ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం
కృష్ణా జిల్లా మచిలీపట్నం లో శ్రీ పి.వి.నరసింహం 1941లో జన్మించారు .1963లో ఆంధ్రా యూని వర్సిటి నుండి ఆర్ధికశాస్త్రం లో ఎం .ఏ.డిగ్రీ పొందారు .ఇక్కడే ఎకనామిక్స్ లెక్చరర్ గా చేరి ,ఆర్ధిక శాస్త్రం లో పరిశోధనలో మునిగిపోయారు .
కొద్దికాలానికే రిజర్వ్ బాంక్ లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ,పరిశోధనలలో పండిపోయారు .13 ఏళ్ళు రిజర్వ్ బాంక్ లో సేవలందించి తనపరిశోధన లలో నిష్ణాతులై ,రిసెర్చ్ ఆఫీసర్ గా ,డిప్యూటీ డైరెక్టర్ గా ఎదిగారు .తర్వాత ఇండ స్ట్రియల్ డేవలప్ మెంట్ బాంక్ (I..D. B.L.)లో1977లో చేరి రిసెర్చ్ డివిజన్ ,,ప్లానింగ్ కార్పోరేట్ ,ఫైనా౦షియల్ భాగాలలో ఉత్కృష్ట సేవలందించారు .
మర్చెంట్ బాంకింగ్ డివిజన్ చీఫ్ జనరల్ మేనేజర్ అయి ఎక్సి క్యూటివ్ డైరెక్టర్ అయ్యారు .ఈ పదవులలో ఉంటూ మానవ వనరుల అభి వృద్ధికి ,పెట్టుబడి దారుల సంబంధాలను మెరుగు పరచటానికి ,ట్రెజరీ అండ్ ఫండింగ్ ప్రక్రియల నైపుణ్యానికి అద్వితీయమైన కృషి చేశారు నరసింహం గారు .తర్వాతకాలం లో ఇండస్ట్రియల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (I.F.C.I)ప్రెసిడెంట్ గా 16-7-1998 న పదవీ బాధ్యతలు చేబట్టి తన విశేష ప్రతిభా విశేషాలు ప్రదర్శించారు .దీని అనుబంధ సంస్థలకు గౌరవ సభ్యులుగా ఉంటూ సలహా సంప్రదింపులతో వాటి అభి వృద్ధికీ తోడ్పడ్డారు .ఆర్ధిక శాస్త్రవేత్తగా ,బాంకింగ్ రంగ నిష్ణాతులుగా పి.వి. నరసింహం ప్రపంచ ప్రఖ్యాతి పొందారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-19-ఉయ్యూరు