ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
33-అరటి మట్టలనుంచి పొటాషియం పెర్మా౦గ నేట్ తయారు చేయించిన ఆర్ధికవేత్త –కాళీ పట్నపు కొండయ్య
ప్రముఖ ఆర్ధిక వేత్త ,మేధావి శ్రీ కాళీపట్నం కొండయ్య 1900లో గోదావరి జిల్లాలో జన్మించారు .విజ్ఞాన ఆర్ధిక చరిత్ర శాస్తాలలో సాటిలేని వాడు అనిపి౦చు కొన్నారు స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొనటం వలన వీటికి పూర్తిగా న్యాయం చేయలేకపోయారు .ఆర్ధికరంగం పై విపులమైన అధ్యయనం చేశారు .రూపాయి మారకం రేటు ఒక షిల్లింగ్ నాలుగు పెన్నీలు ఉండాలా ,లేక ఒకషిల్లింగ్ ఆరు పెన్నీలు ఉండాలా అనే సమస్యను ఆంద్ర ప్రాంతం లో ఆయన ఒక్కరే పూర్తిగా అవగాహన చేసుకొని జాతీయ దృష్టితో వివరించిన మేధావి .
ప్రముఖ పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్త జేమ్స్ జీన్స్ రచించిన ‘’యూని వర్స్ అరౌండ్ అజ్ ‘’గ్రంథంలోని ముఖ్యాంశాలను ‘’విశ్వ రూపం ‘’పేరిట అనువదించి తెలుగు విద్యార్ధులకు మహోపకారం చేశారు .అప్పుడు ఆంద్ర యూని వర్సిటి వైస్ చాన్సలర్ గాఉన్న రాధాకృష్ణన్ వీరి కృషిని మిక్కిలి ప్రశంసించి ప్రోత్సహించారు .’’విజ్ఞానం ‘’పేర ఒక మాసపత్రిక కొంతకాలం నడిపారు .
పశ్చిమ గోదావరి జిల్లా నిడద వోలు లో ‘’కెమికల్స్ లిమిటెడ్ ‘’రసాయన పరిశ్రమ నెలకొల్పి ,అరటి చెట్ల మట్టలనుంచి ‘’పొటాషియం పెర్మంగనేట్’’తయారు చేయించారు .దీనిపై విస్తృత పరిశోధనలు ప్రయోగాలు చేసి విజయం సాధించారు . కవికోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన శాస్త్ర వేత్తల కోసం ఏర్పాటు చేసిన నగదు పురస్కారం మొట్టమొదటిసారిగా కొండయ్యగారికే ప్రదానం చేశారు .కొండయ్యగారు బెనారస్ హిందూ యూనివర్సిటిలో పరిశోధన చేస్తూ లెక్చరర్ గా కొంతకాలం పని చేశారు .నిడద వోలులో పరిశ్రమ స్థాపనకోసం 1941లో రాజీనామా చేస్తే వైస్ చాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇష్టపడక కొంతకాలం ఆపేసి నిర్ణయం మార్చుకోమని అర్ధించారు కూడా .కానీ పదవిని త్యజించి తాను అనుకొన్న పరిశ్రమ స్థాపించి కోస్తా జిల్లాలకు మార్గ దర్శి అయ్యారు .కొంతకాలానికి ఆర్ధికంగా నష్టపోయి మూసేశారు .పరిశ్రమ దెబ్బతినటానికి కారణాలు వివిధ కోణాలలో విశ్లేషించారు .
భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నా పేరుకోసం వెంపర్లాడ లేదు .’’ముస్లిం దేశాలలో విజ్ఞాన వికాసం ‘’అనే వీరి రచన పరమ ప్రామాణికంగా ఉండి ,ఇప్పటికీ కాలదోషం పట్టలేదు .కొండయ్యగారి మరో రచన ‘’ఆఫ్రికా పంపకం ‘’కు డాక్టర్ పట్టాభి సీతారామయ్య ఉపోద్ఘాతం రాశారు .1946లో మద్రాస్ యూని వర్సిటి స్నాతకోత్సవం లో ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుగారు కొండయ్యగారిని ఆదర్శం గా తీసుకోవాలని విద్యార్ధులకు ఉద్బోధించారు .స్పూర్తి మంతుడు ,కీర్తి మంతుడు శ్రీ కాళీ పట్నం కొండయ్య 1966లో 66వ ఏట మృతి చెందారు .
34-అమెరికాలో బాంక్ ఏర్పరచిన తొలి ఆంధ్రుడు – జాస్తి సతీష్
శ్రీ జాస్తి సతీష్ గుంటూరు లో 1959లో జాస్తి వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించి ,ఉన్నత విద్యలో రాణించి 1975లో అమెరికా వెళ్లి ‘’వేన్ స్టేట్ యూని వర్సిటి ‘’లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 1984లో బి.ఎస్ .డిగ్రీ పొందారు.ఫెడరల్ రిజర్వ్ బాంక్ లో ఫైనా౦షియల్ సిస్టమ్స్ అనలిస్ట్ గా ఉద్యోగం చేసి ‘’బాంక్ ప్రెసిడెంట్ ‘’అవార్డ్ పొందారు .
1988లో ప్రైవేట్ రంగం లో ప్రవేశించి ‘’నేషనల్ బాంక్ ఆఫ్ డెట్రాయిట్ ‘’లో ఇన్వెస్ట్మెంట్ బాంకర్ అయ్యారు .బాంక్ యాజమాన్య సౌజన్యం తో ఎం .బి .ఏ. చేసి ,తనబాంక్ ను మరో బాంక్ ను మరో బాంక్ స్వాధీనం చేసుకోగా కొంతకాలం పని చేసి ,తర్వాత స్టాండర్డ్ ఫెడరల్ బాంక్ లో చేరి బ్యాంకుల స్థాపనలో పరిశోధనలు చేశారు .అమెరికాలో భారతీయుల యాజమాన్యంలో ఉన్న అన్ని బాంకుల విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ‘’’కీ బాంక్ ‘’లోకూడా పని చేసి నైపుణ్యం సాధించారు .2005లో కొత్త బాంక్ స్థాపనకు ముమ్మర ప్రయత్నాలు చేశారు .మిచిగాన్ రాష్ట్రం లోని ఓక్ లాండ్ కౌంటి పరిధిలో ఉన్న ‘’నోనీ’’నగరం లోఅమెరికా ప్రభుత్వ అనుమతితో ‘’లోటస్ బాంక్ ‘’ను 2007జూన్ లో స్థాపించారు .ఒక ప్రవాస ఆంధ్రుడు విదేశాలలో ఒక బ్యాంక్ ను స్థాపించటం ఇదే మొదలు . 16వ ఏటనే అమెరికా వెళ్లి స్థిరపడి, ఆంధ్రుడిగా మొట్టమొదటి బ్యాంక్ స్థాపించిన ఘనత శ్రీ జాస్తి సతీష్ కు దక్కింది .
ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-19-ఉయ్యూరు
—
—
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever. |
- —
You received this message because you are subscribed to the Google Groups “SAhitibandhu” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z9Sf9%3DCzv6eK4KmDZ-1Ap67tTWq%2BETa6%3D0SVzXasGghVw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.