’చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’’
తోడికోడళ్ళు సినిమాలో ఆత్రేయ ‘’కారులో షికారుకెళ్ళేపాలబుగ్గలపసిడీ చాన ‘’పాట చివర్లో ‘’చాకిరొకరిది ,సౌఖ్య మొకరిది సాగదింకా తెలుసుకో ‘’అని రాశాడు . కాని ఇది రివర్స్ అయి చంద్రబాబు విషయం లో ‘’చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’’గా మారిందేమో అనిపిస్తోంది .నిజమే ఉమ్మడిరాష్ట్రంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ నగరాన్ని’’ హైటెక్ సిటీ ‘’గా మార్చటానికి ఎన్నేళ్ళు ఎంతకస్ట పడ్డాడో శత్రువులుకూడా ఘనంగా మెచ్చుకొన్నారు .ఆంద్ర యువకులకు ఐటి రంగం లో క్రేజ్ క లిగించాడు .ఎన్నో కంపెనీలు విదేశీ ఉద్యోగాలతో ఆంద్ర యువత ఆడర్శప్రాయులయ్యేట్లు చేశాడు .ఎన్నో ఫారిన్ కంపెనీలు భాగ్యనగరం లో కొలువుతీరి వేలాది ఉద్యోగాలకు ఆస్కారం కలిపించాయి .ఇదంతా బాబు ఆలోచన ,ఆచరణ, మొండి ధైర్యం . అప్పుడు రైతులను ,వ్యవసాయాన్ని మర్చిపొయాడని ఊదరకొట్టి దించేశారు .వైఎస్ అధికారం లోకి వచ్చి చంద్రబాబు చేసిన చాకిరీ ఫలితాలను సౌఖ్యాలను హాయిగా అనుభవించి తండ్రి కొడుకులు లక్షకోట్లు మూటకట్టారని జనం గగ్గోలు పెట్టారు .దాదాపు పదేళ్ళు అధికారం కోల్పోయినా ,మామను ముంచాడు అనే అభియోగాన్ని భారంగా మోస్తూ పార్టీ కి ప్రజలకు సన్నిహితమై మళ్ళీ శ్రమించి ,పార్టీ స్థాయి కాపాడి వెన్నుదన్నుగా ఉండి ప్రజాభిమానం పొందాడు .
రాష్ట్ర విభజన జరిగి ఎన్నికలలో కొత్త రాష్ట్రారనికి చంద్రబాబే బెటర్ అని నమ్మి ప్రజలు గెలిపించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిని చేశారు .చేతిలో చిల్లిగవ్వలేని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ,కొత్తరాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం కలిగింది .ఈ ఆలోచన లేకుండా హైదరాబాద్ లోనే నోరూ వాయి మూసుకొని ఉండిపోవచ్చు అవమానాలు భరిస్తూ .కాని ఆంధ్రుల సంకల్పం బలమైనదని వాళ్ళు ప్రపంచం లో కాలరెత్తుకు స్వాభిమానం తో తిరగాలని భావించి రాజధాని అమరావతి నిర్మాణం ,అనేక మైన ప్రభుత్వభవననిర్మాణ౦ పరిశ్రమల రూపకల్పన అవసరం వాటి ఏర్పాట్లకోసం దేశదేశాల చుట్టూ తిరిగి సాధించటం దీనికి తోడూ పోలవరం నీళ్ళు రాకపోతే కోస్తా జిల్లాలు అన్నమో రామ చంద్రా అని నీరు లేక సాగులేక అల్లాడిపోతారని సంకల్పించి పూనుకోవటం ,పట్టిసీమ నుంచి ఈలోపు గోదావరి నీరు వచ్చే ఏర్పాట్లు చేసి అపరాభగీరదుడుగా సాధించటం ,సస్య శ్యామల ఆంద్ర దేశాన్ని తయారు చేయటం అలుపులేని కృషి చేశాడు. విశ్రాంతి లేని జీవితం బాబుది. సునామీలు తుఫాన్లలో అతలాకుతలమైన రాష్ట్రం .దానికి సాయంకోసం కేంద్రం సాయం కోరటం పైసా కూడా చేపకపోవటం ,పోలవరం అమరావతి మిధ్య అని తీవ్రప్రచారాలు ,కియా మోటారుకారు కంచికే పోయిందని బూటకమని ప్రచారం .సెల్ ఫోన్ ల తయారీలో ఆంద్ర అగ్రగామికావటం కిట్టనివాళ్ళు ఆడిపోసుకోవటం ,ఆదినుంచీ ఎవరూ సహకరించకపోవటం చివరికి విసుగెత్తి యెన్ డి ఏ కు గుడ్ బై చెప్పి ,సాధనలో తీవ్రంగా అలసిపోయాడు .మళ్ళీ కథమొదటికే వచ్చింది .అయిదేళ్ళ తర్వాత 2019ఎన్నికలలో ఘోరంగా పార్టీ ఓడిపోవటం బాబు ను కలచి వేసే సమస్య .సినిమానటులు, రామారావు కుటుంబం నుంచి సహకారం కరువు .లేక తీసుకోలేకపోయాడో అదొక సమస్య అయింది .
ద్వాక్రాగ్రూపులకు ఇతోధికంగా సాయం ,ముస్లిం లకు పెద్దపీట,బిసిలకు కాపులకు కాపు కాసినా ,విద్యార్ధులకు చేరువైనా ,రైతులకు దగ్గరైనా ,’’ఎన్నారైలు’’ వందలసంఖ్యలో వాలి ప్రచారం చేసినా ,ఎన్నికలకమిషన్ ఉచ్చుబిగించి ,ఐఎస్ ఐపిఎస్ లు ముసుగులో మోసంచేసి ,పైనున్నద్వయం బాబు సర్వనాశనమే ధ్యేయంగా పని చేయటం తో అంతా ఉల్టా అయింది .అధికారం జగన్ చేతిలో పెట్టి ,సౌఖ్యమా నుబహ్విన్చాతానికి రాచబాట వేశాడు .జయలలితగతి పట్తిస్తారేమో ననే భయమూ వేసింది .జైల్లో పెట్టిస్తారేమోనని ఆంధ్రజనం కలవరపడ్డారు .అందరూ నమ్మి ఓట్లు వేస్తారనుకొంటే అంతా నమ్మించి మోసమే చేశారని అర్ధమయింది .కనుక పాపం బాబు విషయం లో ‘’చాకిరొకరిదీ,సౌఖ్యమొకరిదీ సాగునెప్పుడు తెలిసికో ‘’అన్నది మళ్ళీ నిజమైందికదా .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-19-ఉయ్యూరు