ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -2
హింద్ స్వరాజ్
కొన్ని వారాల తర్వాత గాంధీ ,మళ్ళీ దక్షిణాఫ్రికా వెళ్ళటానికి స్టీం షిప్ ఎక్కినప్పుడు మరలా ఈ విషయాలపై ఆలోచనలో పడ్డాడు .వాటిని రాసి బుక్ లెట్ గా లండన్ లోని జాతీయ వాదులకు పంపాడు .ప్రాధమికంగా ఈ వ్యాసాన్ని గాంధీ మొదటి సారిగా ఒకే చేతితో రాయటం మొదలుపెట్టి చేయి బాధ పెడితే రెండవ చేతితో వడివడిగా కంగారుగా రాసి ,తన సంఘర్షణ నిర్ణయానికి చేరిక మార్గం గా ,అ తర్వాత తాను జీవితాంతం అనుసరించి ,సాగించే విధానంగా రాశాడు .ఈ చిన్న పుస్తకమే ‘’హింద్ స్వరాజ్ ‘’లేక ఇండియన్ హోమ్ రూల్ .’’ ఇందులో రూపు దిద్దుకో బోతున్న భారత స్వాతంత్ర్య ఉద్యమం ,దానికి తీసుకోవాల్సిన సరైన విధానాల లక్ష్యాలు వివరించాడు .లండన్ లోని భారతీయ తీవ్రవాదులు బ్రిటిష్ వారు భారత దేశ ఆర్దికాన్ని దోచేస్తున్నారు అని చెబుతున్న లండన్ లోని భారతీయ తీవ్రవాదులు’’ బ్రిటిష్ వారికి ఇండియాలో స్థానం లేదు ‘’అన్న అభిప్రాయాన్ని సమర్ధించాడు .అదే కాక ఇండియా భౌతిక భావనలతో పాశ్చాత్య నాగరికతను అనుకరించటం సమర్ధనీయం కాదని అది ఒక వ్యాధి అని చెప్పాడు .
ఈ పుస్తకం టెర్రరిజం పై అధికమైన వ్యతిరేక ఒత్తిడిని పెంచింది .గాంధీ తన అహింసా సిద్ధాంత మార్గానికి సంఘర్షణ స్వభావానికి పరీక్ష గా ఒక స్కెచ్ తయారు చేశాడు .ఎంచుకొన్నస్వాతంత్ర్యం అనే ఉత్తమ లక్ష్యం ముందు వ్యక్తిగత ఘర్షణలను దాటి ఆలోచించాలని కోరాడు .’’ప్రతి ఘర్షణ రెండు స్థాయిలలో ఉంటుంది .అవి వ్యక్తులమధ్యా , ,సిద్దా౦ తాల మధ్యా ఉంటుంది .పోరాటం చేసే ప్రతి వాడికి అదొక సమస్య అవుతుంది .అలాగే అనేక భావాలమధ్య ఘర్షణ కూడా అంతే’’అన్నాడు గాంధి .పోరాటం చేసి అలసిపోయాక పరిష్కారానికి దారి వెతుకు తారు .కనుక గాంధీ విధానాలు శత్రువును ఎదుర్కోవటానికి మించిన భావన ఉంటుంది .ఘర్షణ నే ఎదుర్కొనే ,తుదముట్టించే మార్గాలు సూచించాడు .దీనికి తాను ఎంచుకొన్న మార్గానికి ‘’పాసివ్ రెసిస్టన్స్’’అంటే ‘’నిష్క్రియాత్మక నిరోధకత ‘’అనే ముద్ర వేసినందుకు బాధపడ్డాడు .దీనినే ఆయన దక్షిణాఫ్రికాలో అమలు చేసి విజయం పొందాడు .ఇందులో నిష్క్రియత అనేది లేనే లేదు .నిజానికి ఆయన తుఫాను వంటి ఘర్షణ లను ప్రభుత్వ అధికారులతో ఎదుర్కొన్నాడు .అవి ప్రతిఘటన, నిరోదాలకు మించి ఉండేవి .అది సత్యమార్గమేది ?,దానికోసం నిలబడటం ఎలా? ,అధికారం కోసం సత్య మార్గమేది? అని తెలియ జేసే నిరంతర శోధన అన్నాడు మహాత్ముడు .
ఘర్షణ లో నిమగ్నమై పని చేయటానికి 1906లోనే గాంధీ ఒక కొత్త పేరు ఆలోచించాడు. తన ‘’ఇండియన్ ఒపినియన్ ‘’పేపర్ లో సరైన పదాన్ని సూచించమని పాఠకు లకు పరీక్ష పెట్టాడు .సరైన పదాన్ని సూచించి గెలుపొందినవారికి పుస్తకం బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు .ఐతే ఆయన కజిన్ మదన్ లాల్ సూచించిన పదానికి గాంధీ నగిషీ చెక్కి ‘’సత్యాగ్రహం ‘’అని పేరు పెట్టాడు .ఇందులో రెండు సంస్కృత పదాలు సత్య ,ఆగ్రహం ఉన్నాయి .సత్యం అంటే నిజం .ఆగ్రహం అంటే కోపం కాదు ‘’గట్టిగా పట్టుకోవటం ‘’ఈ రెండుకలిపితే సత్యాన్ని గట్టిగా పట్టుకోవటం అంటే ఆచరించటం .దీన్ని గాంధి ‘’సత్య శక్తి ‘’అని సిమ్ప్లి ఫై చేశాడు . ఈ శోధనలో ఆయన దృష్టి అంతా సత్యం పైనే నిలిచింది .దీనిపై ఎవరికీ సరైన అభి ప్రాయం ఉండక పొవచ్చు అన్నాడు .ప్రతి సంఘర్షణ అస్తిత్వం లోతైన తేడాను ఏది సరైనది అన్నదానిపై రెండు భిన్న అభిప్రాయాలు చెబుతుంది .మొదటగా సంఘర్షణ చేసే పని చెప్పి ,తర్వాత దాన్ని ఆసమస్యకు రెండు వైపులనుంచి చూడటం చెబుతుంది .ఇందులో ప్రత్యర్ధి మాటను ,అభిప్రాయాన్ని కూడా తన అభిప్రాయం తోపాటు అర్ధం చేసుకోమని చెబుతుంది.దీనినే అమెరికా మాజీ రక్షణ సెక్రెటరి రాబర్ట్ మాక్ నమారా ‘’ది ఫాగ్ ఆఫ్ వార్ ‘’డాక్యుమెంటరి సినిమాలో సలహా ఇస్తూ ‘’Emphathize with the enemy ‘’ ( అవతలి వాడి ని అర్ధం చేసుకొని, అతని మనోభావాలు పంచుకోవటం )అని నొక్కి వక్కాణించాడు.
ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ అండ్ టెర్రరిజం ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-19-ఉయ్యూరు . . .