గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
466- మధ్వాచార్య’’ కాలమాధవ’’కు వ్యాఖ్య కర్త –లక్ష్మీ దేవి (18వ శతాబ్దం)
మధ్వమత సంస్థాపనాచార్య శ్రీ మధ్వాచార్య రచించిన’’ కాలమాధవ’’ కు పాయగుండ వైద్యనాధ భార్య లక్ష్మీ దేవి వ్యాఖ్యానం రాసింది . ఈయన తండ్రి మహాదేవ, తల్లి వేణి.ఆమె తండ్రి మహాదేవ దీక్షిత తల్లి ఉమా .దీక్షితుని తండ్రి కృష్ణ .తాత గణేశ .ఆమెతండ్రి గొప్ప విద్యావంతుడు .గౌరవనీయ స్థానం లో ఉన్నవాడు .ఈమె కుమారుడు బాల లేక బాలక లేక బాలకృష్ణ .ఈమె వ్యాఖ్యాన ప్రారంభం లోను ,మితాక్షర వ్యాఖ్యానం లోని ఆచారఖండంలోను ఒక శ్లోకం కనిపిస్తుంది .-
‘’శ్రీమాధవం గురుం నత్వా లదీర్లద్మీ౦ శిశుప్రాసః –ఖేరడే ముహుత్మాపాత్య గనేషపత్యకృష్ణాకః’’
మహాదేవఃస్తుతస్తస్య దేవమూర్తిర్జటాదివిత్-శ్రౌత స్మార్ధస్య నిపుణో దీక్షితో రాజపూజితః
పత్నీ యస్య హ్యుమారూపా సాధ్యుమా తస్య కన్యకా –కాలమాధవ సద్వ్యాఖ్యాయాంతనుతే సర్వ సంవిదే’’
లక్ష్మీదేవికి ఉమా అనే మరో పేరున్నట్లు ఎక్కడా ఆధారం లేదు .లక్ష్మీదేవికాలం 18వ శతాబ్దం .కొడుకు బాలకృష్ణ 1730లో పుట్టి ఉంటాడు .కనుక లక్ష్మీదేవి 18వ శతాబ్దం ప్రారంభంలో పుట్టి ఉంటుంది .
లక్ష్మి వ్యాఖ్యానం లో ఉపొద్ఘాత, అబ్ద లేక వత్సర ,ప్రతిపత్ ,ద్వితీయాది ,నక్షత్రాది పేర్లతో అయిదు ప్రకరణలున్నాయి ,.దేనికది సంపూర్ణం .కాలమాధవ ,లక్ష్మీ వ్యాఖ్యలు అనేక పురాణ స్మృతి జ్యోతిష మొదలైనవాటినుండి ఉదాహరణలతో నిండి ఉంటాయి .కాలమాధవానికి విద్యారణ్యఅనే పేరుంది ‘
కాలమాధవ లో మొదటిశ్లోకం –‘’వాగౌ శాద్యాఃసుమనసః సర్వార్ధ నాముపక్రమే –యమ నత్వా కృతక్రుత్యాఃస్యుత్వం నమామి గజాననం ‘’
దీనికి లక్ష్మి వ్యాఖ్య –‘’శ్రీమాధవం గురుం నత్వా లక్ష్మీర్లక్ష్మీ శిశు ప్రసూః’’అని పైఅన చెప్పిన శ్లోకం తర్వాత –అస్య గ్రంధస్య స్వేయత్వ ధోతనాయ స్వ ముద్రా రూప సనేకార్ధసకలస్వగ్రంధసాధారణం తావత్ ‘’—అంటూ రాసింది .ప్రతిశ్లోకానికి విపులవ్యాఖ్యానమే చేసి ఆచార్య హృదయావిష్కరణ చేసి ధన్యురాలైంది లక్ష్మీదేవి
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-19-ఉయ్యూరు