గురు శిష్యులు
గురు -శిష్యా! ఏపీ కి ఉపముఖ్యమంత్రులు ఎందర్రా ?
శిష్య -అయిదుగురుకదా గురూ
గురు -మరి సీఎం లు ఎందర్రా ?
శిష్య – ఐదారుగురు గురూ
గురు -అదేంట్రా ఒక్కరే ఉండాలి కదా
శిష్య -ఉండాలి నిజమే .అసలు సీఎం జగన్ .కీ సీఎం విజయసాయి ,సూపర్ సీఎం కేసీఆర్ సుప్రీం సీఎం మోదీషా . వీరికి పైన రాజగురు స్వరూపానంద సామి .
గురు-బాగుందిరా .ఏపీ కి హోదా వస్తుందా ?
శిష్య -రానట్లే ఉంది గురూ . ఇప్పటికి మూడు సాలు పీఎం ను ”కలిసి సార్ సార్ -ప్లీజ్ ప్లీజ్ ”మంత్రం పఠించినా ఫలితం తేలక నీరసపడడ్డాడు సీఎం .
గురు -మరి వేరే ఉపాయం లేదా ?
శిష్య -ఉంది గురూ .జగన్ ఎంపీలందరూ ఢిల్లీలో ఒక నెలరోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్పక వస్తుంది .లేక రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికైనా వసద్ది .
గురు -అంత సాహసం చేస్తార్రా ?
శిష్య -చెప్పటం తేలికేకాని చేయటం కష్టంకదా గురూ
గురు -వేరే ఉపాయ0 లేదా ?
శిష్య -భేషుగ్గా ఉంది . విశాఖ సాములోరు స్వరూపానంద జీ -జగన్ ను కేసీఆర్ ను యాగాలు యజ్ఞాలు చేసి రికార్డ్ మెజారిటీలతో గెలిపించానని చెప్పారు కదా ఆయనకు ఒక యాభై కోట్లు ఇచ్చి పూజాపునస్కారాలు యజ్ఞ యాగాలు మోదీషా మనసు మార్చే యంత్రాలు కట్టించి విభూతి పంచిపెడితే గ్యారంటీగా రావచ్చు
గురు -కేసీఆర్ ,,జగన్ లు గోదారి అంతు చూస్తాం అంటున్నారు ?
శిష్య -కాళేశ్వరం కడితే శనేశ్వరమే తప్ప చుక్క నీరు లేదట .ఇక్కడ బాబు పట్టిసీమ నీళ్లు రాయలసీమదాకా పారించి ఆంద్ర అంతా సస్యశ్యామలం చేశాడు .ఆ కడుపుమంటతో ”పసి వాణ్ని ”దువ్వి జలసిరి పొంది తనమగసిరి చూపించాలన్నతాపత్రయం గురూ .చివరికి ”కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు అనే సామెత రుజువవుతుందేమోనని భయంగా ఉంది గురూ
గురు -ప్రజాదర్బార్ అర్ధరాత్రి కూల్చేశారు .దానికి కోట్లు ఎందుకు ఓట్లు వేసినవారంతా కలిస్తే ఉఫ్ఫ్మని ఊదేసి వాళ్ళుకదా ?
శిష్య – -అంత ”ఔడియా వచ్చి ఉండదు ”లేక ”స్వామి” ఆదేశించి ఉండరేమో
గురు – కరకట్ట వెంబడి సచ్చిదానంద ఆశ్రమం మంతెనరాజు గారి విల్లాస్ ,ఇస్కాన్ వారి భారీ భవంతులున్నాయి వాటినీ కూల్చేస్తారా ?
శిష్య -”కూల్చేసుకోండి లేదా కూల్చేస్తాం ”స్లోగన్ ఫ్లోట్ చేశారుకదా .చూద్దాం .అత్యంత కీలక విషయాలన్నీ నాతోనే చెప్పించి తప్పించుకొన్నావ్ గురూ .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-19-ఉయ్యూరు