మరించటం విశేషం .ఇంతటిమహాకవి కృతులకూ చిరునామాలేదు .తనకవితావైభావాన్ని గురువు నోట పలికించాడు కవి –
‘’స్వర్దునీ వీచికా సంఘాత ఘమఘమ న్నిర్ఘోషములమించి నీటు గెల్చి –వాగ్భామినీ పాద వనజాత కంచనా౦గదఝాళంఝాళ రావగతుల దెగడి
నిర్ఝర ద్రుమ జాల నిస్సర న్మకరందధమధమన్నద సంతతుల గేరి –కాంచీ నితంబినీ కాంచీ లతా ఘంటికా ఘణంఘణరావక్రమము మించి
వెలసే భవదీయ సరసోక్తి విరచితాననవద్య గద్య సుపద్య కావ్య ప్రబంధ
దండకోదాహరణ కవితా నిగు౦భనములు కృష్ణ ప్రధానీంద్ర నవరతీంద్ర ‘’
‘’కోనమ దేవీవల్లభ గానకళాలోల సకలకవి బాంధవ ర-క్షా నిధి వైష్ణవ కల్పక దీనిది కమళేంద్రు నేబతి ప్రభు కృష్ణా ‘’
కవిభార్య పేరు కొనమ .84దుర్గాల ఏలిక అయిన కుతుబ్ షా సుల్తాను కవికోటిలోనివాడు మంత్రికూడామనకవి .కుతుబ్ షాను మనకవులు మల్కిభరాముడు అని,ఇభరాముడని స్తుతించారు .కవి తండ్రికమలయామాత్యుడు మల్కిభరాముడు మెచ్చగా ,పానుగంటి పట్టణాధ్యక్షుడై,ఏకాదశీ వల్లభుడై ,ద్వాదశీ చూఠ కారుడై ,సత్యవాక్యపాలకుడై ,సరస సంగీతమహిమలతో ఆది కవుల వలే విరాజిల్లాడు .వంశమూలపురుషుడు అన్నమరాజు .ఏడవ తరం వాడు కృష్ణయామాత్యుడు .ఇంటి పేరైన నేబతి –నియాబత్ పదానికి తెలుగు .అర్ధం రాయబారి లేక స్థానాపతి .ఇందులో రెండవతరానికి చెందిన నాగరాజు బెదందకోట సుల్తాను శహాకు నేబతి అంటే స్థానాపతిలేక రాయబారి .
కవి విశిస్టాద్వైత మతానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు .ఈకవికి 300 ఏళ్ళ ముందుదూబగుంట నారాయణకవి’’ పంచతంత్రం ‘’రాశాడు ..కృష్ణయామాత్యుడు తనకావ్యం లో 20పద్యాలలో శ్రీరంగపురవైభావం వర్ణించాడు .తర్వాత సుదర్శన చక్రవర్తి వర్ణన చేశాడు .ఆశ్వాసా౦తపద్యాలలో అందులోని విశేషాలు తెలిపాడు .కావ్యాన్ని 6-12-1838న బోనాల అప్పన్న కుమారుడు వెంకటాద్రి వ్రాతప్రతి రాశాడు .’’నేతటికాలమున నీ తాటియాకుల గొడవ యేరికిని పట్టిరాక వెట్టికి బుట్టిన బిడ్డ వలె నున్నది’’అని ఆచార్య బిరుదురాజు రామరాజుగారు వ్యధ చెందారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-19-ఉయ్యూరు
—