మల్లాది వారి భారత ప్రవచనం
గత కొద్దికాలంగా యూట్యూబ్ లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి మహాభారత ప్రవచనాలు చూస్తున్నాను .హృదయపు లోతుల్లోంచి ,పెల్లుబికే వాక్ గంగా ప్రవాహ సదృశంగా ,వ్యాస హృదయావిష్కారంగా ,ధర్మ మార్గ పథగామినిగా , అవసరమైన తిక్కనగారి పద్య మకరందం కరుణశ్రీ గారి తేనే బిందువులు ,హనుమద్రామాయణ ఉల్లేఖనాలు మనుధర్మశాస్త్ర వివరణలతో ఆసాంతం శ్రవణ పేయంగా ,మార్గ దర్శనంగా భాసించి , ఒక దంపుడుకు ,పల్లీ బఠాణీల కు తావు లేకుండా మహదానంద0 కలిగిస్తోంది . ఆసక్తి ఉన్న వారు చూసి ధన్యులు కాగలరు -దుర్గాప్రసాద్