గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
413-హరి భక్తి సుదోదయ వ్యాఖ్య కర్త –సారంగు తమ్మయ (1580)
తెలుగులో ‘’వైజయంతీ విలాసం ‘’కావ్యం రాసిన సారంగు తమ్మయ విశిస్టాద్వైత మతస్తుడు .’’వరిచిత భగవద్భాగావత కైంకర్య విధానుడు ‘’అని పించుకొన్నాడు .సంస్కృతం లో’’ హరి భక్తి సుధోదయ వ్యాఖ్య’’రాశాడు .దీనికే’’ భక్తిసంజీవని ‘’పేరున్నది .20 అధ్యాయాల గ్రంథం.
’’ఇతి సారంగ తమ్మప్రభునా విరచితాయాం హరిభక్తి సుదోదయ టీకాయాం భక్తి సంజీవనీ వ్యాఖ్యాయాంప్రథమోధ్యాయః ‘’అని చెప్ప్పుకొన్నాడు .వైజయంతీ విలాసం తర్వాతే దీన్ని రాశాడు .ఇలవేల్పు శ్రీరామ చంద్రునికి విలాసం అంకితం చేశాడు .సంజీవనిలోనూ ఆయనను ఇలాస్మరించాడు –
‘’శ్రీరామచంద్ర స్స తనోతు లక్ష్మీం -శ్రీ లక్ష్మణాలంకృత దివ్య మోర్తిః
యద్దర్శనాద్దుఃఖ మపాన్య సర్వం –సద్యః పరానంద ముపైతి లోకః ‘’
తర్వాత రెండు శ్లోకాలలో తనగురించి రచనగూర్చి చెప్పాడు –
యస్యౌదార్య మివాకలయ్య సతతం కుర్వన్తి వాసం దివి –స్వర్ధే ను ప్రముఖా వదాన్య మణయో ప్యద్యోపి నేహాగతా
శ్శ్లాఘ్య సాధు గుణాన్వితో బుధజనై ర్భాగీరథీ పట్టణే-సోయం మంత్రి దురంధరో విజయతే సారంగు తమ్మప్రభో ‘’.
‘’తేనేయం క్రియతే టీకా హరిభక్తి సుధోదయే –భక్తీ సంజీవనీ నామ్నా విద్వాత్సంతోష కారిణీ’’
వీటిలో తమ్మయ మంత్రి దురంధరుడని , ప్రభువు అనీ తెలుస్తోంది .పట్టణం లోని పెద్దకరణాన్ని అలాపిలుస్తారనీ మన ‘’మేయర్’’లాంటి పదవి అనీ ఆచార్య బిరుదురాజు రామరాజుగారన్నారు .తమ్మయ గోల్కొండ పట్టణానికిపెద్దకరణం .అంటే మేయర్ లాంటివాడు
తమ్మయ -కులీ కుతుబ్ షా కాలం 1580-1612 వాడు .భాగీరధీపట్టణం భాగ్యనగరమే అయి ఉండచ్చు నని వారి ఊహ .కవి తన తండ్రి తాతలగూర్చి చెప్పుకోలేదు .సుల్తానుతో బాగా చనువు ఉన్నట్లు ఆయన ఈయనను ‘’రమ్ము ,పొమ్ము’’అని చనువుగా అనే వాడని తెలుస్తోంది ..ప్రజలు కవి వైభవానికి ‘’జయ జయ ధ్వానాలు చేసేవారు .తెలుగువారికి సారంగు తమ్మయ అంటే తెలుగులో వైజయంతీ విలాస కర్త అని మాత్రమే తెలుసు .సంస్కృత రచన చేశాడని రాజు గారు చరిత్ర ముసుగు తీసి చూపేదాక తెలియదు .
ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’
సశేషం