గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
414-సీతా విజయ చంపు కర్త –పరశురామపంతుల అనంత రామ పండితుడు (19వ శతాబ్దం )
19వ శతాబ్ది మధ్యకాలంవాడు పరశురామ పంతుల లింగమూర్తిగారికి అయిదవతరం వాడు సీతావిజయ చంపూ కావ్యకర్త పరశురామపంతుల అనంతమూర్తి పండితుడు .తండ్రి రామకృష్ణ సోమయాజులు .తల్లి వేణా౦బిక .ఈ అముద్రిత కావ్యం కాకినాడ ఆంద్ర సాహిత్యపరిషత్ కార్యాలయం ఉందని బిరుదురాజువారన్నారు .మూడు స్తబకాలు మాత్రమే లభ్యం కనుక అసమగ్రం .ప్రధమ స్తబకం చివర –‘’ఇతి శ్రీమత్సమస్త భువన ప్రసిద్ధ మేధ్యతర ,భరద్వాజస గోత్రా భరణాయ ,మాన పరశురామాన్వయ దుగ్దాబ్ది సుధా దీదితినా ,శ్రీ లక్ష్మీ నారాయణ పాదారవింద మరందా స్వాదానంద తున్దిరే౦దిరాయ మాన నిజస్వాంతేన శ్రీరామకృష్ణ సోమయాజి కుటుంబినీ వేణా౦బికా శుక్తి ముక్తా ఫలాయితేన,అన౦తరామ పండితేన ,ప్రణీతే శ్రీ సీతా విజయాభిదాన చంబూ ప్రబంథే ప్రధమ స్తబక సమాప్తః’’.చంపూ ‘’ను ‘’చంబూ ‘’అని కూడా కవులు వాడారని తెలుస్తోంది .పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు జైమిని భారతం లో ఈపదాన్ని ప్రాస స్థానం లో వాడినట్లు రాజుగారు చెప్పారు .
సీతావిజయం అంటే ‘’శత కంఠ రామాయణం ‘’.ఈపేర్లతో యక్షగానాలు చాలావచ్చాయి .దీనికి ఆధారం ‘’వాసిష్ట రామాయణం ‘’అని ఆచార్య ఎస్వి జోగారావు గారు చెప్పారట .శతకంఠ రామాయణాల గురించి శ్రీ సాళ్వ కృష్ణమూర్తి విపులంగా రాశారట.
శ్రీరామ చంద్ర స్తోత్రంతో ప్రారంభించాడు కవి కావ్యాన్ని –
‘’శ్రీరామం సుర రాణ్ముఖామరవరై రారాధితాంఘ్రిద్వయం –రాకారాజ ముఖం ,సరోజ నయనం ,రాజాధిరాజం ముదా
శూరం శూర కులా౦బు రాశి శశినం ,దైత్యాంధకారారుణం-ధీరం ,విరమరం స్మరామి సుఖదం స్వాంతే ససీతం సదా ‘’.
తర్వాత దేవతా ,గురు స్తుతి ఉంది .ఇందులో వచ్చిన ‘’అంబాల ‘’గ్రామం వరంగల్ దగ్గరు౦దన్నారు రాజుగారు .ఇది కాకతి రుద్రా౦బ పేర నిర్మితం .అంబాల శ్రీ రామునికి అంకితంగా ఉద్దిమర్రి పాపయ్యకవి ‘’రాఘవాస్టకం’’రాశాడు .
ఈ చంపూ కావ్యం లో కథను శంకరుడు పార్వతికి చెప్పాడని సూతుడు మునులకు వివరిస్తాడు .రాముడు అయోధ్యకు వచ్చి పట్టాభి షిక్తుడై రాజ్యపాలన చేయటాన్ని 20శ్లోకాలలో కమ్మగా వర్ణించాడు .అందులో శ్రీరామప్రాభవ శ్లోకం –
ధైర్యే నమ్రీకృతో మేరుర్జాడ్యవాన్ తుహి నాచలః-మందరాద్రి రపి భ్రాంతః కథ౦ సుర్యేనతేసమాః
శతముఖుడికి రక్తబి౦దుడుఅనే పేరుకూడా ఉంది .రెండవ స్తబకం లో 68గద్య, శ్లోకాలున్నాయి .శబ్దాలంకార ముక్తపద గ్రస్తాలతో కావ్యానికి ఇంపు సోంపు తెచ్చి చంపు కు విశేషాదరణ కలిగించాడు .వర్షర్తు వర్ణణ-
‘’నమకిర దసమం దిగంగనానాం-ధృట పటతుల్య పయోముచాం రజస్స్వం
సులలిత నవనీప వృక్షాలేఖా –పురు పటవాన మివాభిరామ గంధం’’
శబ్దాలంకార మాధుర్య శ్లోకం-
‘’నీల తమాల కదంబ విలీనం ,నీల తమాలక శోభన వక్త్రే-మానవతీమణి వేత్సి నవాముం,మానవ తీర్ధ భవేక్షణ భాంతేన’’
మూడవ స్తబకంలో 67గద్యపద్యాలున్నాయి .ఇదంతా సీతారామ శృంగారానికే పరిమితం .మన్మధసామ్రాజ్య ప్రాభవాన్ని చెప్పే శ్లోకం –
‘’సీత్కారాణి కరాబ్జాత దూననం చాపి యోషితాం-నయమోర్ధనిమేషాస్తు ,మన్మధస్యాస్త్ర తాం యయుః’’
సాధారణంగా సంస్కృత చంపూ కావ్యాలలో ఒక్కో సర్గకు ఒకే రకమైన ఛందస్సు వాడతారు.కాని పరశురామపంతుల అనతరామ పండిత కవి తెలుగు ప్రబంధాలలో వాడినట్లు ,ఈ సంస్కృత చంపూ కావ్యం లో ప్రతి స్తబకం లోనూ వివిధ ఛందస్సులువాడి, తెలుగు వాడి ముద్రవేశాడని రామరాజుగారువాచ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-19-ఉయ్యూరు
—