గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
465-తంత్రరాజ తంత్ర కు సుదర్శన వ్యాఖ్య కర్త –ప్రాణ మంజరి (18వ శతాబ్దం )
ప్రాణమంజరి తంత్ర రాజ తంత్ర అనే తంత్రశాస్త్రం లో మొదటి పటలం కు సుదర్శన అనే వ్యాఖ్యానం రాసింది .దీనిలో 101శ్లోకాలున్నాయి .ఈమె కూరమాచాల రాజు హర్షదేవ -హర్షమతిల కుమార్తె . ప్రాణమంజరి ‘’శారదా తిలక టీకా’’అనే శబ్దార్ధ చంద్రిక రాసిన ప్రేమనిది కి మూడవభార్య .హైహయుల ఏలిక కార్త వీర్యుడు కు భక్తురాలు .భర్తకుఅత్యంత విదేయురాలు. భర్త అండదండలతోనే వ్యాఖ్యానం రాసింది తప్ప కార్తవీర్యుని సాయం కోరలేదు .ఈదంపతుల కొడుకు సుదర్శన అకస్మాత్తు మరణి౦చతమ్ తో దుఃఖ భారాన్ని తగ్గించుకోవటానికి ఆమె ఈ వ్యాఖ్యానాన్ని ప్రారంభించి ఊరట చెందింది .సుదర్శన కుమారుడులేని వెలితిని అక్షర సుదర్శనం లో నింపుకొన్నది .దేవి త్రిపురసుందరి స్తోత్రం తో ప్రారంభించింది. అంతకు ముందే ఆమె రాజరాజేశ్వరుని ప్రీతికోసం ‘’దీపప్రకాశ ‘’మొదలైన రచనలు చేసింది .
ఆమె రాసిన తంత్ర శాస్త్రం పై వ్యాఖ్యానం ‘’నిత్యా ఖండ ‘’కు సంబంధించింది .స్త్రీలు ఎవరూ చేయని సాహసాన్ని ప్రాణమంజరి తంత్రరాజ తంత్ర వ్యాఖ్యానం రాయటం లో చూపి ప్రశంసలు పొందింది .మొదటి పటలానికి వ్యాఖ్యరాసినతర్వాత మిగాతాపటలాలకు వ్యాఖ్యరాసినట్లు ఎక్కడా లేదు .ఆమె చెప్పిన దాని ప్రకారం తంత్రరాజ తంత్రకు ముందు 9తంత్రాలున్నాయి అవి –సుందరీ హృదయ ,నిత్య షోడశికార్నవ, చంద్రజ్ఞాన , మాత్రికాతంత్ర ,సమ్మోహనతంత్ర వామకేశ్వర ,బహురూపక ,ప్రస్తార చింతామణి ,మేరుప్రస్తార .ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని, వాటిలో ఏ ఒక్కటీ ప్రత్యేకించి లేదని చెప్పింది .
సంస్కృత సాహిత్యం పై ప్రాణమంజరికి అపార జ్ఞానం ,పట్టుఉన్నాయి .ఆమె సులభశైలి ,అంతులేని విజ్ఞానానికి మురిసిపోవాల్సిందే .వ్యాఖ్యానం లో ఆమె ప్రయోగించిన ఏ శబ్దానికీ నిఘంటువులు వెతకనక్కరలేదు .అంతటి సులభశైలిలో తంత్ర శాస్త్ర వ్యాఖ్యానం రాయటం సాధారణ కవులకు అసాధ్యమైన విషయం .దాన్ని సుసాధ్యం చేసింది .మొదటిశ్లోక వ్యాఖ్యానం లోనే ఆమె ప్రతిభకు అప్రతిభులమవుతాం .విషయాలను విడమర్చి చెప్పటం లో అందెవేసిన చేయి ఆమెది. నిష్కర్షగా నిర్ణయాలు చెబుతుంది .త౦త్ర రాజం పై పూర్వపు వ్యాఖ్యాతలు చేసిన వాటిలో లోపాలను నిర్భయంగా బయటపెట్టి తన తీర్పు చెప్పింది .తంత్రరాజం లో గురువుకు 9సద్గునణాలు౦డాలని ,అవే నవనాధులకుప్రతీకలనీ ఉన్నది ఈమె శిష్యునికి కూడా అందులోని మొదటి నాలుగు లక్షణాలు తప్పక ఉండాలని చెప్పింది .ఈ తంత్రాన్ని శిష్యులకు బోధించేముందు గురువు అందులోని 25దోషాలను తొలగించి చెప్పాలని ఉంది . ‘నిర్జితమంత్రం ‘’విషయం లో నిధికార చెప్పిన దాన్ని ఈమెతోసిపుచ్చింది .ఆమెకున్న విశేష పరిజ్ఞానం అడుగడుగునా ద్యోతకమై మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది .
ప్రాణమంజరి కాలం ఆమె రచనబట్టి తెలియదు. కాని భర్త రాసిన’’ ప్రేమనిధి పంథా’’లో కొన్ని వివరాలున్నాయి .కుమాన్ కు చెందిన ప్రేమనిధి భారద్వాజ గోత్రీకుడైన ఉమాపతి, ఉద్యోతమతి దంపతులకుమారుడు .ఇతని రాజపోషకుడు ఘనశ్యామకొడుకు మలైవమ్మ తాత ముక్తి క్షేత్రదగ్గరున్న తాకమాకు చెందిన కొండరాజు .మలైవమ్మ అందించిన ఆర్ధికసాయం తో కాశీ లో చదివి పట్టాపొందాడు .చాల గ్రంథాలురాశాడుకాని ముద్రణ పొందలేదు ..ఇతడురాసిన దీపప్రకాశ దానికి తానే వ్యాఖ్యానం రాసిన శబ్దప్రకాశ లలో రచనాకాలం 1726-27గా చెప్పాడు .కాని ఇతరరచన అయిన శబ్దార్ధ చింతామణి కాలం 1737అని రాశాడు కనుక ప్రేమనిధి , ,భార్య ప్రాణమంజరి 18వ శతాబ్ది పూర్వభాగం లోని వారని చెప్పవచ్చు .తంత్రరాజ తంత్రం పై ప్రాణమంజరి రాసిన సుదర్శన వ్యాఖ్యలో మొదటి శ్లోకం –
‘’శ్రీనీశోపిశ్రేశోవిభురగతి పుంసాం గతికరో –పవర్గద్యం యస్మాత్ ఫల మలసూతిపి విమలం
శ్రమహేతుర్నానా విమతిరపి మత్యార్ధ మతిదః-మన్హాయఃకోప్యే షోత్రతు భవతు మే హ్రైద్యః పతిః
శ్రీ కార్తవీర్యం పదగడిహృ గ రూద్యా –స్వీయేస్టం దేవమపి కేవలం యోగాయున్త్యా
తంత్రరాజతంత్రం –మొదటిశ్లోకం –
‘’అనాద్యంతో పరాధీనః స్వాధీన భువనత్రయః –జయత్యవిరతోవ్యాప్త విశ్వం కాలో వినాయకః ‘’
దీనికి సుదర్శన వ్యాఖ్య –అధ శ్రీపతి గణపతి దివాకర దేవీ మహేశ్వరాత్మాక పంచాయతన దేవతానాం తదవానంతర భేదానం చన౦తత్వే నోపాస్య దేవతా నైయత్యేపి ఖఖ ఖఖపూర్వపూర్వ కర్మ వే భవభవ రుచి వైచిత్రీ పగా — ‘’గ సాగింది .ఆతంత్రం లో మనం మునగకుండా బయట పడదాం .
వ్యాఖ్య లో చవరి శ్లోకం –‘’భూమి తత్వమయో వ్యాప్తిరితి సమ్యక్ సమోరితా –అస్యా నిష్ఫల నాచ్చిత్తేతత్తత్వం ఖాత్మాసత్ కృతం ‘
ఇతి షోడషనిత్యాతత్వేశ్రౌకాదిమతేప్రథమః పటలః’’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-19-ఉయ్యూరు