కొత్త కొలువుకూటం
ఈ మధ్యదాకా ”గౌరవ సభ ”
నలభై రోజుల్నించి ”కౌరవ సభ ”
ఇప్పటిదాకా ”పూతు ”సభ
ఇప్పుడేమో ”బూతు సభ ”
మొన్నటిదాకా ”అమ్మ ”కు వందనం
నేడేమో ” నీయమ్మా నీ యాలి ”లకు అందలం
ఇంతవరకు ప్రజా పాలనే ధ్యేయం
ఇప్పుడు ”విధ్వంసం కూల్చివేతలే ”ఆదర్శం
మాటకు చేత కు నాడు ఆదర్శం
చేతకు మాటకు నేడు మైళ్ళ దూరం
వివేకం విజ్ఞానం దూరదృష్టి నాడు
అజ్ఞానం ,అహంకారం ,అసహనం నేడు
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-19-ఉయ్యూరు