కృష్ణాజిల్లా కౌఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
31-క్వాసే క్రిస్టలైన్ మిశ్ర ధాతు రూపకర్త –డా.పచ్చా రామ చంద్రరావు
కృష్ణాజిల్లా కౌతవరం లో 1942మార్చి 21న నారాయణ స్వామి దంపతులకు జన్మించిన డా.పచ్చా రామ చంద్రరావు ఉస్మానియా యూనివర్సిటి నుంచి 1959లో బిఎస్ సి ,1961లో ఏం ఎస్ సి డిగ్రీలు పొందారు .బెంగుళూర్ లో ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో1963లో బి .ఇ.పాసై ,బెనరస్ హిందూ యూనివర్సిటి లో మెటలర్జి ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ తీసుకొని ,1968 పి.హెచ్. డి.అయ్యారు.ఇక్కడే 1964లో లెక్చరర్ గా చేరి ,రీడర్ గా ప్రొఫెసర్ గా పదోన్నతులు అందుకొన్నారు ..శ్రీమతి సుదారావు ను వివాహమాడారు ఆమె వారణాసిలో ఆంధ్రాబాంక్ ఉద్యోగిని .
అఖండ మేధావిగా అప్పటికే గుర్తింపు పొందిన రావు గారు లోహాల త్వరిత ఘనీభవ స్థితి దశలను సిద్ధాంత పరంగా ,ప్రయోగాత్మకంగా నిరూపించి విలువైన సమాచారాన్ని సంపాదించారు .స్థిరమైన లోహపు ఉత్పత్తుల నమూనా తయారీ ,స్వాభావిక లక్షణాలకూర్పు సంసిద్ధపరచటం మొదలైన వినూత్న టెక్నిక్ లను అభి వృద్ధి చేశారు .మొదటగా ‘’క్వాసే క్రిస్ట లైన్ ‘’మిశ్ర దాతు రూపకల్పన చేసి పేరుపొందారు .తన పరిశోధనాఫలితాలను దేశ విదేశీయ పత్రికలలో ప్రచురించారు .అనేక అంతర్జాతీయ ,దేశీయ ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకుగౌరవ సభ్యత్వాలు ,గౌరవ పదవులను ఇచ్చి గౌరవించాయి .’’మెటీరియల్స్ రిసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా ‘’లో గౌరవ సభ్యత్వం పొందారు .కలకత్తాలోని ‘’ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెటల్స్ ,ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్ సొసైటీ ఆఫ్ ఇండియా ,ఇండియన్ సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ (బెంగుళూరు )మొదలైన ప్రఖ్యాత సంస్థలలో ఆయనకు జీవిత సభ్యత్వం ఉన్నది .
డిఫెన్స్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ (D.I.A.T.)వైస్ చాన్సలర్ అయ్యారు ..హైదరాబాద్ లోని ఇంటర్ నేషనల్ అడ్వాన్షడ్ రిసెర్చ్ సెంటర్ ఫర్పౌడర్ మెటలర్జీ అండ్ న్యు మెటీరియల్స్ లో రాజా రామన్న ఫెలోషిప్ పొందారు
1979లో నేషనల్ మెటల్లర్జిస్ట్స్ అవార్డ్ ,1985లో శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం ,మాలవీయ మెమోరియల్ ట్రస్ట్ వారి సీనియర్ అకాడెమి అవార్డ్ రావు గారిని వరించాయి .ఇప్పటికీ బెనారస్ హిందూ యూని వర్సిటి లోని స్కూల్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ,ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లలో నిరంతర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు .తన పరిశోధన ఫలితాలకు 16 పేటెంట్లు పొందిన మహా శాస్త్రవేత్త రావు గారు .
1993లో గోవాలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు ప్లాటినం జూబిలీ లెక్చరర్ గా ఉన్నారు
32-క్లోజ్ పాక్డ్ స్ట్రక్చర్స్ రూప కర్త – పద్మ భూషణ్ డా .పల్లె రామారావు
30-6-1937న కర్నూలులో కేశవరావు దంపతులకు పుట్టిన డా .పల్లె రామారావు1956లో మద్రాస్ యూని వర్సిటి నుంచి బిఎస్ సి ,ఆనర్స్ ,ఆంధ్రాయూనివర్సిటినుంచి 1957లో ఎం. ఏ .డిగ్రీలు అందుకొన్నారు .1964లో బెనారస్ యూని వర్సిటి నుంచి పిహెచ్ డిపొందారు .అమెరికా వెళ్లి ,పెన్సిల్వేనియా యూని వర్సిటిలో 1991లో డాక్టోరల్ రిసెర్చ్ చేశారు .
బెంగుళూరు లోని ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో మెటలర్జీ రిసెర్చ్ అసిస్టెంట్ గా 1960లో చేరి ,రెండేళ్ళు పనిచేసి ,బెనారస్ హిందూ యూని వర్సిటి మెటలర్జికల్ ఇంజనీరింగ్ శాఖలో లెక్చరర్ గా పని చేసి 1967లో రీడర్ ,1975లో ప్రొఫెసర్ అయి అయిదేళ్ళు పని చేశారు .1982లో హైదరాబాద్ లోని డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ లాబ్ కు డైరెక్టర్ ఐ, 9ఏళ్ళు పనిచేశారు .ఖనిజాలనుంచి లోహాలను తయారు చేసే విధానాలను ఆధునిక పరచే ప్రయోగాలు పరిశోధనలు చేశారు .కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ కార్యదర్శిగానూ సేవలందించారు .
లోహ సంగ్రహణ శాస్త్రం –మెటలర్జీ లో విస్తృత పరిశోధనలు చేసిన రామారావు గారు లోహాలు ఏర్పడేప్పుడు వచ్చే బీటలు ,సాగుడు ,పాకటంవంటి లోపాలను గుర్తించి నివారించటానికి ఎక్స్ రే ప్రక్రియను సమర్ధంగా ఉపయోగించారు .లోహాలు ,లోహ మిశ్రమాలలో ఉన్న అతి సూక్ష్మ నిర్మాణాలపైనా ,అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అభి వృద్ధి విషయం లోనూ అవిరామ పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు .’’క్లోజ్ పాక్డ్ స్ట్రక్చర్స్ ‘’(D.H.C.P.,F.E.C.-Double hexagonal Close Pcked FaceCentral Cubic )రూపకల్పనలో విశేష కృషి చేసి ,పరిశోధనపత్రాలు వెలువరించారు .’’ట్రాన్సాక్షన్ ఆఫ్ ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ఆఫ్ మెటల్స్ ‘’పత్రికకు 1987నుంచి ప్రధాన సంపాదకులుగా పల్లె వారున్నారు .’’బులెటిన్ ఆఫ్ మెటీరియాల్ సైన్సెస్ ‘’పత్రికు అసోసియేట్ ఎడిటర్,చైర్మన్ రావుగారు. ‘’మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ‘’పత్రిక అసోసియేట్ ఎడిటర్ కూడా .జర్నల్ ఆఫ్ ప్రెషర్ వెసల్స్ అండ్ పైపింగ్ ,హై టెంపరేచర్ టెక్నాలజీ ,ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫాటిగ్యు,సాధన మొదలైన పత్రికల పరిశోధక సంపాదకమండలి సభ్యులు .
రావు గారి కృషికి తగినట్లు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమి ,ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ అకాడెమి ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థలనుంచి ఫెలోషిప్ అందుకొని , పరిశోధనలో తనకు తానె సాటి అనిపించుకొన్న మేధావి మెటల్లర్జికల్ ఇంజనీరింగ్ లో చేసిన విశేష కృషికి ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు .1964లో పాండ్యా మెమోరియల్ మెడల్ ,1971లో కామని గోల్డ్ మెడల్ ,1973లో నేషనల్ మెటల్లరిస్ట్స్ డే అవార్డ్ ,1979శాంతిస్వరూప్ భాట్నగర్ అవార్డ్ హోమి జహంగీర్ భాభా అవార్డ్ ,1986లో నేషనల్ లెక్చరర్ అవార్డ్ ,వాస్విక్ అవార్డ్ ,1989లో మెటీరియల్సైన్స్ తరఫున I.N.S.A.ప్రైజ్ పొందిన అరుదైన లోహ సంగ్రహణ శాస్త్రవేత్త రామారావు .
భారత ప్రభుత్వం రామారావు గారి అవిశ్రాంత పరిశోధనా దీక్షను గుర్తించి 1989పద్మశ్రీ ,2001లో పద్మభూషణ్ పురస్కారాలు అందించి సత్కరించింది .కేంద్ర ప్రభుత్వం లో ఏషియన్ డెవలప్ మెంట్ శాఖ కార్య దర్శిగా, శాస్త్ర సాంకేతిక శాఖ కార్య దర్శిగా ,ఉన్నారు .పదవీ విరమణ తర్వాత ,అటామిక్ ఎనర్జీరెగ్యులేటరి బోర్డ్ అధ్యక్షులుగా 1995నుంచి 1998వరకు మూడేళ్ళు సేవలందించారు .1999 ఆగస్ట్ లో హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులయ్యారు .జీవిత చరమాంకం స్వస్థలం కర్నూలు లో గడిపారు .
ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-19-ఉయ్యూరు