” ఆషాఢస్య ప్రథమ దివస్ -మే
ఆషాఢస్య ప్రథమ దివస్ -మేఘం అశ్లిష్ట సానుం
వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ.”(మేఘ సందేశం )
ఇవాళ ఆషాఢమాసం మొదటి రోజు .దీన్ని కాళిదాస మహాకవి తన మేఘ సందేశం కావ్య శ్లోకం లో పొందుపరిచాడు
భావం ఆషాఢమాసం లో మొదటి రోజున కొండమీద మేఘాలు మత్తేభం లాగా ఢీకోట్టినట్లున్నాయి
ఈ రెండుపాదాలు శ్లోకం లో చివరి రెండు పాదాలు వీటికి పైన ఉండే మొదటి రెండుపాదాలు –
తస్మిన్నద్రౌ – కతిచిదబలా -విప్రయుక్తః స కామీ
నీత్వా మాసాన్ – కనకవలయ – భ్రంశరిక్తప్రకోష్ఠః ”
నీత్వా మాసాన్ – కనకవలయ – భ్రంశరిక్తప్రకోష్ఠః ”
ప్రియురాలిని వదిలి వెళ్ళాక విరహ బాధ అనుభవిస్తున్న యక్షుడు చిక్కి శల్యమయాడు .కుబేరుని కొలువులో ఉండే అతని చేతి బంగారు కడియాలు చేతులనుంచి జారిపోతున్నాయి కుబేరుని ఆగ్రహానికి గురై ఒక ఏడాది మానవుడిగా రామగిరిలో ఉంటూ భార్యకు మేఘం ద్వారా సందేశం పంపాడు ఇదే మేఘ సందేశం .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-19-ఉయ్యూరు .
—