ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
30-నూనె గింజలలో వంధ్యత్వ సమస్య పరిష్కరించిన –శ్రీ మతి మూల్పూరి సుజాత
కెమికల్ టెక్నాలజీ పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మూల్పూరి జనార్ధనరావు దంపతులకు కృష్ణాజిల్లా ఉయ్యూరుదగ్గర వల్లూరుపాలెం లో 19-10-1961 జన్మించిన శ్రీమతి మూల్పూరి సుజాత హైదరాబాద్ యూని వర్సిటి లో ప్లాంట్ సైన్సెస్ లో ఎం. ఎస్. సి. చేసి అత్యున్నత గ్రేడ్ సాధించి బంగారు పతకం అందుకొన్నారు .1996లో పి.హెచ్ .డి.పొందారు .ఐ ఏ ఎస్ తో సమానమైన అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీస్ పరీక్షరాసి ఐసి ఎ ఆర్ అనుబంధ సంస్థ అయిన నూనెగింజల పరిశోధనా సంస్థలో శాస్త్ర వేత్తగా చేరి చమురు గింజల పై ప్రత్యేక పరిశోధనలు చేశారు .
బయో టెక్నాలజీ ,టిస్స్యు కల్చర్ , .జెనెటిక్స్ శాస్త్రాలద్వారా వీటి అధ్యయనం చేసి ,నూనె గి౦జల లోని వంధ్యత్వ సమస్య పరిష్కారానికి విపరీతమైన కృషి చేశారు .పొద్దు తిరుగుడు, గడ్డిపూలు ,కుసుమ నూనె గి౦జలపై పత్యేక పరిశోధనలు చేసి ‘’స్టేబుల్ మేల్ స్టెరిలిటి సిస్టం ‘’ను అభి వృద్ధి చేశారున .ఈ పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించి విశేష కీర్తి లభించింది ,జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా నూనె గింజలలో ‘’ఇన్ సె క్ట్ రెసిస్టన్స్ ‘’అంటే చీడ పీడలను తట్టుకొనే శక్తి ని అభి వృద్ధి చేసి ,రైతులకు గొప్ప మేలు చేకూర్చారు .
సుజాత గారి పరిశోధనా కృషికి’యునెస్కో బయో టెక్నాలజీ యాక్షన్ ఫెలోషిప్’’,నెదర్లాండ్ ప్రభుత్వ ఫెలోషిప్ లు లభించాయి . .పరిశోధనలకోసం ఇంగ్లాండ్ ,అమెరికా నెదర్ లాన్స్ ,ఇజ్రాయిల్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడి వ్యవసాయ విశ్వ విద్యాలయాలను చూశారు .భారత్ –నెదర్లాండ్ దేశాలు నూనె గింజల పై బయో టెక్నాలజీ రంగం లో చేస్తున్న కృషిలో ముఖ్య భూమిక పోషించారు .భారత్ –సెర్బియా దేశాలమధ్య వైజ్ఞానిక సహకార ఒప్పందం లో భాగం గా నొవిసాద్ నగరం లో జరిగిన ప్రత్యేక వైజ్ఞానిక సదస్సుకు ఆహ్వానం అందుకొని హాజరయ్యారు .పొద్దు తిరుగుడు విత్తనాలపై పరిశోధనకు ఆప్రభుత్వానికి చేయూత నిచ్చారు .విలువైన రిసెర్చ్ పేపర్స్ స్వయంగా, ఇతర శాస్త్రవేత్తలతో కలిసీ రాసి ప్రచురించారు
శాస్త్ర వేత్తలు ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు కష్ట నష్టాలు తెలుసుకొంటూ, వారికి లాభ సాటి వ్యవసాయానికి తోడ్పడాలని ఆమె సూచించేవారు .భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐన I.C.A.Rలో చేసిన పరిశోధన విజయాలకు ప్రతిష్టాత్మకమైన ‘’పంజాబ్ రావు దేశముఖ్ మహిళా శాస్త్ర వేత్త అవార్డ్ ‘’శ్రీమతి మూల్పూరి సుజాతగారికి 2004లో లభించి,16-7-2005 న అందుకొన్నారు .ఈ అవార్డ్ పొందిన మొదటి ఆంద్ర మహిళాశాస్త్ర వేత్త కావటం ఆంధ్రులకు గర్వకారణం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-19-ఉయ్యూరు .